Home News శ్రీలంక పేలుళ్లకు కేరళ మూలాలు? ఎన్.ఐ.ఏ దాడుల్లో పలువురు అరెస్ట్

శ్రీలంక పేలుళ్లకు కేరళ మూలాలు? ఎన్.ఐ.ఏ దాడుల్లో పలువురు అరెస్ట్

0
SHARE
శ్రీలంకలో ఇటీవల జరిగిన  ఉగ్రవాద పేలుళ్ల తాలూకు మూలాలు కేరళలో లభ్యమవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ కేరళలోని కసర్గడ్, పలాక్కోడ్ ప్రాంతాలలో జరిపిన దాడుల్లో ఆరుగురు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్ అయ్యారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సభ్యులను సమకూర్చే వ్యక్తులతో వీరు నిరంతరం సంబంధాలు కలిగివున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్  వార్తా కధనం ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి .
ఆషిక్, ఇస్మాయిల్, సలావుద్దీన్, జాఫర్ సాధిక్, షాహుల్ హమీద్, షంషుద్దీన్. వీరంతా కోజికోడ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రషీద్ అబ్దుల్లా అలియాస్ అబూ ఇసా అనే ఇస్లామీ స్టేట్ సంస్థ ప్రతినిధితో సంబంధాలు కలిగివున్నారు.
అరెస్ట్ అయిన వ్యక్తుల నుండి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్లు, జాకిర్ నాయక్ వీడియో సందేశాలు ఉన్న సీడీలు  మరియు ఇతర ఉగ్రవాద సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.
Source: Organiser