Home News జాతీయ గీతం సమయంలో ఇస్లామిక్ నినాదాలు – వారించిన హిందూ విద్యార్థిపై దాడి

జాతీయ గీతం సమయంలో ఇస్లామిక్ నినాదాలు – వారించిన హిందూ విద్యార్థిపై దాడి

0
SHARE

పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణా జిల్లాలో 9వ తరగతి విద్యార్థిపై  ముస్లిం విద్యార్థుల ముఠా దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. ఇందుకు కారణం పాఠశాలలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు ‘అల్లాహు అక్బర్’ అని అరవడంపై ఆ విద్యార్థి అభ్యంతరం వ్యక్తం చేయడమే. ఈ సంఘటన జూలై 7 న జరిగినప్పటికీ, వారం తరువాత వెలుగులోకి వచ్చింది. ముస్లిం విద్యార్థుల దాడిలో గాయపడిన అరుప్ హల్దార్ అనే విద్యార్ధి  ఆసుపత్రి పాలయ్యాడని, పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

జూలై 7 న, పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణ జిల్లాలోని తాల్ది మోహన్‌చంద్ హైస్కూల్‌ పాఠశాల ప్రార్థనల తరువాత జాతీయ గీతం పాడుతున్నప్పుడు ముస్లింల విద్యార్థులు ‘అల్లాహు అక్బర్’ తో పాటు ఇతర ఇస్లామిక్ నినాదాలు చేయడం ప్రారంభించారు. అదే పాఠశాలలోని  9 వ తరగతి విద్యార్థి అరుప్ హల్దార్ ఇలా జాతీయ గీతాన్ని అగౌరవపరచడాన్ని సహించలేకపోయాడు. ఇదేమిటని వాళ్ళను ప్రశ్నించాడు. వెంటనే 10 నుంచి 12 మంది ముస్లిం విద్యార్థుల ముఠా అతని చుట్టూ గుమిగూడి అతన్ని తీవ్రంగా కొట్టింది. అరుప్‌ను రక్షించడానికి ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రయత్నించినా కూడా వారు కొట్టడం ఆపలేదు. తీవ్రంగా గాయపడిన అరుప్‌ను చికిత్స కోసం క్యానింగ్ ఆసుపత్రికి తరలించారు.

అరుప్ హల్దార్‌ను కొట్టిన సంఘటనలో ముస్లిం విద్యార్థి సఫీకుల్ ఘాజీపై  స్థానిక పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. ఆసుపత్రిలో అరుప్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే ఆశ్చర్యంగా, ఈ విషయాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని, తనను కొట్టిన ముస్లిం విద్యార్థులపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ నోస్కర్ అరుప్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ ఒత్తిడి కారణంగా, పోలీసులు కూడా నిందితుడు ముస్లిం విద్యార్థి షఫీకుల్ గాజీని స్టేషన్ నుండి విడుదల చేశారు. మరోవైపు, డిశ్చార్జ్ అయిన అరుప్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని మళ్ళీ ఆసుపత్రిలో  చేర్చాల్సి వచ్చింది. అరుప్ ప్రస్తుతం కన్నింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఉదారవాదులు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల ఉపేక్షా ధోరణి

జై శ్రీ రామ్ అని నినాదాలు చేస్తూ మూక దాడులకు పాల్పడుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నవారికి ఇలాంటి సంఘటనలు మాత్రం కనిపించవు. మతకారణాలవల్లకాక  బైక్  దొంగిలించినందుకు తాబ్రేజ్ అనే బైక్ దొంగను కొందరు కొడితే, ఆ సంఘటనను వక్రీకరించి  జైశ్రీరామ్‌ అని అననందుకు దాడి చేశారంటూ  తప్పుడు కథనాన్ని ప్రచారం చేశారు. అయినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంఘటనను ఖండించి, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

 జై శ్రీ రామ్ నినాదంపై నకిలీ వార్తలను తయారు చేసి  అల్లర్లను సృష్టించే  స్వయం ప్రకటిత ఉదారవాదులు ఈ సంఘటన మీద, జై శ్రీరామ్ నినాదాలు చేసినందుకు బిజెపి కార్యకర్తలు  లేదా మద్దతుదారులను  తాలిబానీ శైలిలో హత్య చేయబడ్డ ఇతర సంఘటనలపై మౌనంగా ఉన్నారు. వారు దానిని విస్మరించాలని లేదా బయటపడకుండా చేయాలని భావిస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రంలోని టిఎంసికి చెందిన మంత్రులు కానీ,  కాంగ్రెస్ నాయకులు గాని ఈ సంఘటనలపై విచారం వ్యక్తం చేయలేదు. ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వలేదు.

జై శ్రీ రామ్ నినాదం  విన్నప్పుడల్లా టిఎంసి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి  కోపం వస్తుందని తెలుసు. కానీ జై శ్రీ రామ్  పట్ల ఆమెకున్న అసహనం ప్రజల ప్రాణాలను తీస్తోంది, వీటి పట్ల ఆమె, ఆమె ప్రభుత్వం మౌనంగా ఉన్నాయి. అల్లాహు అక్బర్ అంటూ జాతీయ గీతాన్ని కించపరచినప్పుడు, అందుకు  అభ్యంతరం తెలిపినవారిపై దాడులు జరుగుతున్నప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం  ఏమి తెలియనట్లు మౌనంగా ఉంటున్నది. మరోవైపు టిఎంసి నాయకులు  ఉత్తర ప్రదేశ్‌లో తిరుగుతూ రాజకీయప్రాబల్యాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.