Home News దారుస్సలాం వద్ద దళిత యువకుడిపై దాడి.. మృతదేహం హుస్సేన్ సాగర్లో లభ్యం

దారుస్సలాం వద్ద దళిత యువకుడిపై దాడి.. మృతదేహం హుస్సేన్ సాగర్లో లభ్యం

0
SHARE

హైదరాబాద్: పాతబస్తీలోని మజ్లీస్ పార్టీ కార్యాలయానికి అత్యంత సమీపంలో జరిగిన సంఘటన  ఓ దళిత యువకుడిపై దాడికి దారితీసింది. అనంతరం రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం హుస్సేన్ సాగర్లో లభ్యమవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 

వివరాల్లోకి వెళితే.. ఎంఐఎం పార్టీ కార్యాలయం వద్ద బిర్జు మాదిగ అనే యువకుడు కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్నాడు. ఆదివారం అతడి సోదరి వివాహ కార్యక్రమం మొత్తం ముగించుకున్న బిర్జు, మద్యం సేవించి తన ఇంటి ముందు కూర్చుని, అనంతరం మత్తులో ఎవరితోనో సెల్ ఫోన్లో మాట్లాడుతూ తన ఇల్లు అనుకుని పక్కనే ఉన్న మరొక ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అంతే కాకుండా మద్యం మత్తులో పొరుగింట్లో తన చెల్లి పోలికలతో ఉన్న మరొక యువతిని పిలవడంతో అదే ఇంట్లో ఉన్న ఫిరోజ్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి అతడిపై దాడి చేశాడు. 

గాయపడ్డ బిర్జు జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పి, తన చెల్లిగా కనిపించడంతోనే పిలిచినట్టు వివరణ ఇచ్చాడు. ఇది జరిగాక సోమవారం శ్రీను అనే మరో వ్యక్తి వచ్చి ఇలా ఎందుకు చేసావని ప్రశించడంతో మనస్తాపం చెందిన బిర్జు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అనంతరం రెండురోజుల తరువాత అతడి మృతదేహం బుధవారం నాడు హుస్సేన్ సాగర్లో లభ్యమైంది. 

బిర్జు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు అతనితో పాటు ఎవరున్నారనేది తమకు తెలియదని అతని కుటుంబ సభ్యలు తెలియజేసారు. 

ఘటన గురించి తెలియగానే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మృతుడి ఇంటికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుండి వెళ్లిపోవాల్సిందిగా కోరడంతో పాటు మృతుడి కుటుంబాన్ని ‘రక్షణ’ పేరిట మరో ప్రాంతానికి తరలించారు. 

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మంద కృష్ణమాదిగ కూడా మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ఘటనపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోరారు. మృతుడిపై దాడికి పాల్పడిన అర్బాజ్, కరీం, ఫిరోజ్, హాజీ అనే వ్యక్తులను బాధ్యులుగా చేస్తూ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసారు. 

ఎంఐఎం పార్టీ మృతుడి కుటుంబానికి న్యాయం చేసి, దళితులపై తమకున్న ప్రేమను నిరూపించుకోవాల్సిందిగా కోరారు.  

Source: Deccan Chronicle