Home News కుల వివక్షత, అంటరానితనం లేకుండా సామరస్యం వెల్లివిరిస్తున్న ఖమ్మం జిల్లాలోని ” వల్లభి” గ్రామం

కుల వివక్షత, అంటరానితనం లేకుండా సామరస్యం వెల్లివిరిస్తున్న ఖమ్మం జిల్లాలోని ” వల్లభి” గ్రామం

0
SHARE

మన సమాజంలో  కుల వివక్ష లేకుండ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ తరతమ బేధాలు లేకుండా సమరసతతో అందరి అభివృద్ధికి బాటలు వేయడమే హైందవ జీవనం. దానికి తగినట్లుగానే ఖమ్మం జిల్లాలోని  వల్లభి గ్రామం. ఈ గ్రామం భక్తి పరంగా, సామాజికంగా అందరి మనసులను దోచేది. ఈ ఊర్లోనే 13 భజన మండలిలు వున్నాయి. 1947 లో నిర్మించిన శ్రీ సీతారాముల దేవాలయం పూజారులు ఎస్ సి వర్గానికి చెందిన మాదిగ వంశం వారు.ఇప్పుడు నాలుగో తరానికి చెందిన అనంత రాములు ఆ గుడిలో పూజారిగా అర్చనలు కొనసాగిస్తున్నారు.

ఇదొక విశేషం కాగా బ్రాహ్మణ వంశానికి చెందిన పూజారి పెద్ద రామప్ప మాదిగ, మరియు గౌడ పూజారులకు శిక్షణ ఇవ్వటం మరో విశేషం. అంతే కాకుండా వూర్లో వున్న గ్రామదేవత ముత్యాలమ్మ గుడి ని నిర్మాణం చేయడం లో పెద్ద రామప్ప దే ప్రధాన పాత్ర వుంది.

ముదిగొండ మండలం లోని వల్లభి గ్రామ ప్రజలకు వెంకటనారాయణ అను భక్తుడు ప్రేరణ కాగా వీరి గురువు రాములు కు అన్ని వర్గాల ప్రజలను భక్తి మార్గం లో వుంచిన ఘనత వుంది. యువకులు, విద్యార్థులు, పిల్లాపాప అందరూ గ్రామంలో జరిగే అన్ని పండుగలలో పాల్గొనటం శుభసూచకం.

సామాజిక సమరసతా వేదిక ఈ మాదిగ పూజారులను సత్కరించింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారం తో జరుగు సీతారాముల దేవాలయ పునరుద్ధరణ లో సహకరిస్తుంది. సమరసతా వేదిక రాష్ట్ర కార్యదర్శి జయపాల్ రెడ్డి నిత్యం గ్రామ ప్రజల తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కారణంగా అన్ని వర్గాల ప్రజలలో సామరస్యం, ఆనందం మరింత వెల్లివిరిస్తుంది.

జనవరి 29 న జరిగిన సమరసతా కార్యక్రమం లో స్వామి అన్నపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. వల్లభి గ్రామ వీధుల్లో ఊరేగింపు జరిగింది. గ్రామ సర్పంచ్ బిక్షాల బిక్షం అన్ని విధాల సహకారం అందించారు. కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉల్లాసంగా జరిగింది.

గ్రామ యువకులు త్రి సాయి, అఖిల్, శ్రీ హరి మరియు శ్రీ మతి గుంటుపల్లి నాగమణి, కుక్కల మాణిక్యమ్మ, గంగాధర భూ లక్ష్మి, సూరంపల్లి రామంజక్క, ఏనుగుల శ్రీ నివాస రావు తదితర భక్తులు వారం రోజులు గా కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేశారు.