Home News వి హెచ్ పి : హిందువుల మనోభావాలును దెబ్బతీస్తున్న చంద్రబాబు

వి హెచ్ పి : హిందువుల మనోభావాలును దెబ్బతీస్తున్న చంద్రబాబు

0
SHARE

హిందువుల మనోభావాలను దేబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ఘాటుగా విమర్శించింది. శనివారం ఇమాక్స్ నుంచి రాజ్ భవనం వరకు విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపు చేపట్టింది. అనంతరం గవర్నర్ గారికి వినతి పత్రం అందచేసింది. తిరుమలలో చేపడుతున్న నిర్మాణాలు శాస్త్రవిరుద్ధమని పీఠాదిపతులు చెబుతున్నప్పటికీ ఆ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తోసిపుచ్చడం సబబుకాదని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రామరాజు విమర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వివాదాస్పదంగా మారిందని అయన విమర్శించారు. ముఖ్యంగా బోర్డు చైర్మన్ పుట్టా సుధకర్ యాదవ్ నియామకం తో పాటు బోర్డు సభ్యుల ఎంపిక గందరగోళంగా మారిందన్నారు.

గతంలో పుట్టా సుధాకర్ యాదవ్ అన్య మతస్తులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆధారాలు ఉన్నపటికీ ఆయనను కొనసాగించడం ఏమిటని అయన ప్రశ్నించారు. తక్షణం పుట్టా సుధాకర్ నియామకాన్ని రద్దు చేయాలనీ అయన డిమాండ్ చేశారు.

గత కొన్నేళ్ళుగా టిటిడి జేఈఓగా పనిచేస్తున్న శ్రీనివాస రాజు పై అనేక ఆరోపణలు ఉన్నాయని అతనినే కొనసాగించడంలో అంతర్యం ఏమిటని అయన నిలదీశారు. టిటిడి లో జరుగుతున్న అక్రమాలపై మీడియాలో విస్తృత ప్రచార జరుగుతున్నప్పటికి  ఎలాంటి విచారణ చెప్పట్టడంలేదన్నారు. టిటిడి లో పని చేస్తున్న ఉద్యోగులు అన్యమత ప్రచారం చేస్తూ పట్టుబడుతున్నప్పటికి ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్నారు. ప్రతి ఏట వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో వివిధ రంగాలకు నిధులు ఖర్చు చేస్తున్నారని, అందులో అవినీతి జరుగుతున్న పట్టించుకున్న నాథుడే లేరన్నారు. స్వామి వారి సేవా టికెట్లను అక్రమంగా అమ్ముకుంటూ లక్షలు సంపాదిస్తున్నరని అందుకు వారిపై చర్యలు చెప్పట్టడం లేదన్నారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో )

విశ్వ హిందూ పరిషత్ వారు గవర్నర్ కి సమర్పించిన వినతి పత్రం

పేజి 1
పేజి 2
పేజి 3
పేజి 4