Home News గ్రామ పెద్దలను సత్కరించిన సామాజిక సమరసతా వేదిక

గ్రామ పెద్దలను సత్కరించిన సామాజిక సమరసతా వేదిక

0
SHARE

రాజకీయం మనుషులను విడదీస్తే, ధర్మం అందరినీ కలుపుతుందని,గతంలో  గ్రామ చావిడీ లలో జానపద కళారూపాలను ప్రదర్శించి, కులాలకతీతంగా  వావివరుసలు కలుపుకుని సామరస్యంగా జీవించారనీ సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ తెలియచేసారు.

జగిత్యాల జిల్లా వేములకుర్తి గ్రామం లో జూన్ 5 న  జరిగిన సమరసతా సమ్మేళనం లో ప్రసాద్ జీ మాట్లాడుతూ హిందూ ధర్మం కేవలం మానవుల శ్రేయస్సు గురించే కాకుండా సమస్త జీవరాసుల సంక్షేమం గురించి ఆలొచించాలని పేర్కొన్నదని, ఇస్లాం,క్రైస్తవం ల వలె  ఒకే  దేవుడు- సామూహిక  ప్రార్థనల వరకే పరిమితం కాకుండా హిందూ  జీవనం  ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దిశలో అలాగే సత్యాన్వేషణ కోసం సాగె సమగ్ర విధానమని తెలియ చేసారు.

ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సత్యం నవ్యశ్రీ, జిల్లా అధ్యక్షులు  ఆకుల వెంకట రమణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మంత రాజేంద్ర, సేవా ప్రముఖ్ ఆకుల రాజేందర్,విభాగ్ కార్యవాహ్ భూమయ్య,అంకజ్ భరత్ ,దేవదాస్ , వెంకటాద్రి , రామానుజం తదితరులు పాల్గొన్నారు. గ్రామం లోని 24 మంది కుల పెద్దలకు సన్మానం చేయగా,గోదూర్ గ్రామ యువకులు మరియు పాఠశాల విద్యార్థులు కోలాటం మరియు నృత్యాలతో ప్రదర్సన నిర్వహించారు.