Home News విశ్వ శ్రేయస్సుకు మార్గం చూపుతున్న భారత్ – డా కృష్ణగోపాల్ జీ

విశ్వ శ్రేయస్సుకు మార్గం చూపుతున్న భారత్ – డా కృష్ణగోపాల్ జీ

0
SHARE
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు భారతదేశమే పరిష్కారం చూపగలదు. సర్వకోటి యందు దైవాన్ని దర్శించగలిగిన  హిందూత్వమే ప్రపంచానికి మార్గం చూపగలదు అని ఆరెస్సెస్ సహా సర్ కార్యవాహ్ డా. కృష్ణగోపాల్ గారు అన్నారు. ఈ హిందుత్వ భావన ఆధారంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ మొదలైన రంగాలలో ఈ దేశానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ఆరెస్సెస్ గత 92 ఏళ్లుగా కృషి చేస్తోంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ , భాగ్యనగర్ వారు ఆదివారం (24 సెప్టెంబర్) నిర్వహించిన ఎన్ టి ఆర్ స్టేడియం లో విజయదశమి ఉత్సవం లో వారు ముఖ్య వక్తగా పాల్గొన్నారు.   ప్రపంచంలోని రోమ్, గ్రీక్, పర్షియా లాంటి ఎన్నో నాగరికతలు కొన్ని ఆక్రమణ వలన కాల గర్బంలో కలిసి పోయినవి. కేవలం భారత్ మాత్రమే ఇలాంటి అనేక విచ్చినకర శక్తులను ఎదుర్కొని ప్రస్తుతం ఒక దిగ్విజయ శక్తి గా విశ్వా గురువు గా నిలబడే శక్తి ను సంతరించుకుంటున్నది.
1925లో విజయదశమి రోజున డా హెడ్గెవార్ ద్వార ప్రారంభమైన సంఘం హిందూ సంఘటన ద్వారా సమాజ పరివర్తన, పూర్వవైభవం తిరిగి నెలకొంటాయని చెప్పినపుడు చాలామంది విశ్వసించలేదు. కానీ లక్షలాది మంది స్వయంసేవకుల నిరంతర కృషి, త్యాగాల ఫలితంగా ఈనాడు దేశమంతటా సంఘం పట్ల, సంఘ కార్యపద్దతి పట్ల విశ్వాసం ఏర్పడింది.
ఒకప్పుడు 15 ఆగస్టు, 26 జనవరి కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఏమాత్రం లేని ఈశాన్య రాష్ట్రాలలో నేడు సర్వత్రా జాతీయ భావం తొణికిసలాడుతోంది. దేశమంతటా జాతీయవాదులు, సామాజిక చింతన కలిగినవారు ఏకం కావడంతో ద్విజాతీయ, విద్రోహక శక్తులు వెనుకంజ వేస్తున్నాయి.
రాజకీయాల స్వరూపం మారిపోయింది. ఒకప్పుడు ముస్లిం సంతుష్టీకారణ ప్రధానంగా సాగిన రాజకీయలలో మార్పు వచ్చింది. 2014 ఎన్నికల తరువాత 83 శాతం హిందువులను, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేశామని కొన్ని పార్టీలు అంగీకరించాయి కూడా. మత పరమైన రిజర్వేషన్లు దేశ విభజన కు దారి తీస్తాయి అని 1948 లో మైనారిటీ  కమిషన్ చైర్మన్ గా ఉన్న  సర్దార్ వల్లభాయి పటేల్  హెచ్చరించారు.  అదే విషయాన్నీ సుప్రీమ్ కోర్ట్ కూడా వ్యతిరికించింది.
శక్తి ఉపాసన – సమాజ పరివర్తన సంకల్పంతో స్వయంసేవకులు 92 సంవత్సరాల పాటు సాగించిన కృషి ఫలితమే ఈ మార్పు అని కృష్ణ గోపాల్ గారు అన్నారు.
అంతకుముందు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వినోద్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ “ఒకప్పుడు యూరప్ అంతటా పునరుజ్జీవనం సాగినట్లే నేడు భారత్లో పునర్ జాగరణ సాగుతున్నది” అన్నారు. ఈ పునర్నిర్మాణ మహకర్యంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. సభా కార్యక్రమానికి ముందు భవ్యమైన పథ సంచలనంలో  పదివేల మందికి పైగా గణవేశదారీ స్వయంసేవకులు పాల్గొన్నారు. అద్భుతమైన ఘోష్ వాదన నగర వీధులలో మారుమ్రోగింది.
విజయ దశమి ఉత్సవం సందర్బంగా 10 వేల మంది గణవేష్ దారి స్వయంసేవకులు నగర వీధులలో పథ సంచలన్ నిర్వహించారు. రెండు వాహినిలుగా విడిపోయి అశోక్ నగర్  ప్రాంతంలో ఒకే చోట కలిసిని ప్రదేశం కన్నుల విందుగా సాగింది. ముస్లిమ్స్ యువకులు మహిళలు సైతం పథ సంచలన్ ను స్వాగతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here