Home News బెంగళూరు లో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య

బెంగళూరు లో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త శ్రీ రుద్రేష్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బెంగుళూరు లోని శివాజీ నగర్ లో కామరాజ్ రోడ్ లో కత్తులతో దాడి చేసి హత్య చేసారు.

42 సంవత్సరాల శ్రీ రుద్రేష్ శివాజీ నగర్ వాస్తవ్యుడు. ఉదయం ఆర్.బి.ఎన్.ఎం.ఎస్ గ్రౌండ్ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో జరిగిన పథ సంచలన్ లో పాల్గొని ఇద్దరి స్నేహితులతో తిరిగి వస్తున్న సమయంలో మోటార్ సైకిల్ పైన వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో మెడ భాగంలో విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రుద్రేష్ ని ఆసుపత్రి లోకి చేర్చేలోపే తుది శ్వాస విడిచారు.

rudresh

ఈ హత్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు, బి జె పి నాయకులు మరియు ప్రజలు స్థానిక కమర్షియల్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించి హంతకులను గుర్తించి కఠినంగా చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు సోమవారం (17-అక్టోబర్) ఉదయం 9 గంటలకు దండుమరియమ్మ సర్కిల్, శివాజీ బస్ స్టాండ్, బెంగళూరు లో ఈ హత్య కు వ్యతిరేకంగా నిరసన ప్రకటించనున్నారు. శివాజీ నగర్ నియోజక వర్గం లో ఈ రోజు బంద్ కు గూడా పిలుపునివ్వడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here