Home News రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ట ప్రచారక్ శ్రీ సూర్య నారాయణ రావు (సూరుజి)...

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ట ప్రచారక్ శ్రీ సూర్య నారాయణ రావు (సూరుజి) మృతి

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ట  ప్రచారక్  శ్రీ సూర్య నారాయణ రావు (సూరుజి)  గారు శుక్రవారం రాత్రి 11 గంటలకు బెంగళూరులోని సాగర్ అపోలో హాస్పిటల్ లో కన్నుమూసారు. 93 సంవత్సరాలు వయసు గల వారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారు. సూరూజి గత 70 సంవత్సరాల నుండి ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గా సేవలు అందించారు.

సూరూజి 23 ఆగష్టు 1920 వ తేదిన క్రిష్ణప్ప, సుందరమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. 1942 లో విద్యార్థి దశలో ఉన్నపుడే ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1946 బిఎస్సి గణితంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పూర్తి సమయ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా మారారు. యాదవరావు జోషీజి మార్గదర్శకంలో  కర్ణాటక నుంచి  వచ్చిన మొదటి ముగ్గురు ప్రచారకులలో సూరూజి, (శేషాద్రి జి, చంపకనాత్ జి) ఒకరు.

సూరూజి చిన్న తమ్ముడు కే నరహరి గారు జ్యేష్ట  స్వయంసేవకులు, చిన్న చెల్లెలు రుక్మిణి రాష్ట్ర సేవికా సమితి  సీనియర్ కార్యకర్త. మిగతా ముగ్గురు తమ్ముళ్లు  అనంతు, గోపీనాథ్, శివ గారు స్వర్గస్తులైనారు.

సూరూజి మృతి పట్ల దేశ ఫ్రదానమంత్రి శ్రీ నరేంద్ర మోది గూడా తన సంతాపాన్ని తెలియచేసారు.

సూర్యనారాయణ రావు గారు  సంఘంలో వివిధ భాద్యతల్లో సేవలందించారు. కర్నాటక ప్రాంతంలో విభాగ్ ప్రచారక్ గా, తమిళనాడు ప్రాంత ప్రచారక్ గా (1972 నుండి 1984 వరకు) తరువాత తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంయుక్తంగా క్షేత్ర ప్రచారక్ గా ఉన్నారు. చాల సంవత్సరాల పాటు వారు అఖిల భారత సేవా ప్రముఖ్ గా ఉన్నారు. వారి మార్గ దర్శనంలో సేవా విభాగనికి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. సూరూజి అమెరికా, ట్రినిడాడ్, కెనడా, ఇంగ్లాడ్, జర్మని,హాలండ్, నార్వే, కెన్యా, మలేషియా, సింగపూర్ మరియు నేపాల్ వంటి దేశాల్లో కూడా  పర్యటించారు.

సూరూజి విశ్వహిందు పరిషత్, వనవాసి కళ్యాణ పరిషత్, ఆరోగ్య భారతి, సేవా భారతి వంటి వివిధ సంస్థలతో అనుభందాన్ని కలిగివుండేవారు. వారు 2012 వ సంవత్సరం వరకు అఖిల భారత కార్యకారిణి సదస్యులుగా (కేంద్ర కార్యకారిణి మండలి) ఉన్నారు.

శ్రీ గురూజి నేతృత్వంలో, సూర్యనారాయణ రావు గారికి 1969 వ సంవత్సరంలో కర్ణాటక లోని ఉడుపిలో జరిగిన సాదుసంతు సమ్మేళనానికి సంబంధించిన  కార్యనిర్వహణ బాద్యతలను అప్పగించారు. అప్పటికి విశ్వహిందు పరిషత్ స్థాపించి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇక్కడే సాదుసంతులు, ధర్మాచారులతో కూడిన సభలో ద్వారానే హిందూ సమాజం నుండి అంటరానితనాన్ని నిర్మూలించడానికి చారిత్రాత్మకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ గురుమూర్తి గారు సూరూజి రాసిన ఒక పుస్తకానికి ముందుమాట రాస్తూ, తన ఆర్ఎస్ఎస్ అనుబందానికి మొదటి నుండీ సూరూజి యే కారణం అని తెలిపారు, సూరూజి అపారమైన ప్రేమతో తనలో ఉన్న లోపలను సరిదిద్దుతూ, సానుకూల దృక్పతాన్ని పెంపొందింపచేసారు అని అన్నారు. ఆ కారణంగానే తనలో సమాజంపై భక్తి భావన పెరిగి, ఈ ఆధునిక సమాజాన్ని తనలో జీర్ణించుకునేలా చెసింది లేదంటే ఈ ఆధునిక సమాజంలో నేను జీర్ణమై పోయేవాణ్ణి  అన్నారు.

ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ జీ, సర్ కర్యవాహ శ్రీ భయ్యాజి జొషి, సహసర్ కర్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబళే, శ్రీ సురేష్ సోని, శ్రీ కృష్ణగోపాల్, శ్రీ భాగయ్య వంటి తదితర సంఘ ప్రముఖులు శ్రీ సూరూజి మృతికి సంతాపాన్ని తెలిపారు.