Home Rashtriya Swayamsevak Sangh సిపిఐ (ఎం) అనుచిత ఆరోపణలను ఖండించిన ఆర్ ఎస్ ఎస్

సిపిఐ (ఎం) అనుచిత ఆరోపణలను ఖండించిన ఆర్ ఎస్ ఎస్

0
SHARE

సిపిఐ (ఎం) అనుచిత ఆరోపణలను ఖండించిన ఆర్ ఎస్ ఎస్

నిన్న ఢిల్లీ లో సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశాన్ని అప్రజాస్వామిక శక్తులు కొన్ని ఆటంకపరచడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఖండించింది. “ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడు ఇటువంటి సమాజ వ్యతిరేక శక్తులనుగాని, చట్టబద్ధమైన కార్యకలాపాలను అడ్డుకునే అప్రజాస్వామిక పద్దతులనుగాని సమర్ధించదు’’ అని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ డా. మన్మోహన్ వైద్య అన్నారు.

అయితే ఈ సంఘటన వెనుక ఆర్ ఎస్ ఎస్ ఉన్నదంటూ సిపిఐ (ఎం) చేసిన ఆరోపణను సంఘ ఒక ప్రకటనలో  ఖండించింది. దీనిని బట్టి భారత్ లో సంస్థకు నిరంతరం పెరుగుతున్న ఆదరణ, గౌరవం చూసి ఆ పార్టీ భయానికి, ఆందోళనకు గురిఅవుతున్నట్లు కనిపిస్తోందని ప్రకటనలో పేర్కొంది.

నిజానికి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలే కేరళలో సత్యాన్ని మరుగున పరచే కమ్యూనిస్టుల అప్రజాస్వామిక, అరాచక , దౌర్జన్యపూరిత పద్దతులను ఎదుర్కొంటున్నారు.

Above is a translation of the original Statement in English

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here