Home Telugu Articles భారత్ లో హిందువులపై దాడులు ఖండించగలరా?

భారత్ లో హిందువులపై దాడులు ఖండించగలరా?

0
SHARE

ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్ లో కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ “ఆర్.ఎస్.ఎస్ బీజేపీ ల ముస్లిం వ్యతిరేకతను తగ్గించేందుకు, ప్రశ్నించేందుకు ముస్లింలు భారత్ చుట్టు ప్రక్కల ఉన్న ఇస్లామిక్ దేశాలు అయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందువులపైనా, హిందు దేవాలయాలపైనా జరుగుతున్న దాడులను ఖండించాలి అక్కడ హిందువుల రక్షణకు డిమాండ్ చేయాలనీ ముస్లిం యువకులకు పిలుపునిచ్చారు.

మంగళవారం నాడు డిల్లీలో నేషనల్ ట్రై కలర్ అసోసియేషన్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన “ప్రజాస్వామ్యాన్ని బలపరచడం లో ముస్లిం యువత పాత్ర” అనే సందర్బంగా ఆజాద్ మాట్లాడారు. తన ప్రసంగం లో భారత దేశంలో ఏదైనా సంఘటన జరిగితే  హిందువులు ముస్లింలు పక్షాన నిలబడాలి అని ఏవిధంగా మనం కోరుకుంటున్నమో, ఆ విధంగా ముస్లిమ్స్ హిందువులపై దాడి జరిగినపుడు ఎందుకు మాట్లాడడం లేదు అని సభికులను ఉద్దేశించి అన్నారు.

“దాద్రి లో అఖ్లాక్ పై దాడి, లేదా ఝార్కండ్ లో ఇద్దరు యువకులు చనిపోవడం లాంటి సంఘటనలు జరిగినపుడు టీవీ లలో, వార్తలలో బిజేపి మరియు ఆర్.ఎస్.ఎస్ కు వ్యతిరేకంగా చర్చ జరుగుతుంది. కాని  పొరుగున ఉన్న దేశాలలో హిందువులపై దాడి జరిగితే మనం ఎందుకు మౌనం గా ఉంటున్నాము” అని కూడా అన్నారు.

ఈ పిలుపు వింటూ వుంటే కాంగ్రెస్ నాయకులూ తమపై హిందూ వ్యతిరేక ముద్ర ఉన్నది దానిని తగ్గించుకోవాలని చెప్పకనే చెబుతున్నారు. కానీ వాస్తవాలు గమనిస్తే ఎక్కడ అయితే ముస్లింలు మెజారిటీ గా ఉంటారో అక్కడ మైనారిటీల ఫై ఆక్రమణ చేస్తూ ఉంటారు. అదే విధంగా ముస్లింలు మైనార్టీ లో ఉంటే అసహనం తో ఉంటూ ఎప్పుడు ఎదో ఒక సమస్యను సృష్టిస్తారు . ఇతర మతాలను అంగీకరించక పోవడం, గౌరవించకపోవడం, ఇతర మతస్థులపై దాడులు చేయటం ముస్లింలు హక్కుగా భావిస్తుంటారు. అలాంటివారు దాడులు ఖండించటం జరిగేపనేనా?

ముస్లిం దేశాలలో దాడులు ఖండించటం తరువాత కానీ ముందుగా భారత్ లో జరుగుతున్న దాడులు మతం మార్పిడులను ఆపుటకు గులాం నబీఆజాద్ గారు పిలుపునిస్తే బాగుంటుంది.