Home News వనవాసీ కళ్యాణ పరిషత్‌ తీర్మానాలు

వనవాసీ కళ్యాణ పరిషత్‌ తీర్మానాలు

0
SHARE

భారతదేశంలోని గిరిజనులు, వనవాసుల సంక్షేమం కోసం పనిచేసే అఖిల భారత వనవాసీ కళ్యాణ ఆశ్రమం అఖిల భారత సమావేశాలు ఈ సంవత్సరం రాజస్తాన్‌లోని పిండ్‌వాడలో సెప్టెంబర్‌ 22 నుండి 24 వరకు జరిగాయి. ఈ సమావేశాలలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి 515 మంది రాష్ట్రస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ నుండి 15 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆ సమావేశాలలో గిరిజనుల సంక్షేమం, రక్షణ గురించి నాలుగు తీర్మానాలను ఆమోదించారు. అందులో అతి ముఖ్యమైన రెండు తీర్మానాలు ఇక్కడ ఇస్తున్నాము.

vanavasi-kalyana-parishad1

తీర్మానం – 1

గిరిజనుల పరంపరను, ధార్మిక విశ్వాసాలను, మందిరాల సంరక్షణను మరియు మరియు వారి వాడుక భాషలను రక్షించి వికసింపచేయుట :

గిరిజన సమాజ ఉనికి మరియు గుర్తింపు కొరకు ప్రభుత్వం ఐదు లక్షణాలు నిర్దేశించింది. అవి 1) అనాదితత్వము, 2) విశిష్టమైన సంస్కృతి, 3) మిగిలిన తెగలతో కలవడానికి సంకోచించడం, 4) భౌగోళిక ఒంటరితనం, 5) ఆర్థిక వెనుకబాటుతనం.

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సంస్కృతి ప్రత్యేకత. అదేవిధంగా భారత్‌లోని ప్రతి గిరిజన తెగ వికాసం కారణంగా భారత సనాతన జీవనపద్ధతి వికసించింది. గిరిజనులు వారి పూర్వజుల ద్వారా తరతరాలుగా పొందిన అనుభవాల నుండి తమ సాంస్కృతిక గుర్తింపు లభించింది. గిరిజన నిత్యజీవన విధానం ద్వారా ప్రకృతి వ్యాప్తంగా వున్నట్టి, కనిపించని అతీత శక్తులపై, విశ్వాసములపై ఆధారపడి ఉన్నవి. వారి సంస్కృతి, పండుగలు వంశపారంపర్యంగా వచ్చే వారి భక్తి విశ్వాసాలు, పండుగలు, పబ్బాలు ఇవన్నీ వాటిలోని భాగమే. కనుక వారి విశ్వాసాలు, సంస్కృతిని పరిరక్షించడంద్వారా వారి అభివృద్ధి జరుగుతుంది.

గిరిజనుల అభివృద్ధి మరియు వారి సంరక్షణ కొరకు ప్రభుత్వం చాలా చట్టాలు రూపొందించింది. కాని వారి ధార్మిక విశ్వాసాలు మరియు సంస్కృతిని సురక్షితంగా ఉంచడానికి తగిన చర్యలు ప్రభుత్వం ఇప్పటికీ తీసుకోలేదు. గిరిజనులు సామూహికంగా ఉండటమే వారి జీవనపద్ధతి. వారి జీవితాల్లో గ్రామాలలోని దేవాలయాలకు ప్రత్యేకమైన స్థానమూ, ప్రాముఖ్యత ఉన్నాయి. కాని చాలాకాలంగా ప్రభుత్వం వీటి రక్షణకు చర్యలు చేపట్టలేదు.

వంశపారంపర్యంగా వస్తున్న బైగా, పహాన్‌, భూమ్కా మొదలగు పరంపరాగత పూజారులు ధార్మిక క్రతువులందు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రకృతి లోని అనేక పేర్లతో పిలువబడే అదృశ్య దైవీశక్తులను, మంత్రాలు చదువుతూ సంతృప్తి పరుస్తూ, ఈ పూజారులు ప్రజలు సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తారు. ప్రకృతే పరమేశ్వరుడని భావిస్తూ, ఆరాధిస్తూ ఈ శాస్త్రీయపద్ధతిని వారు అనుసరించడం వల్లనే ప్రకృతిలో శాంతి సామరస్యత నెలకొన్నది.

ఇప్పటికి కూడా ప్రజలు తమ నిత్యజీవితాల్లో ఈ పూజారులపై ఆధారపడి ఉన్నారు. ఆధునికత పేరుతో ఇవి కేవలం మూఢనమ్మకాలని తీసిపారేయ డానికి వీలులేదని మనం అర్థంచేసుకోవాలి. అందు వల్ల వంశపారంపర్యంగా ఉండే పూజారులను గుర్తించి, వారిని ప్రోత్సహించి వారికి ప్రత్యేకస్థానం కల్పించడం నేడు ఎంతో అవసరం.

గిరిజనతెగల వాడుకభాషకు ఒక ప్రత్యేకస్థానం కల్పించి, వారి సాంస్కృతిక విలువలను పరిరక్షించాలి. తమ మాతృభాష ద్వారానే వారు తమ పరిజ్ఞానం, తెలివితేటలు పెంచుకోగలుగుతారు. ఇప్పటివరకు గిరి జనుల వాడుకభాషను ప్రభుత్వం ఉపేక్షించింది. దీని ఫలితంగా ఈ భాషలు మరుగునపడే ప్రమాదం ఉంది.

అస్సాంలో బోడోలు, ఝార్ఖండ్‌లో సంతాల్‌లు తమ భాషను అభివృద్ధి పరచడంలో విజయం పొందారు. వీటిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచి గుర్తించారు. ఇదేవిధంగా అన్ని గిరిజన భాషలను రక్షిస్తే, సమాజం, దేశం మన సనాతన, సాంస్కృతిక విలువలను నిలుపుకోగలుగుతాయి.

పై విషయాలను దృష్టిలో పెట్టుకొని అఖిలభారత వనవాసీ కళ్యాణాశ్రమం కార్యకారీమండలి ప్రభుత్వాన్ని కోరుతున్నదేమనగా..

1) గిరిజన పరంపరాగత పూజాస్థలాలను పరిరక్షించాలి.

2) ప్రభుత్వం వంశపారంపర్యంగా వచ్చే పూజారులను గుర్తించి, గిరిజన సమాజానికి వారి సేవలు అందుబాటులో ఉండునట్లు చూసి సమాజం క్షేమం దృష్ట్యా వారిని గౌరవించి, గుర్తింపునివ్వాలి.

3) గిరిజన వాడుక భాషలను ప్రోత్సహించి, వంశపారంపర్యంగా వచ్చే జీవన విలువలను గుర్తించి, వారి జానపద కళలను, నృత్యాలను, పాటలను, వీరగాథలను, దైవీమంత్రాలు మొదలగు వాటిని లిపిబద్దం చేసి భావితరాలకు అందించాలి.

4) గిరిజనులు తమ పండుగలను తమ పద్ధతిలో, ఉత్సాహంతో జరుపుకోగలగాలి. విధర్మీయులు చేసే వికృత కుట్రలను భగ్నం చేయాలి.

గిరిజనులంతా తమ ఉనికిని, సాంస్కృతిక విలువలను కాపాడుకుంటూ, ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ విధానాన్ని రక్షించుకుంటూ, వికాసం పొందాలి. పూర్వీకులు తమకు అందించిన పరంపరను రక్షించుకుంటూ, ఆధునీకరణ అనే మోజులోపడి, తమ ఉనికిని పోగొట్టుకోకూడదు. అందువలన పై విషయాల్లో చైతన్యం కలిగి కార్యకారీ మండలి గిరిజనులను అప్రమత్తంగా ఉండాలని కోరుతుంది.

తమ గ్రామ దేవాలయాలను శుభ్రంగా ఉంచుతూ, చుట్టూ కంచె, గోడలు ఏర్పాటు చేసుకొని తీర్చిదిద్దుకోవాలి. జాతి వ్యతిరేకశక్తులు ఈ స్థలాలను దురాక్రమణ చేయకుండా చూసుకొంటూ వారి ఆక్రమ ణలను తొలగించగలగాలి. అందుకొరకు గ్రామ సభలు, ఇతర గిరిజన సంస్థలు ముందుకువచ్చి, సహాయ సహకారాలు అందించాలి. దానికై సంబంధిత మంత్రిత్వశాఖలు, దేవాదాయ, గిరిజన మంత్రిత్వశాఖలు, గిరిజన సంక్షేమ సంస్థలు మొదలగు వారి సహకారం తీసుకోవాలి.

vanavasi-kalyana-parishad-2

తీర్మానం – 2

అక్రమ మతమార్పిడులను నిషేధించి, ఇప్పటివరకు జరిగిన మతమార్పిడుల దుష్పరిణామాల అధ్యయ నానికై కేంద్రీయ ఎంక్వైరీ కమిషన్‌ను నియమించాలి:

ప్రతి నాగరికుడు తనకు కావలసిన ఆరాధనా పద్ధతిని ఎన్నుకొని, దాన్ని ప్రచారం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ”ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి” అనే భారతీయ పరంపర మూలంగా, మనదేశ ప్రజలు మతస్వేచ్ఛను అనుభ విస్తున్నారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు పుట్టకముందు నుంచే, అదేవిధంగా భారత్‌కు స్వాతంత్య్రం రాక మునుపు నుండే ఇక్కడి ప్రజలు మతస్వేచ్ఛను అనుభ విస్తున్నారు. మొగలులు దండయాత్ర చేసి బలవంతపు మతమార్పిడిలు చేస్తే, సేవ ముసుగులో క్రైస్తవులు మతంమార్చడం ప్రారంభించారు. వీటివలన మన ధార్మికస్వేచ్ఛ హరించుకుపోతున్నదని ఈ దేశ ప్రజలు గుర్తించారు.

మతమార్పిడుల వలన భారతజాతీయతను కోల్పేయే ప్రమాదాన్ని ఇక్కడి ప్రజలు గమనించారు. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో మధ్యభారత్‌ మరియు బెరార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ రవిశంకర్‌ శుక్లా తన పర్యటనలో భారత సార్వభౌమత్వాన్ని ఉల్లం ఘించి, విదేశీ మిషనరీలు ప్రజలను ఉసిగొలుపు తున్నట్లు గమనించి ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని తెలుసుకున్నారు. దేశంలో వీరు వేర్పాటు వాదం ద్వారా ”నాగాలాండ్‌లో క్రీస్తురాజ్యం” లాంటి జాతివ్యతిరేక నినాదాలతో ఈ క్రైస్తవ మతమార్పిడుల వెనకున్న కుట్ర అర్థమైంది. గిరిజనుల అమాయ కత్వాన్ని ఆసరాగా తీసుకొని, మిషనరీలు వారికి ప్రలోభాలు చూపి, వారిపై ఒత్తిడితెచ్చి, కొన్నిచోట్ల తుపాకితో బెదిరించి మతాంతరీకరణలకు పూనుకు న్నారు. దీనివల్ల మతస్వేచ్ఛ ఏవిధంగా ధిక్కరించ బడుతుందో, రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో సులువుగా అర్థమవుతున్నది.

మిషనరీల కార్యకలాపాలపై విచారణ చేయడా నికి 1954లో భారత ప్రభ్వుం నియమించిన భవానీశంకర్‌ నియోగీ కమిషన్‌, 11,000 కంటే ఎక్కువ సాక్షాధారాలను, అక్రమ మతాంతరీకరణలు చేస్తున్న విదేశీ మిషనరీల కార్యకలాపాలను మరియు వీరి అంతర్జాతీయ కుట్రలను బయటపెట్టింది. కమీషన్‌ యొక్క సిఫారసు మూలంగా మధ్యప్రదేశ్‌ లోను, మిగతా రాష్రాలలోను మతస్వేచ్ఛ చట్టం అమలు లోకి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ల అసెంబ్లీలు ఈచట్టాన్ని తీర్మానించినప్పటికీ ఖచ్చితమైన నియమనిబంధనలు లేక, ఇంకా సాంకేతిక కారణాలవల్ల నిష్ప్రయోజకంగా, పళ్ళులేని నోరులాంటి చట్టమైపోయింది. ఫలితంగా మతాంతరీకరణలు యధేచ్చగా జరుగుతూనే ఉన్నాయి.

ఈ శక్తుల మూలాలు విదేశాల్లో ఉన్నందువల్ల ”అన్ని మతాలు సమానమేనని, అన్ని మతాలమార్గంలో ఈశ్వరప్రాప్తి మరియు మోక్షప్రాప్తి పొందవచ్చనే” భారతీయ వేదాంతాన్ని ఈ విదేశీ మతాలవారు ఒప్పుకోడానికి సిద్ధంగాలేరు. ఈ కారణంగా ముఖ్యంగా గిరిజన సమాజంలో, సామాజిక విద్వేషం, ఉద్రిక్తతలు, ఘర్షణల వాతావరణం అంతటా కన్పిస్తున్నది. ఒడిశా వాధ్వా కమిషన్‌ కూడా ఈ విషయాన్ని సమర్థించి, మతస్వేచ్ఛ చట్టం దృఢంగా అమలుపరచాలని సిఫారసు చేసింది.

స్వాతంత్య్రం లభించిన సమయంలో చూస్తే మధ్యభారత్‌ మరియు ఈశాన్య రాష్ట్రాలలోనే కొందరు గిరిజనులు క్రైస్తవులుగా మారినట్లు తెలిసింది. కాని ఇప్పుడు చూస్తే గిరిజనులు వ్యతిరేకిస్తున్నప్పటికీ క్రైస్తవం దేశమంతా వ్యాపిస్తున్నది. దీనినిబట్టి ఈ దేశ సనాతన ధర్మావలంబనను సంరక్షించడంలో అన్నిప్రభుత్వాలు విఫలమైనట్లుగా స్పష్టమవుతున్నది. చాలా గిరిజన తెగల మతాంతరీకరణ జరగగా, మరికొన్ని తెగలు 50శాతం క్రైస్తవులుగా మారారు. 2011వ సంవత్సర జనాభా లెక్కలు ఈ భయంకర నిజాలను నిర్ధారిస్తు న్నవి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే, గిరిజనుల సాంస్కృతిక గుర్తింపు అంతమై, రాజ్యాంగంలో కల్పించిన వారి ఉనికి మరియు అస్తిత్వాల రక్షణకై ఇచ్చిన హామీలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయి.

ఈ కాలంలోనే ప్రపంచం గమనించిందేమంటే మతమార్పిడుల కారణంగా ఇండోనేషియా నుండి తూర్పు తైమూర్‌ విడిపోయింది. సూడాన్‌ దేశం ఉత్తర, దక్షిణ సూడాన్‌లుగా విడిపోయింది. దీంతోబాటు మతమార్పిడులను పరోక్షంగా ప్రోత్సహిస్తూ సేవ మరియు వికాసం పేరుతో జాతీయ ఐకమత్యాన్ని, జాతి అఖండతను దెబ్బతీసే ఈ విదేశీ శక్తులను మనమంతా కనిపెట్టాల్సి ఉన్నది. వరల్డ్‌ విజన్‌, కాసా, సిసియస్‌ లాంటి విదేశీ సంస్థలు బాహాటంగా ఈ పని చేస్తున్నాయి.

అట్లే మతాంతరీకరణలు, సరిహద్దులో ముస్లిం అక్రమ చొరబాట్లు, గిరిజన బాలికలను పెళ్ళి చేసుకొని వారి పేర ఉన్న భూములు, వనసంపదలను ఆక్రమించే కుట్రలు కొనసాగుతున్నాయి. ఈ గిరిజన మహిళల సహకారంతో స్థానిక సంస్థల్లోను, ఎన్నుకోబడే స్థానాల్లోనూ తమ ప్రాబల్యాన్ని ఈ విదేశీ కుట్రదారులు పెంచుకుంటున్నారు. ఈ విధంగా మన రాజ్యాంగంలో పొందు పరిచిన వెనుకబడ్డ గిరిజన వికాసమనే వ్యవస్థ అవహేళన అవుతున్నది.

ఈ భయంకర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గిరిజనుల సాంస్కృతిక గుర్తింపును రక్షించడానికి అఖిల భారత వనవాసీ కళ్యాణాశ్రమం కార్యకారీ మండలి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసేదేమిటంటే..

  1. గిరిజనుల మతాంతరీకరణ జాతీయసమస్య కావడం మూలంగా కేంద్రప్రభుత్వం తక్షణం తగినచర్య తీసుకొని, కేంద్ర మతస్వేచ్చ చట్టమును రూపొందించాలి.
  2. అరుణాచల్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మరియు హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో మతస్వేచ్ఛ చట్టంను అసెంబ్లీలలో ఆమోదించిన ప్రకారం, గట్టి ప్రయత్నంతో దీన్ని అమలు చేస్తున్న విధానాన్ని తెలిపే ”శ్వేతపత్రాన్ని” విడుదల చేయాలి.
  3. మతాంతరీకరణల వల్ల కలిగే దుష్పరిణా మాలపై, తద్వారా ఏర్పడే సామాజిక సంఘర్షణపై అధ్యయనం చేయడానికి జాతీయస్థాయిలో ఒక అధ్యయన కమీషన్‌ను ఏర్పాటు చేయాలి.

గిరిజనుల వికాసానికి కృషిచేస్తున్న సంస్థలన్నింటిని మేము కోరేదేమనగా అందరూ గ్రామగ్రామానికి వెళ్ళి మనపై కుట్ర జరుగుతున్నదని, మతాంతరీకరణతో మన ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతున్నదని ప్రజలకు తెలియజెప్పాలి. రాజ్యాంగంలోని హక్కులు కాపాడుకోవాలని, విదేశీ శక్తుల దురాగతాలను అడ్డుకో వాలని, వీటికై సామాజిక ఉద్యమం లేవదీయాలని కూడా అఖిలభారత వనవాసీ కళ్యాణా శ్రమం అందరినీ కోరుతున్నది. అట్లే అఖిలభారత వనవాసీ కళ్యాణాశ్రమ కార్యకారీ మండలి ప్రభుత్వాన్ని కోరేదేమనగా పై అంశాలన్నింటిని సుదీర్ఘంగా చర్చించి, అధ్యయనం చేసి ఈ ప్రమాదాల నుండి గిరిజనులను రక్షించాలని, దేశవ్యతిరేక శక్తులను నియంత్రించాలని, లేనియెడల గిరిజనులందరూ ఒక జాతీయ ఉద్యమం లేవనెత్తి వారి రాజ్యాంగ హక్కులను వారే కాపాడుకుంటారని హెచ్చరిస్తున్నది.

vanavasi-kalyana-parishad-3