Home News 11,319 స్వచ్చంద సంస్థల (ఎన్.జి.ఓ) అనుమతులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

11,319 స్వచ్చంద సంస్థల (ఎన్.జి.ఓ) అనుమతులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

0
SHARE

కేంద్ర హోం మంత్రిత్వ శాఖా గురువారం నాడు 11, 319 స్వచ్చంద సంస్థలను విదేశీ నిదుల సేకరణ నియంత్రణ చట్టం (Foreign Contribution Regulation Act- 2010) ఆధారంగా వారి అనుమతులను రద్దు చేసింది. ఈ స్వచ్చంద సంస్థలు ప్రభుత్వ నిబంధనల  మేరకు తమ ఎఫ్.సి.ఆర్.ఎ అనుమతులను జూన్ 30 లోగా పునరిద్దరించుకోలేదు. ప్రభుత్వం చివరి తేదిని రెండు సార్లు సెప్టెంబర్ 31, అక్టోబర్ 31 వరకు పొడిగించిన కూడా ఈ సంస్థలు అవకాశాన్ని వినియోగించుకోలేదు.  ప్రభుత్వం జూన్ 30 తరువాత ఇట్టి స్వచ్చంద సంస్థల జాబితా విడుదల చేసి రద్దు చేసే అవకాశం ఉంది అని కూడా హెచ్చరించింది.

గడువు లోపు స్పందించని కారణంగా ప్రభుత్వం ఎఫ్.సి.ఆర్.ఎ అనుమతలను రద్దు చేసింది. వీటి కారణంగా ఈ జాబితాలో ఉన్న సంస్థలు విదేశీ విరాళాలను స్వీకరించే హక్కును కోల్పోతాయి.

మరొక ఉత్తర్వులో 1,736 స్వచ్చంద సంస్థలు ఎఫ్.సి.ఆర్.ఎ పునరుద్దరణకై అసంపూర్తి సమాచారాన్ని ఇచ్చినవి అని పేర్కుంటూ వారిని తిరిగి పూర్తి వివరాలతో  ఈ నెల నవంబర్ 8 ప్రభుత్వం సూచించిన పత్రాల ద్వార ప్రాతనిద్యం వహించవలసిందిగా కోరింది.

2015 లో 10,000 స్వచ్చంద సంస్థలను ఇదే చట్టం ప్రకారం రద్దు చేయడం జరిగింది.2014 లో 59 సంస్థలను, 2013 లో 4 సంస్థలను, 2012 లో 4, 138 సంస్థలను రద్దు చేసింది.

రద్దు చేయబడిన స్వచ్చంద సంస్థల పూర్తి జాబితా fcra_11319_03112016