Home Telugu Articles 12 డిసెంబర్ 1930: బాబు గేను బలిదానం – స్వదేశీ దివస్

12 డిసెంబర్ 1930: బాబు గేను బలిదానం – స్వదేశీ దివస్

0
SHARE

బాబు గేను (1908 జ‌న‌వ‌రి 1 -1930 డిసెంబర్ 12) ఒక భారతీయ స్వతంత్ర సమరయోధుడు స్వదేశీ కోసం తన జీవితాన్ని అర్పించాడు. బాబు గేను మహలుంగ్ పడ్వాల్ లోని ఒకనిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. అతను ముంబై లోని పత్తి మిల్లులో కార్మికుడుగా ఉంటూ భారతీయులు నిర్వహించే నిరసన లలో చురుకుగా పాల్గొనేవాడు.

12 డిసెంబర్ 1930 న స్వతంత్ర సమరయోధులు విదేశీ వస్త్రాల దిగుమతికి వ్యతిరేకంగా మంచేస్టర్ కు జర్జ్ ప్రెజర్ అనే వస్త్ర వ్యాపారి పాత హనుమాన్ గల్లీలోని తన దుకాణం నుండి ముంబై ఫోర్ట్ కు విదేశీ వస్త్రాలను తరలిస్తున్నాడు. వ్యాపారి ట్రక్కు కు రక్షణగా బ్రిటిష్ పోలీస్ లను నియమించాడు. కల్పదేవి రోడ్ బాంగవడి దగ్గర నిరసన కారులు ట్రక్ ను అడ్డగించి నిరసన తెలుపుతున్నారు. ఆందోళన కారులను పక్కకు నెట్టి ట్రక్ ను పంపాలని పోలీస్ లు ప్రయత్నం చేసారు. బాబు గేను ట్రక్ కు ముందు నిలబడి నిరసన తెలుపుతూ గాంధీ జి కి జై అంటూ నినాదాలు చేసాడు.

ఈ శాంతియుత నిరసనలలో పాల్గొన్న బాబు గేను అతని సహాచరులను అడ్డుకున్నపటికి బాబు గేను ట్రక్ ను ఆపాలన్న సంకల్పాన్ని వదులు కోలేదు. ఇది చూస్తున్న బ్రటిష్ పోలీస్ అధికారి అసహనానికి లోనై తన కోపాన్ని ప్రదర్శిస్తూ డ్రైవర్ ను ఇతనిపై ట్రక్ ఎక్కించు అని గట్టిగా అరిచాడు. ట్రక్ డ్రైవర్ దేశ భక్తి కలిగిన వ్యక్తి బల్బీర్ సింగ్, ఆ అధికారి తో డ్రైవర్ నేను భారతియున్ని ఇతను భారతీయుడు మేమిద్దరం సోదరులం నా సోదరుణ్ణి నేను ఎలా చంపుతాను అంటూ ట్రక్ దిగి వెళ్తాడు. కోపం రెట్టింపైన పోలీసు అధికారి డ్రైవర్ సీటులో కూర్చుని ట్రక్కు ను బాబు గేను పైనుండి తొక్కు కుంటూ తీసుకెళ్తాడు బాబు గేను ఘోరమైన వీరమరణం చెందాడు. మిగతా నిరసన కారులను పోలీస్ లు చితక బాధి ట్రక్కు ను తీసుకెళతారు. ఫలితంగా ముంబై అంతటా ఆగ్రహం తో నిరసనలు వెల్లువెత్తయి కానీ బ్రిటిష్ సమాచార డైరెక్టర్ సంఘటనను “ప్రమాదంగా “మార్చి ప్రెస్ నోట్ విడుదల చేసారు

‘అతని జీవితం ఒక సందేశం’
బాబు గేను అంతగా చదువుకోలేదు.. అయినప్పటికీ దేశ రాజకీయ, భౌగోళిక ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకున్నాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలన అసలు విషయాలను గ్రహించాడు. ఆర్థిక బలం బ్రిటిష్ వారు నడిపించే శక్తి అని బ్రటిష్ రాజ్య స్థాపన అనేది భారత దేశంపై ఆర్థిక ఆధిపత్యాన్ని శాశ్వతం చేయడానికి ఒక ఉపాయం అని గుర్తించాడు. ఈ సందర్భంలోనే గాంధీజి ప్రతిపాదించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ వాదనలు దాని ప్రాముఖ్యతను బాబు గేను అర్థం చేసుకున్నాడు. బ్రిటిష్ పాలన ఆర్థికంగా నిలకడ లేనిదిగా ఉంటే భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగించడం సాధ్యపడదు అదికూలి పోతుంది భారతదేశ ఆర్థిక స్వతంత్రం రాజకీయ స్వతంత్రం ఒకదానితో ఒకటి ముడిపడి ఏకికృతమై ఉందని అతనికి తెలుసు. ఈ వాస్తవం మన రాజకీయ నాయకులు చర్చ నుండి తప్పించుకుంటారు.

దేశ ఆర్థిక స్వేచ్చ కోణం నుండి చూసినా మూలం ఆర్థిక స్వసంత్య్రం అని దేశ రాజకీయ స్వతంత్య్రానికి మూలం అని తాను విశ్వసించి దానికోసం తన జీవితాన్ని త్యాగం చేయ‌డానికి వెనుకాడలేదు అనటంలో ఆశ్చర్యం లేదు. బాబు గేను ఆర్థిక ఆలోచన దశబ్దాల తర్వాత కూడా దేశం అభివృద్ధి కి సరిపోయే ఆర్థిక నమూనా దాన్ని ఎంత మాత్రం కొట్టి పారేయటానికి వీలులేదు. ఆర్థికంగా, భౌతికంగా తమ విశ్వాసాలను నిలబెట్టడం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఈ మహానుభావుల జీవితంలో ఉన్న సందేశాన్ని ఎవరు కొట్టి పారేయకూడదు ఎందుకు?
మొదటిది :ఈ మహానుభావులగొప్ప ఆలోచనలు అత్యున్నత నిస్వార్థ త్యాగం
రెండవది : చాలా ముఖ్యమైనది బాబు గేను జీవితం.

భారతదేశం లో ప్రస్తుతం ఉన్న స్థితి కంటే భిన్నంగా ఉండవచ్చు. ప్రపంచ శక్తులు తమ ఎజెండాను కలిగి ఉన్నాయి. ఇతరుల పై వారి ఆలోచనలు, నమ్మకాలను విధించటంలో వారి సంకల్పం ఖచ్చితంగా ఉంది ఆ దిశగా క్రీస్తు తర్వాత మొదటి సహస్రబ్ది లో మతం ద్వారా రాజకీయ ఆధిపత్యం ఉంటే, రెండవ సహస్రబ్ది లో సైన్యం ద్వారా జరిగింది. భయంకర విషయం ఏమిటంటే బహుశా మూడవ దానిలో ఆర్థిక జోక్యం ఉంటుంది.ప్రపంచం ఇతరులను ఎలా చూస్తుంది ఎలా లొంగదిసుకోవాలో లొంగదిసుకోవాల్సిన విధ‌గా ఇతరులను నిమగ్నం చేయాలనే భయంకరమైన ఆలోచనలతో ఉంది.

ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాము ఇతరులు ప్రపంచాన్ని ఎలాచూస్తున్నారు కాదు, మనం సమాజంలో ఒకరిగా బాబు గేను వంటి వారి ఆలోచనలు ఆద‌ర్శాలు మన ఆలోచనల నుండి మసకబారుతున్న తరుణంలో మీరు చరిత్రను మరిచి పొతే దానిని పునరావృతం చేయవలసిన సమయం ఆసన్నమైంది. సహజంగానే ఈ ఆధునిక కాలంలో ప్రపంచ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ఉద్దేషాలు పూర్తిగా స్వతంత్రంగా ఉన్నాయా లేక కుట్ర పూరితంగా ఉన్నాయా అనేది మనం ఆలోచించాలి.

స్వదేశీ జాగరణ మంచ్ లక్ష్యం చిట్టచివరి వ్యక్తి సమృద్ధి, స్వావలంభన (అంత్యోదయ) కాబట్టి, బాబు గేను బలిదానం దినం ను స్వదేశీ దివస్ గా జరుపుకుంటున్నారు.