Home Telugu Articles 16 ఏళ్ళ వయసులోనే గుడాచారిగా వ్యవహరించి సుభాష్ చంద్రబోసుతో మన్ననలు పొందిన సరస్వతి రాజమణి

16 ఏళ్ళ వయసులోనే గుడాచారిగా వ్యవహరించి సుభాష్ చంద్రబోసుతో మన్ననలు పొందిన సరస్వతి రాజమణి

0
SHARE

ఆ ఆడపిల్లలందరు మగపిల్లల వేషాలు వేసుకొని బ్రిటిష్ సైనిక క్యాంపులోని అధికారుల ఇళ్ళ లోను పనివారుగా చేరారు. శత్రువు స్థావరంలో ఉన్న కోవర్టు ఏజంట్లుగా వారి పని ప్రభుత్వ ఉత్తర్వులను, బ్రిటిషు అధికారుల రహస్య సమాచారం సంగ్రహించి ఐ.ఎన్.ఏ వారికి అందించటం. రాజమణి (మగపిల్లాడిగా ఆమె పేరు మణి) ఆమె మిత్రులు అలా మారువేషాలలో రెండేళ్ళ పాటు బ్రిటీషు వారి కదలికల రహస్య సమాచారం సేకరించారు. ఎట్టి పరిస్థితులలోను పట్టుబడకూడదని యునిట్ వారికి చెప్పినా గాని ఒకసారి ఒక అమ్మాయి బ్రిటిషు వారికి పట్టుబడిపోయింది. పట్టుబడితే వచ్చే పరిణామాలు తెలిసి కూడా రాజమణి ఆమె మిత్రురాలిని రక్షించడానికి నిశ్చయించుకుంది. ఆ ధీశాలి నర్తకి వేషం వేసుకొని జైలు అధికారులకు మత్తుమందు ఇచ్చి తన సహచరిని రక్షించింది.                                  

                                                                            ******************************************************

ఏప్పుడో ఒకప్పుడు మనకి సాధారణ పనులు వదిలేసి అసాధారణమైన పనులు చేయాలనే ప్రేరణ కలుగుతుంది. అలానే మా నాన్న గారు రిపబ్లిక్ డే  సందర్భంగా ఆన్ లైన్ లో చదివిన వ్యాసం లోని  ఒక స్వతంత్ర సేనాని సరస్వతి రాజమణి గారిని దర్శించుకొని వారికి మన శ్రద్ధా భక్తులను ప్రకటిద్దామని అన్నారు. ఆవిడ చెన్నై  రోయపేట లో ఉంటారన్న విషయం తప్ప ఇంకా ఏమీ తెలియకుండానే  వెతకటానికి బయలుదేరాము. ఆమె ఎవరికీ తెలియకపొయినా మేము మా ప్రయత్నము వదలలేదు. చివరకి ఒక కురగాయలమ్మే స్త్రీ మా వివరణ అర్థం చేసికొని, ‘ఈ ఫ్లాట్లలో ఒక వృద్ధ స్త్రీ ఉంటుంది, ఆమెను చూడటానికి చాలా మంది వస్తారు ఐతే ఆవిడ స్వతంత్ర సేనానో కాదో నాకు తెలియదు’ అంది. ఇలా ఉంటుంది మరిచిపోయిన ఇండియన్ నేషనల్ ఆర్మి (ఐ.ఎన్.ఎ) సేనాని కథ. మేము చొరబడుతున్నామేమో అని అనుకుంటుండగా, ఆవిడ మమ్మల్ని ఆహ్వానించి కుర్చోమని చెప్పింది. ఆవిడకి 92 ఏళ్ళ ఐనా మమ్మల్ని కాఫీ, టీ తీసుకునేదాకా వదలలేదు. మేము అక్కడ ఉండగా ఇంకా కొంత మంది ఆవిడని చూడటానికి వచ్చారు, అందరిదీ ఒకే మాట – ఆవిడ ఎదైనా ఇవ్వకుండా వదిలిపెట్టదు. ఆవిడ ఇంటి గోడలు  నేతాజీ సుభాష్ చంద్ర బోస్  ఫ్రేము  కట్టిన చిత్రాలు, ఆవిడ జీవిత కాలంలో సంపాదించిన ఆవార్డ్లతో నిండి ఉన్నాయి. ఆవిడ ఇల్లు మొత్తం భారత స్వాతంత్ర ఉద్యమం స్మృతి చిహ్నం లాగా అనిపించింది.

ఆవిడ ఙాపకాలను మెల్లగా, విపులంగా వివరించారు. ప్రతి చిన్న విషయం కుడా మర్చిపొకుండా బాగా అలోచించి విశదీకరించారు. ఆవిడ ఇంగ్లీషు, తమిళు, హిందీలో మట్లాడారు. ఆవిడ బర్మా లో తన చిన్నతనం గురించి, ఎలా అబ్బాయి వేషం వేసి గూఢచారి ‘మని ‘గా వ్యవహరించారో, గొప్ప వ్యక్తుల పరిచయం, బోసు గారు ఎలా ‘సరస్వతి ‘ అనే బిరుదు ఇచ్చారో లాంటి విషయాలు ఎన్నో చెప్పారు. ఆవిడ గంటల తరబడి మాట్లాడింది. మాకు ఆవిడని విడిచి వెళ్ళాలనిపించ లేదు.

ఆవిడ సీటు పక్కనే ఒక కుట్టు మిషను ఉంది దానితో ఆవిడ ఇప్పటికీ అనాధలకు బట్టలు కుడుతున్నారు. మేము ఆవిడకి ఎదైన్నా కానుకగా ఇవ్వమా అని అడిగితే, ‘కుట్టేందుకు పనికివచ్చే ఎమైనా వస్తువులు ఇవ్వండి ఆవిడ అవే తీసుకుంటుంది ‘ అని ఆవిడ మనవడు అన్నాడు.ఎంత నిస్వార్థులైతే తప్ప తమ జీవితం మొత్తం పూర్తిగా ఇతరుల బాగుకోసమై అర్పిస్తారని అని ఆశ్చర్యపడ్డాము.  మేము వారి ఇంటి నుంచి బయటకి వస్తుంటే ఆవిడ ‘జై హింద్ ‘అని బిగ్గరగా అరిచారు. బోసు, గాంధీ, నెహ్రు లాంటి దేశ నాయకులను కలసిన ఆవిడ. సైనికురాలు అవ్వాలని కోరుకున్న నిస్వార్థ,  ధైర్యశాలి ఐన మహిళ. దేశం కోసం వాస్తవంగా తూటాలు తిన్న వ్యక్తి. సమాజానికీ, ప్రజలకీ ఇప్పటికీ సేవలు అర్పిస్తున్న మహిళ. జీవితాన్ని పూర్తిగా జీవిస్తున్న మహిళ. అటువంటి మహిళకి మనము ఏమివ్వగలము? వినమ్రతతో చేతులు జోడించటం తప్ప మనం ఆవిడ ఋణం తీర్చుకోలేము. మనందరికీ యుద్ధ వీరుల పట్ల, మాజీ సైనికుల పట్ల ఎనలేని భక్తి భావం ఉంది. మనము వారి దిక్కుగా చూస్తాము. కాని మనం వారిలో ఒకరిని కలిసి వారి బంగారు హృదయాన్ని తెలుసుకున్నపుడు, వారి మానవత్వ విలువలు నేర్చుకొని జీవితాంతం పాటించాలి. నిజంగా అది ఒక మరపురాని అనుభూతి. 92 ఏళ్ళ వయసుగల ఆవిడ చూపించిన అతిథి మర్యాద మమ్మలిని అవాక్కు చేసి ఉద్వేగ పూరితం చేసాయి. మొత్తం మీద నాకు, నా తల్లి తండ్రులకూ ఆ రిపబ్లిక్ దినం చిరస్మరణీయమైన రోజు.

ఆవిడ జీవిత చరిత్ర సంక్షిప్తంగా:

సరస్వతి రాజమణి ఎవరు?

సరస్వతి రాజమణి గారు 1927లో బర్మా లో ఒక స్వతంత్ర సమరవీరుల కుటుంబంలో జన్మించారు. ఆవిడ తండ్రి, ట్రిచిలో గొప్ప గని యజమాని, స్వతంత్ర సమర ఉద్యమం సమర్థకుడు. ఆయన బ్రిటిషు అధికారులచే అరెస్టు తప్పించుకొనటానికి బర్మాలో స్థిరపడ్డాడు. రాజమణి ఆడపిల్లల పైన అనవసర ఆంక్షలు లేని ఆదర్శ కుటుంబంలొ పెరిగారు. రాజమణి పెరుగుతున్నకొద్దీ నేతాజీ గారి గురించి ఐ.ఎన్.ఏ గురించి వినేవారు. ఆవిడ ఎల్లప్పుడూ జాతీయ ఉద్యమాన్ని మనస్పూర్థిగా సమర్ధించినా దేశం కోసం పొరాడాలనే స్పూర్తి నేతాజీ గారి శక్తివంతమైన మాటల వల్లనే కలిగింది.

Image courtesy: The Hindu

సాహస యువతి:

ఆవిడకి కేవలం 16 ఏళ్ళ అప్పుడు బోసు గారు రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా నిధుల కొరకు, ఐ.ఎన్.ఏ వాలంటీర్ల కొరకు రంగూన్ కు వచ్చారు. గాంధీజీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ లా  కాకుండా బోసు గారు ప్రజలని దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాలంటే ఆయుధాలను ఉపయోగించమని కోరారు. ఆయన తీవ్రమైన మాటలకి ముగ్ధురాలై రాజమణి తన వొంటిపైన గల ఖరీదైన వజ్రాల మరియు బంగారు నగలను ఐ.ఎన్.ఏ కు దానం చేసారు. ఆమె ఉదారమైన ఆ చర్య బోసు గారి దృష్టి దాటి పొలేదు. ఆయన వాకబు చేస్తే ఆవిడ ఆ ఊరిలొని ధనవంతుడైన వ్యాపారి కూతురు అని తెలిసింది.  ఆ మర్నాడే ఆయన రాజమణి ఇంటికి నగలు తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళారు. రాజమణి తండ్రిని కలుసుకొని ‘మీ అమ్మాయి అమాయకత్వము వలన నగలన్ని దానం చేసింది. నేనవి తిరిగి ఇచ్చేయటానికి వచ్చాను ‘ అన్నారు.  ఆ యువతి  ఎంత ధృఢ నిశ్చయంతో ఉందంటె, బోసు గారు అభినందించ కుండా ఉండలేకపోయారు. అదే మీటింగులో ఆ 16 ఏళ్ళ బాల తనని సైన్యంలో తీసుకోమని బోసు గారిని కోరింది. ఆవిడది ఎంత పట్టుదల అంటే, బోసు గారు ఆవిడని ఇంకో 4 మిత్రులని ఐ.ఎన్.ఏ గూఢచారి విభాగంలో గూఢచారులుగా నియమించారు.

ఆ ఆడపిల్లలందరు మగపిల్లల వేషాలు వేసుకొని బ్రిటిష్ సైనిక క్యాంపులోని అధికారుల ఇళ్ళ లోను పనివారుగా చేరారు. శత్రువు స్థావరంలో ఉన్న కోవర్టు ఏజంట్లుగా వారి పని ప్రభుత్వ ఉత్తర్వులను, బ్రిటిషు అధికారుల రహస్య సమాచారం సంగ్రహించి ఐ.ఎన్.ఏ వారికి అందించటం. రాజమణి (మగపిల్లాడిగా ఆమె పేరు మణి) ఆమె మిత్రులు అలా మారువేషాలలో రెండేళ్ళ పాటు బ్రిటీషు వారి కదలికల రహస్య సమాచారం సేకరించారు. ఎట్టి పరిస్థితులలోను పట్టుబడకూడదని యునిట్ వారికి చెప్పినా గాని ఒకసారి ఒక అమ్మాయి బ్రిటిషు వారికి పట్టుబడిపోయింది. పట్టుబడితే వచ్చే పరిణామాలు తెలిసి కూడా రాజమణి ఆమె మిత్రురాలిని రక్షించడానికి నిశ్చయించుకుంది. ఆ ధీశాలి నర్తకి వేషం వేసుకొని జైలు అధికారులకు మత్తుమందు ఇచ్చి తన సహచరిని రక్షించింది.ఆ యువతులు తప్పించుకుంటుండగా బ్రిటిషు వాళ్ళు పేల్చిన ఒక గుండు రాజమణి కుడి కాలుని గాయ పరిచింది.బ్రిటిషు వాళ్ళు వీరి కోసం గాలిస్తున్నా  రక్తం కారుతున్నా రాజమణీ ఆమె మిత్రురాలు పరిగెత్తి ఒక చెట్టు ఎక్కి 3 రోజులు గడిపారు. ఆ బుల్లెట్ గాయం వల్ల అమెకి శాశ్వతంగా కుంటితనం వచ్చినా, ఆమెకి గర్వంగా ఉండేది. ఆమెకి అది ఐ.ఎన్.ఏ ఉత్తేజకరమైన రోజుల తీపి గుర్తు.

     తరువాతి రోజులలో రాజమణి గారు ఎప్పుడూ గుర్తుచేసుకునేది ఎలా నేతాజీ గారు ఆనందించారో ఆ సాహస కృత్యాన్ని మరియు ఆ మధుర స్మృతి ఎలా జపాను చక్రవర్తి ఆవిడకి మెడల్ ఇచ్చారో ఇంకా ఐ.ఎన్.ఏ రాణీ ఒఫ్ ఝాన్సీ బ్రిగెడ్ లో లెఫ్టినెంట్ ర్యాంక్ వచ్చిందో. బ్రిటిషు వారు యుద్ధం గెలిచినాక ఐ.ఎన్.ఏ రద్దు చేయబడి నప్పుడు రాజమణి మరియు ఇతర సభ్యులు నేతాజీ గారి సూచనపై భారత దేశానికి తిరిగి వచ్చారు.

    సరస్వతీ రాజమణి ఆవిడ పరివారము ఉన్నదంతా వదులుకొని భారత దేశానికి తరలి వచ్చారు. బాధాకరమైన విషయమేమిటంటే స్వతంత్ర పొరాతం కోసం సర్వస్వం అర్పించిన పరివారం భారత దేశం వచ్చాక కడు పేదరికం అనుభవించాల్సి వచ్చింది.  చాలాకాలం ఈ ప్రముఖ స్వతంత్ర సేనాని చెన్నైలో ఇరుకైన పాడుపడ్డ నేతాజీ గారి ఫొటోలు తప్ప ఏమీ లేని ఒక గది అపార్టమెంట్ లో గడిపారు. ఈ మధ్యనే తమిళనాడు ప్రభుత్వము పాతదే ఐనా ఒక ఇల్లు కేటాయించారు. దేశానికి సేవ చెయాలనే రాజమణి గారి స్పూర్తికి ధ్రుఢ సంకల్పానికి  వయసు అడ్డం కాలేదు. ఈ వయసులో కూడా ఆవిడ టైలర్ షాపులకు వెళ్ళి బట్టల ముక్కలు, పనికిరాని వస్త్రాలు సేకరిస్తారు. వాటిని దుస్తులుగా మార్చి అనాధ శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు దానం చేస్తారు. 2006లో వచ్చిన సునామి సందర్భంగా ఆవిడ తన చాలీ చాలని పెన్షన్ని దానం చేసారు.

-శ్వేతా ప్రసాద్

(ఆర్గనైజర్ సౌజన్యంతో)