Home News జ‌మ్మూ కాశ్మీర్: సోపార్ లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి

జ‌మ్మూ కాశ్మీర్: సోపార్ లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి

0
SHARE

జ‌మ్ముక‌శ్మీర్‌లోని సోపార్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య మంగ‌ళ‌వారం ఎదురు కాల్పులు సంభ‌వించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మృతి చెందారు. సోపార్ పట్ట‌ణంలోని నాతిపురా గోసియా కాల‌నీలో ఉన్న ఇళ్ల‌లో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారం మేర‌కు అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా ద‌ళాలు, సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, క‌శ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ క‌లిసి సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా టెర్ర‌రిస్టుల‌ను లొంగిపోవాలని కోరిన‌ప్ప‌టికీ వారు స్పందించ‌క‌పోగా, సైన్యంపై కాల్పులు ప్రారంభించార‌ని జ‌మ్ము పోలీసులు తెలిపారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని వెల్ల‌డించారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

DONATE: మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ లింక్ ద్వారా మీ విరాళాలను  అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here