Home News ఘ‌ర్‌వాప‌సి : గుజ‌రాత్ లో హిందూ ధ‌ర్మాన్ని స్వీక‌రించిన 21 కుటుంబాలు

ఘ‌ర్‌వాప‌సి : గుజ‌రాత్ లో హిందూ ధ‌ర్మాన్ని స్వీక‌రించిన 21 కుటుంబాలు

0
SHARE

గుజ‌రాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాల‌కు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు.

దేశ్ గుజరాత్ నివేదిక ప్రకారం… ఈ కుటుంబాలు గ‌తంలో క్రైస్తవ మతాన్ని స్వీక‌రించ‌డానికి ఆక‌ర్షితులై… తిరిగి త‌మ స్వ‌ధ‌ర్మంలోకి రావాల‌ని నిశ్చ‌యించుకుని వాపిలో బాపా సీతారాం ఆశ్రమం నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో మరోసారి సనాతనాన్ని స్వీక‌రించారు.

ఈ సందర్భంగా స్థానిక బిజెపి ఎమ్మెల్యే కనుభాయ్ దేశాయ్ మాట్లాడుతూ, ” విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హిందూ జాగ‌ర‌ణ్ మంచ్ కార్యక్రమంలో హిందూ మ‌తానికి సంబంధిన అనేక స‌మ‌స్య‌లు, వాటిని అధిగ‌మించేందుకు ప‌రిష్కార మార్గాల‌ను చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. అదే విధంగా రాష్ట్రం ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌ల‌వంత‌పు మ‌త మార్పిడి చ‌ట్టంపై ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా హిందూ మ‌తంలోకి తిరిగి వ‌చ్చిన ఒక వ్య‌క్తి మాట్లాడుతూ… ” గ‌తంలో మాకున్న ఇబ్బందుల‌ను ఆసరాగా చేసుకుని క్రైస్త‌వ మ‌త సంస్థ‌ల వారు మా స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రిస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పి మ‌మ్మ‌ల్ని మ‌తం మార్చారు. మేము మ‌తం మారి 5సంవ‌త్స‌రాలు అవుతున్నా మా ఇబ్బందులు ఏమీ త‌గ్గ‌లేదు. ఆ మ‌త‌సంస్థ‌ల ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న లేక స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మ‌వుతాయ‌నే ఆశ‌తో గ‌తంలో మేము మ‌తం మారం కానీ వాస్త‌వాల‌ను గ్ర‌హించి తిరిగి హిందూ మ‌తంలోకి వ‌చ్చాము” అని అన్నాడు.

యూపీ: తిరిగి హిందూ మతంలోకి వ‌చ్చిన‌ ముగ్గ‌రు యువ‌కులు

హిందూ జాగ‌ర‌ణ్ మంచ్ నిర్వ‌హించిన ఘర్ వాప‌సీ కార్య‌క్ర‌మంలో యూపీకి చెందిన ముగ్గ‌రు యువ‌కులు తిరిగి హిందూ మ‌తాన్ని స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా రోషన్ లాల్ హిందూ మతంలోకి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కన్నీరుమున్నీరయ్యాడు. అతను ఎలా మతం మార్చుకోవాల్సి వ‌చ్చిందో వెల్లడించాడు. అతన్ని కొంత మంది వ్య‌క్తులు మత్తుపదార్థాలకు బానిస చేసి ఆ త‌ర్వాత బ‌ల‌వంతంగా మత మార్పిడి చేశార‌ని, ఆ త‌ర్వాత ఆ వ్యక్తులు అతనిని బెదిరించి అత‌ని వ‌ద్ద ఉన్న ఆస్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఔష‌ద మూలిక‌ల దుకాణం కలిగి ఉన్న అరవింద్ అనే వ్య‌క్తి వ‌ద్ద‌కు ఖలీద్, నదీమ్ తరచూ వచ్చేవారు. ఈ క్ర‌మంలో అతను మ‌తం మారితే రూ .10 లక్షలు ఇస్తానని, అలాగే అందమైన అమ్మాయితో వివాహం చేయిస్తామ‌ని న‌మ్మించారు. అరవింద్ వాళ్లు చెప్పిన‌ట్టుగా మతం మారాడు కానీ రూ.10 ల‌క్ష‌లు పొంద‌లేదు, వివాహం కూడా జ‌ర‌గ‌లేదు. అమిత్ అనే మ‌రోక వ్య‌క్తి 2014లో బ‌ల‌వంతంగా ఇస్లాం మతంలోకి మారి అబ్దుల్ గా పేరు మార్చుకున్నాడు. ఆయ‌న తిరిగి హిందూ మతంలోకి వ‌చ్చిన‌ప్పుడు అత‌ని కుటుంబ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు.

బలవంతంగా మ‌త మార్పిళ్ల‌కు గురైన కుటుంబాల‌ను, వ్య‌క్తుల‌ను తిరిగి హిందూ మ‌తంలోకి తీసుకురావ‌డానికి విశ్వ హిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా కృషి చేస్తోంది.

Source : OPINDIA