Home News 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌

26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌

0
SHARE

స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 5,000 మందిని చంపాలని ప్ర‌ణాళిక వెసిన‌ట్టు కసబ్ త‌ర్వాత విచార‌ణ‌లో అంగీకరించాడు.

కారులో వెళ్తున్న వారిని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) అడ్డుకుంది. ఖాన్, కసబ్ తర్వాత జరిగిన కాల్పుల్లో మరో 8 మంది పోలీసు సిబ్బందిని హతమార్చారు. వారు మెట్రో సినిమాని లక్ష్యంగా చేసుకుని జనాలపై కాల్పులు జరిపి, విధాన్ భవన్‌కు వెళ్లి కాల్పులు కొనసాగించారు. టైరు పంక్చర్ కావ‌డంతో ఆ వాహనాన్ని విడిచిపెట్టిన ఉగ్రవాదులు ప్రయాణీకులున్న మ‌రో వాహనాన్ని దొంగిలించి గిర్గామ్ చౌపటీ బీచ్ వైపు వెళ్తుండ‌గా, కాల్పుల్లో ప్రాణాలతో బయటపడిన కానిస్టేబుల్ ను కాపాడేందుకు రోడ్‌బ్లాక్ చేశారు. ఇది గ‌మ‌నించిన ఖాన్, కసబ్ పోలీసు మార్గ‌నిరోధ‌కాల‌ను చూసి వాహ‌నాన్ని వెన‌క్కి తిప్పారు. ఇది గ‌మ‌నించిన పోలీసులు వారిపై జ‌రిపారు. ఇస్మాయిల్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా, అజ్మల్ కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు.

తుకారాం ఓంబ్లే… కసబ్‌ను సజీవంగా ఎలా పట్టుకున్నాడు?

జిహాదీలు పశ్చాత్తాపం లేకుండా చివరి శ్వాస వరకు చంపడానికి శిక్షణ పొందుతారు. ఎట్టి పరిస్థితులలోనూ, పట్టుబడకూడదు, దర్యాప్తులో పాల్గొనకూడదు, ఏమీ సమాచారం ఇవ్వకూడద‌ని కూడా శిక్షణలో బోధిస్తారు. ఈ ఉగ్రవాదులు, ఏదైనా ఒక హేతుబద్ధమైన ప్రయోజనం ఆశించి, (అంటే, ప్రతిఫలంగా బందీల విడుదల, ఒక బ్యాంకు దోపిడీ, ఇటువంటివైతే, ఏమైనా రాజీ-సంప్రదింపులు జరిపే అవకాశం ఉండేది). ఇప్పుడు జీహాద్ పోరాటం చేయలేదు. కానీ ఒక మతపరమైన ధ్యేయం, కసబ్ మాటల్లో చెప్పాలంటే, “అల్లాహ్ ని గర్వపడేట్లు చేయటం’ మాత్రమే వాళ్ళ కళ్ల ముందు ఉన్నది, దానికోసం వాళ్ళు చనిపోయేందుకు కూడా సిద్ధం. ఇంకా చెప్పాలంటే, జీహాద్ మరణం తర్వాత, వాళ్ళకి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని ఇస్లాం మత మౌల్వీలు, ముల్లాలు చెప్పిందే, వీళ్ళు అనుసరిస్తారు, ఇటువంటి ప్రాణాలకు తెగించిన మూర్ఖులను, పోరాటంలో సజీవంగా పట్టుకోవటం, అనితర సాధ్యం.

పోలీసులు, కారులో ఈ ఇద్దరు ఉగ్రవాదులను ఎకె-47 తుపాకులతో చూడగానే, కాల్పులు మొదలయ్యాయి. ఒక బుల్లెట్ తగలగానే, ఖాన్ మరణించాడు, కానీ కసబ్, చనిపోయినట్లుగా నేలపై పడుకున్నాడు. పోలీసులు వాళ్ళ ఆయుధాలు దించి, వీళ్ళ శవాలను తీసుకు వెళ్లేందుకు దగ్గరకు రాగానే, తిరిగి కాల్పులు జరపాలని అతని దురాలోచన.

ఇంతలో, నిరాయుధుడైన తుకారాం ఓంబ్లే జాగ్రత్తగా దగ్గరకు రాగానే, దుర్మార్గుడైన కసబ్ కాల్పులు జరిపాడు. ఓంబ్లే తప్పించుకోవాలని, లేదా పారిపోవాలని ప్రయత్నించకుండా, కసబ్ తుపాకీ బారెల్ కు అడ్డంగా, గుండ్లు దూరం పోకుండా, కమ్ముకున్నాడు. ఆయన ఎదుర్కొన్న, ఈ మొక్కవోని ధైర్యమైన చర్య, ఇచ్చిన సమయం, ఆయన సహచరులు, ఇంకా సమీపంలోకి వచ్చి, కసబ్ ను సజీవంగా పట్టుకునేందుకు తోడ్పడింది. కసబ్ పోలీసులపై జరిపిన కాల్పులను, ఓంబ్లే ఒక కవచం లాగా నిలబడి, తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ, అడ్డుకున్నాడు. కానీ, అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన, ఈ కార్యంలో, ఆయన శరీరంలో 40 బుల్లెట్లు దిగబడ్డాయి, తర్వాత, ఆయన వీరోచితమైన దేహం, కసబ్ పట్టుబడిన తర్వాత కానీ, పూర్తిగా పడిపోలేదు.

26/11 ముంబై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడులలో, దేశం కోసం అసువులు బాసి, అమరులైన రక్షణదళాల సిబ్బంది అందరికీ మనం అందరం సగౌరవంగా, వీడ్కోలు వందనం చేద్దాం. కానీ, లాఠీ పట్టుకునే ఎ.ఎస్.ఐ తుకారాం ఓంబ్లే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కసబ్ ముందుకు దూకి, తన సహచరులకు ఒక కవచంలాగా మారి, ఆ ఉగ్రవాది పట్టుబడేంతవరకు, అతనిని వదలకుండా ఉండి, అతనిని తన సహచరులు పట్టుకున్న తర్వాతనే, ప్రాణాలు అర్పించటం, ‘ధైర్యం, సాహసం, వీరత్వం’ అనే పదాలకు, నూతన ఆవిష్కారాలు చేయటమే అయ్యింది. ఆయన త్యాగం అజరామరం, ఆయన సాహసం సాటి లేనిది, ఆయన వీరోచిత నిర్ణయం నిష్ఫలం కాదు, భారతీయులెవరూ మరచిపోలేనిది. అందుకే, ఆ వీరపురుషునికి, భారత ప్రభుత్వం, దేశ అత్యున్నత, శాంతికాల, శౌర్య పురస్కారం, “అశోక చక్ర” (మరణానంతరం) ఇచ్చి, సన్మానించింది. (శాంతి కాలం అంటే, వేరే దేశంతో యుద్ధం జరగని సమయం). తుకారాం గారి త్యాగంతో ఇంకొకరకంగా చాలా ముఖ్యమైనది. ఆ రోజు ఆయన గనక లేకపోతే, ఒక దీర్ఘకాలిక, లోతైన కుట్ర జరిగిన వివరాలు, దేశానికి ఎప్పటికీ బహిర్గతమయ్యేవి కావు.

‘హిందూ ఉగ్రవాదం’ అని నిందించే కుతంత్రం:

తర్వాత జరిగిన దర్యాప్తులో, విచారణ అధికారులు కసబ్ ను, ఉగ్రవాదుల చేత ఉన్నత స్థాయిలో రచించబడ్డ 26/11 దాడుల ప్రణాళికలలో పాల్గొన్న అబూ జుందాల్ తో ముఖాముఖీ ఏర్పాటు చేశారు. ఈ జుందాల్ మహారాష్ట్ర లోని బీడ్ జిల్లా నివాసి 2012లో ఇతడిని సౌదీ అరేబియా నుండి భారత్ కు రప్పించారు.

కసబ్ ఒక ఫిదాయీన్ (జిహాదీ ఉగ్రవాది) శిక్షణ పొంది కార్యరంగం కోసం పంపించబడ్డాడు. కానీ ఇంకో ప‌క్క జుందాల్ ఇక్కడే పుట్టి ఈ దేశంపై దాడులు చేయాలని ప్రణాళికలు రచించిన ఆరుగురు ఉగ్రవాదులలో ఒకడు. లష్కర్-ఎ-తోయబా సంస్థలో జాతీయ స్థాయి కలిగిన భారతీయుడు. (ఎంత విపరీతమైన, శోచనియమైన విషయం?)

కసబ్ ఒక పాకిస్తాన్ జాతీయుడు, కానీ అతని పుట్టు, పూర్వోత్తరాల నేపథ్య విచారణ జరగకుండా, పాకిస్తాన్ చాలా తీవ్రంగా అడ్డుకుంది, అతని గ్రామాన్ని, సాదా దుస్తులు ధరించిన పోలీసు సిబ్బందితో చుట్టుముట్టి, అక్కడి పాత్రికేయులను, ఆ గ్రామస్థులను బెదిరించి, భయపెట్టి, అతని కుటుంబాన్ని అక్కడ నుండి పంపించివేసింది. కానీ, అతను, జీహాద్ పేరుతో కాఫిర్ ప్రజలను హత్యలు చేసే కిరాయి హంతకుడని, అతని చర్యలను చిత్రీకరించిన రక్షణ కెమెరాలు కానీ, సాక్షులు కానీ, సాక్ష్యాలు కానీ, అతని నేరాంగీకరణ కానీ, అన్నీ తేటతెల్లం చేస్తున్నాయి.

ఇంకొకవైపు, అబూ జుందాల్ మహారాష్ట్ర కి చెందినవాడు, కాబట్టి జీహాద్ కు అతని యాత్ర, దర్యాప్తు విచారణలో సులభంగా తెలుస్తుంది. ఇంకా, లష్కర్-ఎ-తోయబా ఉన్నత నాయకత్వం చేతిలో, కసబ్ అనే తీవ్రవాది, ఒక పంపిణీ చేయదగ్గ పనిముట్టు మాత్రమే. కానీ, కసబ్, జుందాల్ కు తెలిసినట్లు, లష్కర్ నాయకత్వం ఆలోచించే దీర్ఘకాలిక ప్రణాళికలు, లోతైన ప్రణాళికల వివరాలు పొందాడని, ఎవరూ ఊహించలేదు.

కసబ్, తనపై జరిపిన విచారణలో, వాళ్ళకు దాడులు చేయమని జుందాల్, లక్వీ లు శిక్షణ ఇచ్చినట్లు చెప్పాడు. ఇక జుందాల్, కసబ్ లకు అధికారులు ఏర్పాటు చేసిన ముఖాముఖీలో వాళ్ళు ఒకరినొకరు గుర్తు పట్టారు. దీనితో, 26/11 దాడులతో, పాకిస్తాన్ కు, లష్కర్-ఎ-తోయబా ఉన్నత స్థాయి నేతలకు నేరుగా, గట్టి సంబంధాలున్నట్లు ఒక కీలకమైన సాక్ష్యం దొరికింది.

ఇక జుందాల్, లష్కర్ నాయకత్వ ఆలోచన అయిన, ‘హిందూ ఉగ్రవాదం’ అనే నూతన విషయానికి ప్రచారం కల్పించి, హిందువులపై పాకిస్తాన్ తలపెట్టిన ముంబై ఉగ్రవాద దాడులను, ఉపయోగించుకోవాలని పెద్ద ప్రణాళికలే సిద్ధం చేసిందని వెల్లడించాడు. కానీ, ఇక్కడ కసబ్ పట్టుబడిన తర్వాత కూడా, మన ప్రముఖ రాజకీయనేతలు కూడా నిస్సంకోచంగా, 26/11 దాడుల వెనుక హిందూ ఉగ్రవాదం ఉందని నిందలు వేస్తున్నారు. ఈ విషయంలో జుందాల్ అంగీకారం, వాస్తవంగా జరిగిన కుతంత్రాన్ని బయటపెట్టింది.

జుందాల్ ఇదంతా అంటే, హిందువులపై జరిగిన దాడులు, హిందూ ఉగ్రవాదం అనే నిందాపరమైన ఆలోచన తనదేనని, అధికారులకు తెలిపాడు. కానీ, 2008 మాలేగావ్ ప్రేలుళ్లలో ఆరోపణలు ఎదుర్కొన్న, సాధ్వీ ప్రగ్యా సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ లను అరెస్టు చేసిన తర్వాత జరిగిన ప్రతీకార చర్యగా చిత్రీకరించాలని, ఈ ఉగ్రవాద గుంపు ఆలోచించినట్లు తెలిసింది. ఈ వివరాలు, ఈ ఉగ్రవాదులు ఈ మోసపూరిత కుట్రకు, ఎంత తీవ్రమైన ప్రణాళిక వేశారో, అర్థం అవుతున్నది.

ఈ ఉగ్రవాదులు, ఉర్దూలో కాకుండా కేవలం హిందీలోనే మాట్లాడుకోవాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి, ఎందుకంటే వీళ్ళు హిందువులే అని తెలియజేయాలని. (బందీలుగా విచారణకు పట్టుబడకుండా ఉండాలని) . హిందీలో మాస్టర్ డిగ్రీ ఉన్న జుందాల్ నే, ఈ ఉగ్రవాద చర్యకు సరైనవాడని, పాకిస్తాన్ / లష్కర్ నాయకులు నిర్ణయించారు.

ఇంకొక విషయం – ఉగ్రవాదులు, తమ నడుముకు కాషాయ పట్టీలు కట్టుకుని, హిందువుల పేర్లు, అంటే ‘సమీర్ చౌదరి’ మాదిరిగా ప్రతిఫలించేటట్లు, నకిలీ గుర్తింపు కార్డులను ధరించారు. తర్వాత, జుందాల్ ప్రసారమాధ్యమాలకు పంపవలసిన లేఖ ముసాయిదాను, ఈ దాడులకు ‘దక్కన్ ముజాహిదీన్’ (అసలు ఆ పేరు మీద ఏ సంస్థా లేదు) బాధ్యత వహిస్తుందని, హిందీలో తయారుచేశాడు. ఇలా నకిలీ హిందూ పేర్లతో, కాషాయపట్టీలతో కనబడితే, దొరికితే, ఆ దాడుల కుట్రలపై అనుమానాలు, చర్యలు, ప్రచారం, అంతా హిందువుల వైపుగా పోతాయని, అప్పుడు పోలీసులు తమను తప్పుదోవ పట్టించేందుకు, ఇదంతా ఏదో హిందూ సంస్థ ఉత్తరం వ్రాసిందని, ఒక నిర్ధారణకు వచ్చేస్తారని, ఈ ఉగ్రవాదులు అనుకున్నారు.
కానీ, వాళ్ళ విధి వక్రించి, అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు.

అతితెలివితో వ్యవహరించిన ఈ ఉగ్రవాద నాయకత్వం, ఈ దాడుల అనంతరం కేవలం ఫిదాయీన్ల (ఉగ్రవాదుల) శవాలను తీసుకెళ్ళే పోలీసులు, అక్కడ దొరికిన ప్రత్యక్షసాక్ష్యాల ప్రకారం, (అంటే నకిలీ హిందూ గుర్తింపు కార్డులు, కాషాయ పట్టీలు) ఇదంతా (ఉర్దూలో కాకుండా) హిందీలో మాట్లాడిన హిందూ ఉగ్రవాదుల పనేనని, తమ ఉన్నతాధికారులకు తెలియజేస్తారు.

కసబ్ తన ఋజుపత్రంలో, జుందాల్ ఇచ్చిన వివరాలైన, ఈ ముంబై దాడులు హిందూ తీవ్రవాదుల పనేనని నిందించాలని, ఉగ్రవాదులు ఆలోచించిన సంగతిని, ధృవీకరించాడు.

దీనితో ఏమి పాఠాలు మనం నేర్చుకున్నాం?

ఈ దాడుల అనంతరం, దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా లేదనీ, బలహీనంగా ఉన్నదనీ, అందరికీ తెలిసినట్లే, ఈ ‘హిందూ తీవ్రవాదం’ మీద జరిగిన కుట్రను కూడా, చీపురుతో తుడిచేశారు. ఈ 26/11 దాడుల విషయంలో, ఇదంతా హిందూ సమూహాల ‘అంతర్గత కార్యం’ అని జబ్బలు చరిచి బొబ్బలు పెట్టేవాళ్ళు, తమ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు, అతిముఖ్యమైన దేశభద్రత విషయంలో, తమని ఎవరూ, ఏమీ ప్రశ్నించకుండా (ఈ విషయంలో తమ పొరబాటు ఉన్నా కూడా) జాగ్రత్తపడ్డారు. కానీ, 26/11 దాడులు ‘అంతర్గత కార్యం’ అవుతుందా?

ఆర్.వీ.ఎస్. మణి అనే మాజీ ప్రభుత్వ అధికారి, (కేంద్రం గృహ మంత్రిత్వ శాఖలో కార్యదర్శి స్థాయిలో పనిచేశారు) తాను వ్రాసిన “హిందూ టెర్రర్: ఇన్ సైడర్ ఎకౌంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫ్ఫైర్స్ 2006-2010” అనే గ్రంథంలో “అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వాస్తవాన్ని తొక్కిపట్టి, హిందూ తీవ్రవాదం, అనే నూతన కథనాన్ని దేశంపై రుద్దింది, సరికదా, దానికి ఏ మాత్రం వెనుకాడలేదు” అని పేర్కొన్నారు. ఈ 26/11 ముంబై దాడులు, కాంగ్రెస్, ఐఎస్ఐ ల మధ్య కుదిరిన చీకటి ఒప్పందం అని, తాను ఈ మాటకు కట్టుబడి ఉన్నానని, కానీ ఈ విషయవాస్తవాలు, అర్హతలపై చర్చకు ఎవరూ ముందూ రావటం లేదనీ వాపోయారు. వారు ఈ విషయమై ట్వీట్ కూడ చేశారు. దర్యాప్తు సమయంలో కసబ్, అధికారులను తప్పుదోవ పట్టించేందుకు చాలాసార్లు మాట మార్చేవాడు. తన వాంగ్మూలాన్ని అనేక పర్యాయాలు మార్చాడు. మళ్ళీ తాను ఇచ్చిన సమాచారాన్ని, తానే విరుద్ధంగా చెప్పేవాడు. ఈ దర్యాప్తులో తాను పాకిస్తాన్ లో పొందిన శిక్షణను, అతను ఉపయోగించుకునేవాడు. ఉదాహరణకు.. పేదరికం వలన తన కుటుంబం తనను ఉగ్రవాదులకు అమ్మివేసిందని చెప్పాడు. మళ్ళీ తాను, ‘సరిపోయినంత ధనం’ ఇస్తే భారత్ కు కూడా తనను తాను అమ్ముకుంటానని అనేవాడు తాను, ఈ విగతజీవులను చూడలేకపోతున్నానని వాగేవాడు, అసలు తాను ఒక నటుడు కావాలని భారత్ కు వచ్చినట్లు చెప్పేవాడు. అన్ని అబద్ధాలే. ఇవన్నీ అతను విచారణలో అనేక సందర్భాలలో గతంలో తెలిపిన పాత సమాచారానికి విరుద్ధంగా ఉండేవి ఇంకా ప్రత్యక్ష పరిస్థితికి వాస్తవాలకు వ్యతిరేకంగా ఉండేవి.

ఇంకా మనం శ్రద్ధగా పరిశీలిస్తే, ఈ విషయాలన్నీ మన ప్రసారమాధ్యమాలు, ఇంకా మేధావులు, అసమంజసంగా, తమకు కావలసిన మేరకు, తమకు కావలసిన విధంగా, ప్రముఖంగా ప్రసారం చేసేవాళ్ళు. ప్రభుత్వంలో ఉన్న రాజకీయవాదులు, అసలు విషయమైన ‘జాతీయ భద్రతా లోపం’ అనే అంశాన్ని ప్రక్కన బెట్టి, ఇంకొక కోణంలో ‘హిందూ తీవ్రవాదం’ అనే నూతన కథనాన్ని ప్రచారం చేసి, దేశాన్ని, జాతిని తప్పుదోవ పట్టించేందుకు, తిప్పలు పడ్డారు కదా, అందుకు రాజకీయ వత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా అనేది అందరూ ఆలోచించాలి.

అరుంధతి రాయ్ తన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికా వ్యాసంలో దాడుల కేంద్రమైన తాజ్ హోటల్ ‘సామాన్య భారతీయులు ప్రతి రోజూ భరించే ఒక సులభమైన అసహ్యకరమైన అన్యాయం’ అని చెప్తూ, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించారు. ఏబిసి న్యూస్ పోలీసులను ఉటంకిస్తూ కసబ్ కు అసలు ఇస్లాం గురించి ఇస్లాం సిద్ధాంతాలు గానీ భావజాలం గానీ, ఏమీ తెలియదు, అని ప్రసారం చేసింది. ఇంకొకటి ఏమంటే, ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన 26/11 ముంబై దాడుల విషాద సంఘటనలో, ఎవరైనా తాము, బాధితుల వైపు నిలబడాలి, వాళ్ళు ఆడగలేని ప్రశ్నలను తాము అడగాలి, తాము మామూలు జీవితంలోకి తిరిగి ఎందుకు రాలేమని, ఈ నిందితులను నిలబెట్టి, అడగాలి. ఇది జరుగుతుందా, అనేది సందేహమే.

ఈ రోజు మనం, తనలాగే ఈ పవిత్ర మాతృభూమి రక్షణకై పోరాడి, ప్రాణాలు అర్పించి, అమరులైన అనేకమంది, (లెక్కపెట్టలేనంత మంది) కీర్తిశేషులలో కలిసిపోయిన, ఓంబ్లే గారిని తలుచుకుంటున్నాం.
ఓంబ్లే గారి అనూహ్యమైన, సాహసోపేతమైన, సమయోచిత నిశ్చయం వలన, వారు కసబ్ యొక్క కసాయి బుల్లెట్ల నుండి, బలి కాబోయే ఎంతో మందిని తన ప్రాణాలొడ్డి రక్షించారు, అంతమాత్రమే కాదు, కొన్ని శతాబ్దాలనుండి పరాయి దేశస్థుల వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించి, తీవ్ర గాయాలపాలైన హిందూ జాతిని కూడా రక్షించారు, హిందువులు తమపై తామే దాడులు చేసుకొంటున్నారనే అపవాదు నుండి కూడా రక్షించారు.

‘భారత మాత వీర కుమారుడు, సాహసి, కీ. శే. తుకారాం ఓంబ్లే గారు అమర్ రహే!
వారి పావన ఆత్మకు భగవంతుడు శాంతి ప్రసాదించు గాక!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here