Home News జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్… ముగ్గురు ఉగ్ర‌వాదుల మృతి

జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్… ముగ్గురు ఉగ్ర‌వాదుల మృతి

0
SHARE

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో గురువారం రాత్రిపూట భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు శుక్రవారం తెలిపారు.

ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే 56 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీపీ కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరిని శ్రీనగర్‌కు చెందిన వసీమ్‌గా గుర్తించామని, మరో ఇద్దరి వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈనెల 5న పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు. అందులో ఒకరు పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాది ఉన్నాడు. ఈ ఏడాది మొదటి వారంలో 16 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here