Home Ayodhya అయోధ్య రామమందిరం కోసం ప్రజాపోరాటం – మొదటి భాగం

అయోధ్య రామమందిరం కోసం ప్రజాపోరాటం – మొదటి భాగం

0
SHARE
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం, ఉద్యమాల తరువాత చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాట చరిత్రను పరిశీలిద్దాం.

క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమం అయింది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీ రాముని జన్మస్థలంలో మందిరం కోసం హిందువులు

500ఏళ్లుగా సాగిస్తున్న పోరాటపు సంక్షిప్త వివరాలు చూద్దాం –

బాబర్ కాలంలో (క్రీ.శ1528-1530) 4 యుద్ధాలు జరిగాయి.
హుమాయున్ కాలంలో(క్రీ.శ 1530-1556)  10 యుద్ధాలు జరిగాయి.
అక్బర్ కాలంలో (క్రీ.శ 1556-1606)  20 యుద్ధాలు జరిగాయి.
ఔరంగజేబు కాలం లో (క్రీ.శ 1658-1707) 30 యుద్ధాలు జరిగాయి.
నవాబ్ షాదిత్ ఆలీ కాలంలో (క్రీ.శ 1770- 1814) 5 యుద్ధాలు జరిగాయి.
నసీరుద్దీన్ హైదర్ కాలంలో (క్రీ.శ 1814-1836) 3 యుద్ధాలు జరిగాయి.
వాజీద్ ఆలీషా కాలంలో (క్రీ.శ 1847-1857) 2 యుద్ధాలు జరిగాయి.

బ్రిటిష్ వారి హయాంలో (క్రీ.శ 1912-1934) 2 యుద్ధాలు జరిగాయి.
ఇలా 1934వరకూ హిందూ సమాజం మొత్తం 76 యుద్ధాలు చేసింది.

1528లో బాబర్ ప్రధాన సేనాని మీర్ బాకీ రామ మందిరం నాశనం చేసిన నాటి నుండి, ఈ వివాదం ఒక ఉద్యమం లా సాగుతోంది. 1528 నాటి నుండి అన్ని తరాల వారు రామ జన్మభూమి కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రతి తరంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

1934 సంవత్సరం.. 
అయోధ్యలో కొందరు ముస్లిములు ఒక గోవును హత్య చేయడంతో, హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆవును చంపిన కసాయి వాళ్ళని తుదముట్టించారు. ఆ తరువాత హిందువులు బాబ్రీ కట్టడoపై దాడి చేయడంతో దానికున్న  మూడు గుమ్మటాలు దెబ్బతిన్నాయి. హిందువులు కట్టడాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే, బ్రిటిషు వాళ్ళు హిందువులనుంచి బాబ్రీ కట్టడాన్ని స్వాధీనం చేసుకుని, దెబ్బతిన్న గుమ్మటాలను బాగుపరచమని హిoదువులమీద జరిమానా విధించారు. 1934 సంవత్సరం నుంచి ఏ ముస్లిం బాబ్రీ కట్టడoలోకి ప్రవేశించలేదు.

శ్రీరామ జన్మభూమి ఒక రాజకీయ ఉద్యమమా?

కచ్చితంగా కాదు.  శ్రీరామ జన్మభూమిలో  ఆలయం నిర్మించడం అంటే కేవలం సున్నం ఇటుకలు పేర్చడం కాదు. హిందువులకు ఇది సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు హిందూ అస్తిత్వానికి సంబంధించిన అంశం. అది మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రాముడు జన్మించిన స్థలం. ఆ ఉద్యమం  హిందువుల సామూహిక సాంస్కృతిక చైతన్యానికి  చిహ్నం.

బాబ్రీ కట్టడాన్ని ధ్వంసం చేయడం ద్వారా, ఒకప్పుడు కొందరు జరిపిన దౌర్జన్యానికి, వినాశనానికి, ఈనాటి ముస్లిములు మూల్యం చెల్లించాలని కోరుతున్నారా?

బాబ్రీ కట్టడoపై  ఈనాటి ముస్లిముల దృష్టి ఏమిటి అనేది అసలు విషయం. వారు దాన్ని తమ పవిత్ర స్థలంగా భావిస్తున్నారా? ఔను అని సమాధానమైతే, వారు బాబర్, ఇంకా ఇతరుల క్రూరమైన దాడులను తమ సొంతం చేసుకుంటున్నవారవుతున్నారు. ఈనాటి ముస్లిములు ఈ దౌర్జన్యం, వినాశనంతో తమను తాము దూరం చేసుకోవడం సరియైన పద్ధతి. హిట్లర్ నేరాలకు, ఘోరాలకు ఈనాటి జర్మన్లు క్షమాపణ కోరుకుంటారు. దాన్ని బట్టి వారు నాజీ ఇజాన్ని ఎంతమాత్రం సమర్థించరని అర్థమవుతుంది.

హిందువులు కేవలం మూడు పవిత్ర స్థానాలను (అయోధ్య, మథుర, కాశీ) మాత్రమే, అదీ న్యాయస్థానాల ద్వారా లేక సంప్రదింపుల ద్వారా, శాంతియుతంగా తిరిగి ఇవ్వమని కోరారు. ఇవేకాక అనేక వేలాది దేవాలయాలు దోపిడీకి, విధ్వంసానికి గురయ్యాయి. వాటిపై మసీదులు కట్టారు. అయినా వాటినన్నిటినీ తిరిగి ఇవ్వాలని హిందువులు కోరట్లేదు.

READ: అయోధ్య: తాజా తవ్వకాల్లో నాటి ఆలయ అవశేషాలు లభ్యం

ఆక్రమణ గుర్తులుగా నిర్మించిన కట్టడాలు

1918 లో రష్యా ఆక్రమణ అంతమైనప్పుడు పోలండ్ ప్రజలు వార్సాలో చేసిన మొదటి పని రష్యన్లు నిర్మించిన రష్యన్ ఆర్థొడాక్స్ క్రిస్టియన్ కెథడ్రల్ ను కూలగొట్టడం. నిజానికి పోలాండ్ ప్రజలు క్రిస్టియన్లు, జీసస్ ను ఆ కెథడ్రల్ లో పూజిస్తారు కూడా.  కానీ వారు రష్యా నిర్మించిన కెథడ్రల్ ను ఆరాధనా స్థలంగా భావించలేదు. ఆ కట్టడాన్ని తమ బానిసత్వాన్ని గుర్తుతెచ్చే ప్రదేశంగా భావించి దాన్ని కూల్చి వేసారు.

12వ శతాబ్దంలో స్పెయిన్ ను మూర్ లు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా అక్కడి ప్రజలను బలవంతంగా క్రైస్తవ మతం నుండి ఇస్లాం మతం కు మార్చారు. 16 వ శతాబ్దం లో క్రైస్తవులు మూర్స్ నుండి స్పెయిన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు వారు తమ దేశంలో ఉన్న ముస్లింలకు  తిరిగి క్రైస్తవ మతాన్ని స్వీకరించడం, మూర్స్ తో పాటు దేశం విడిచి వెళ్లడం లేదా చావడం అనే మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకొమ్మన్నారు. మసీదులన్నింటిని చర్చ్ లుగా మార్చివేశారు. ఈ పునః క్రైస్తవీకరణ కూడా బలవంతంగా జరిగింది.

READ: “అయోధ్య: నాకు తెలిసిన నిజం, నేను చెప్పిన నిజం” – కెకె మహ్మద్ (భారత ఆర్కియాలజీ మాజీ అధికారి)

అయోధ్య లో ప్రస్తుతం ఉన్న ఆలయం స్థానంలో భవ్యమైన  దేవాలయం నిర్మించాల్సిన అవసరం ఏమిటి

రామ జన్మభూమి ఉద్యమం కేవలం ఇటుకలు, సున్నానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది దేశం, సంస్కృతులకు తిరిగి గౌరవం సాధించడం. ప్రజలు తమ గొప్ప గతాన్ని గుర్తుచేసే దేవాలయాలు నుండి ప్రేరణ పొందుతారు. కాబట్టి ఈ ప్రదేశం లో సరైన, పూర్తి స్థాయి ఆలయం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.

ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఆలయ పునాది రాయి వెయ్యడం నిజమేనా

అవును, బీహార్ కు చెందిన శ్రీ కామేశ్వర చౌహాల్ కు నవంబర్ 10 1989 నాడు రామజన్మభూమి ఆలయ పునాది రాయి వేసే గౌరవం దక్కింది. శ్రీ రామజన్మభూమి ఉద్యమపు అద్భుతమైన సమైక్యతా స్ఫూర్తికి, శక్తికి ఇది స్పష్టమైన సంకేతం.

Download Samachara Bharati Android App