Home Views తొమ్మిది రోజుల బతుకమ్మ

తొమ్మిది రోజుల బతుకమ్మ

0
SHARE

-Dr. ముదిగొండ భవానీ

ఆశ్వీజమాసం, శరత్ ఋతువులో అమావాస్య రోజు నుండి బతుకమ్మ పండుగ ప్రారంభిస్తారు. ఈ ఋతువులో ఎన్నో రకాల పూలు వికసించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఒక వైపు వైదిక సంప్రదాయం ప్రకారం అమ్మవారి నవరాత్రులు సమాంతరంగా బతుకమ్మ పండుగ సంబురాలు. చోళుల కాలం. నుండి కాకతీయుల కాలంలో కూడా ఈ బతుకమ్మ నిర్వహించబడుతుంది. రాజుగారి కుమారులు వరుసగా మరణించటంతో తరువాత పుట్టిన ఒక అమ్మాయి ని బతుకమ్మ’ అని ఆ శిశువుని సంబోధించటం విశేషం. ఆనాటినుండి బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది తెలుగు సాహిత్యం లో ఉన్న కథలన్నీ సంఘటనలన్నీ జానపద సాహిత్యంలో ఏవిధంగా ఉన్నది, అదే విథంగా వైదిక సంప్రదాయం ప్రకారం దేవాలయంలో జరిగే నవరాత్రులు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన అలంకారం ప్రత్యేకంగా నైవేద్యం ఏవిధంగా పాటిస్తారో అదే విధంగా 9 రోజులు జరిగే బతుకమ్మకి కూడా తొమ్మిది రకాలైన ఫలహారాలు చేయడం విశేషం. ముఖ్యంగా ఈ బతుకమ్మని దేవాలయ ప్రాంగణంలో గాని, చెరువుల వద్ద గానీ ఆడటం అనేది ముఖ్యమైనది. అంతేకాకుండా బతుక్కని చక్కగా అలికి, ముగ్గులు తీర్చిదిద్ది, పీటపై ఉంచి, దాని పై పసుపు గౌరమ్మ ని ఉంచి ఆడడం పద్ధతి. కానీ ప్రస్తుతం నగరం నడివీధిలో బతుకమ్మలు, ఆడటం ఎంతవరకు సబబు? విజ్ఞులు ఆలోచించాల్సిన విషయం. బ్రతుకునిచ్చే బతుకమ్మ ను నడిరోడ్డున ఆడడం వలన బ్రతుకులు కూడా రోడ్డు పాలై పోతున్నాయని చెప్పకనే చెప్పినట్లయింది.

ఈ బతుక్కు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా కొలువై ఉంటుంది. మొదటి రోజు బొడ్డెమ్మ గా మట్టి తో , ఎంగిలిపూల బతకమ్మగా పేర్చి-నువ్వులు , నూకలు, బెల్లంతో చేసిన పదార్ధాలని నైవేద్యంగా పెడతారు . రెండవ రోజు అటుకుల బతుకమ్మ గా పేర్చి అటుకుల తో ప్రసాదం, మూడవ రోజు ముద్ద పప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంలోనైవేద్యం, నాల్గవ రోజు నానబియ్యం బతుకమ్మ , నానిన బియ్యంలో చేసిన ప్రసాదం, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, చిన్న చిన్న అట్ట్లు చేసి నైవేద్యం పెడతారు . ఆరవ రోజు అలిగిన చితకర్మ అంటే బతుకమ్మ ఆడతారు కానీ నైవేద్యం ఉండదు. ( బహుశా స్త్రీలు ఐదు రోజులు వైవేద్యం చేసి అలిసి  పోతారు కాబట్టే చిన్న విరామం అనుకోవచ్చు.]. ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ . అంటే వరి పిండి లో కొన్ని చిన్నగా వేపకాయలుగా చేసి నూనెలో వేంచి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ – వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యం పెడలారు. చివరగా సద్దుల బతుకమ్మ అంటే కేవలం అన్నంతో రకరకాల పులిహారాలు చేయడం. చింత పండు, నిమ్మకాయ, కొబ్బరి, నువ్వులు, పల్లీలు, పెరుగన్నం, మిరియాల పొడితో నిమ్మ ఉప్పు, మామిడికోరు మొదలైన పదార్థాల తో 9 రకాల సద్దులు తయారు చేసి సద్దుల బతుకమ్మ గా పిలుస్తారు. ఈ బతుకమ్మని సాయంత్రం వేళ మాత్రమే. విశాలమైన ప్రాంగణంలో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అంతా ఒక చోట కూడా సరదాగా ఆడుకుని, వివిధరకాల పాటలతో ఆనందంగా గడుపుతారు.ఈ బతుకమ్మలని గునుగు, తంగేడు,  గుమ్మడి , బంతి, చామంతి, మందారం మొదలైన పూలతో పేరుస్తారు.
ఈ పర్కులో పాటలు —
1. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాల్లో
ఒక్కూరికిచ్చెను ఉయ్యాల్లో

2) జనకు జనకునింట్ల ఉయ్యాలో– సత్య జనకునింట ఉయ్యాలో
పుట్టింది ఆ సీత ఉయ్యాలో

(  సీత జననం నుండి వివాహం వరకు ఏవిధంగా ఎదిగిందో ఏయే పనులు చేసిందో వర్ణించే)

ఈ పాటల్లో ఆడపిల్లలకి ఎన్నో సూచనలు, ఏ విధంగా ప్రవర్తించాలి. కొత్త కోడళ్ళకి సూచనలు, హస్యం, హేళన  ( నేసిరమ్మ సాలొరు ఉయ్యిలో నెలకొక్క పోగు ఉయ్యాలో ) ఎంత నెమ్మదిగా నేస్తే మాత్రం నెలకి ఒక్క పోగు చేయడు కదా? ఎవరినీ ఉద్దేశించి కాకుండా పరోక్షంగా వ్యక్తి త్వ వికాసానికి తోడ్పడే అంశాలు ఎన్నో ఉంటాయి. పాటల మద్యలో వాళ్ళింట్ల పిల్లల పేర్ల  నీ కలిపి పాడడం క ఆచారంగా వస్తుంది. గ్రామంలో ఒక చోట అందరూ కూడి ఆడతారు కాబట్టి అందరి యొగక్షేమాలు. తెలుసుకోగలిగే ఆవకాశం ఉంటుంది..
బతుకమ్మ ఆడేది పూలతో. అంటే పచ్చని మొక్కలు ఉన్నప్పుడే పూలు వికసిస్తాయి. పచ్చదనాన్ని కోరుకోవటం. ఒక చోట చేరడం ఇక్వతని సూచిస్తుంది. వివిధ రకాలైన పూలు ఔషదీ గుణాన్ని కలిగి ఉంటాయి. కనుక వాటిని చెరువులోని వేయటం. వలన నీరు కలుషితం కాకుండా ఉంటుంది. చెరువులు పరిరక్షింప బడతాయి. బతుకమ్మ ని సరైన పద్ధతిలో వంగి, చేతులు చరుస్తూ ఆడడం వలన రాబొయేది శీతకాలం కనుక శరీరానికి వ్యాయామం కలిసగి ఆరోగ్యం గా ఉంటారు. రక్త ప్రసరణ బాగుంటుంది. కానీ ఈ
మధ్య నడిరోడ్డున  D. J ల తో హారెత్తించేస్తున్నారు రాజులే వేస్తు బతుకుని నడిరోడ్డున పడేయకుండా బతుకమ్మ ని గౌరీ ని పరీక్షించడం మన అందరి బాధ్యత.

కొస మెరుపు
9 రోజులే ఎందుకు ఆడతారు? :- సహజ సంఖ్య లు1 నుండి 9 మాత్రమే. ఒక శిశువు తల్లి గర్భంలో ఉండేది 9 నెలలు. విదేశాల్లో కూడా 9′ సంఖ్యన సాక్షాత్తు భగవంతునిగా పూజిస్తారు. ప్రపంచంలో ఉన్న ఏ అంశం అయినా ‘9’ సంఖ్యతోనే ముడిపడి ఉంది. కనుకనే 9 రోజులు అటు నవరాత్రులు కానీ ఇటు బతుకమ్మ ఆడటం కానీ జరుపుకుంటున్నాం.

–ర‌చ‌యిత‌: అధ్యాపకురాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here