ఆజాన్ సమయం... దుర్గాపూజ మైక్ ఆపేయండి : ఛాందసులు బెదిరింపులు

VSK Telangana    13-Oct-2024
Total Views |
 
calcutta
 
కోల్ కత్తాలో కలకలం రేగింది. ముస్లిం ఛాందసులు కొందరు గార్డెన్ రీచ్ లోని దుర్గా మండపంలోకి ప్రవేశించి, మైక్ ఆపేయాలని బెదిరింపులకు దిగారు. ఆజాన్ జరుగుతోందని, అందుకే దుర్గాపూజ మండపం మైక్ ఆపేయాలని డిమాండ్ చేశారు. దీంతో మండప నిర్వాహకులకు, ముస్లిం ఛాందసులకు మధ్య తీవ్ర వాగ్వాదం రేగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో దుర్గాపూజ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్రమంగా దుర్గా మండపంలోకి ప్రవేశించి, పూజకు అంతరాయం కలిగించినందుకు రెండో కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియోలను స్థానిక బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు పోస్ట్ చేశారు. పూజా మండపంలోకి కొందరు ప్రవేశించి, ఆజాన్ సమయమని, మైక్ బంద్ చేయాలని బెదిరించారని పేర్కొన్నారు.