ప్రస్తుతం దేశమంతా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. హిందువులందరూ ఘనంగా అమ్మవారి నవరాత్రులు చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు దాండియా ఆడుతుంటారు. ఈ దాండియా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంటాయి. ఈ సమయంలో కొందరు ముస్లిం యువకులు అత్యంత ఘోరంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నట్లు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ముస్లిం యువకులు హిందువుల పేర్లు పెట్టుకొని, దాండియా ఉత్సవాల స్థలాలకి వస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నగరంలోని బేగంపేటలో జరిగిన దాండియా ఈవెంట్ లోకి ఓ ముస్లిం చొరబడ్డాడు. వెంటనే అక్కడి వారు ఆ యువకుడి కదలికలను గమనించి, పసిగట్టేశారు. పట్టుకొని, నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. దిక్కుతోచని స్థితిలో ఆ ముస్లిం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.
వెంటనే ఈ విషయం ఈవెంట్ ఆర్గనైజర్‌కి తెలిసింది. కానీ.. ఆర్గనైజర్ ప్రదీప్ జడేజా మాత్రం హిందువులకే తలవంపులు తెచ్చేలా మాట్లాడాడు. ఇది అత్యంత దురదృష్టమని అక్కడి వారు మండిపడ్డారు. తనకు పెద్ద పెద్ద లీడర్లు తెలుసంటూ దురుసుగా ప్రవర్తించాడు. స్వయంగా హిందువు, బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన ఈవెంట్ ఆర్గనైజర్ అత్యంత దురుసుగా మాట్లాడాడు.
నిజానికి ఈ నవరాత్రుల్లో మహిళలు భారీ సంఖ్యలో దాండియా ఆడుతుంటారు. డీజే పాటలు పెట్టుకుంటారు. ఈ సమయంలో మైదానాల్లో పోలీసులు రక్షణ కల్పిస్తే బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా పురుషులు అక్కడి వచ్చి, ప్రదర్శనను చూడాలని అనుకుంటే ఆధార్ కార్డులు గానీ, ఇతరత్రా గుర్తింపు కార్డు చూపించే ... లోపలికి అనుమతి ఇస్తే బాగుంటుంది. అలాగే అక్కడి ప్రాంతాల్లో సీసీ టీవీలను కూడా యాక్టివేట్ చేస్తే బాగుంటుంది.
నిజానికి ఓ పద్ధతి ప్రకారం కొందరు ఛాందసులు హిందువుల ర్యాలీలు, ఉత్సవాల్లోకి చొరబడుతున్నారు. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో మరింత పెరిగింది. హిందువుల పేర్లు తగిలించుకొని, నానా తప్పుడు పనులు చేస్తున్నారు. పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత అసలు పేరు చెప్పకుండా అప్పటికప్పుడు పెట్టుకున్న హిందువుల పేర్లను బయటికి చెబుతున్నారు. దీంతో హిందూ యువకులకు తలవంపులు వస్తున్నాయి. దీనిని పోలీసులు, ప్రభుత్వం వెంటనే అరికట్టాలి.