Home News శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణం భారత అంతర్నిహిత శక్తి సాక్షాత్కారం

శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణం భారత అంతర్నిహిత శక్తి సాక్షాత్కారం

0
SHARE

తీర్మానం -1:

శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం `శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధిసమర్పణ ఉద్యమం వంటివి భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలవడమేకాక తరతరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ భారత్ అంతర్నిహిత శక్తిని మరింత బలపరచడమేకాక ఇవి ఆధ్యాత్మిక జాగృతి, జాతీయ సమైక్యత, సద్భావన, నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తాయని అఖిల భారతీయప్రతినిధి సభ భావిస్తున్నది.

భాద్రపద కృష్ణ ద్వితీయ, యుగాద్బ 5122(2020 ఆగస్ట్ 5) రోజున గౌరవనీయ భారత ప్రధాని, ఆర్ ఎస్ ఎస్ పూజ్య సర్ సంఘచాలక్, శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, గౌరవనీయ సాధుసంతులు, అన్ని మతసంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యుల సమక్షంలో ప్రారంభమయిన మందిర నిర్మాణ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో తిలకించింది. సమస్త పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టి, అన్ని నదులలోని నీళ్ళను ఆ కార్యక్రమంలో ఉపయోగించారు. కోవిడ్19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమానికి హాజరైనవారి సంఖ్యను పరిమితం చేసినా ఆ కార్యక్రమపు ప్రభావం మాత్రం అపరిమితంగానే ఉంది. ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నవారి సంఖ్య పరిమితమైనా హిందూ సమాజం మొత్తం దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా అందులో పాలుపంచుకుంది. సమాజంలోని అన్ని వర్గాలవారు, అన్ని పార్టీలవారు ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

మకర సంక్రాంతి రోజున దేశ ప్రధమ పౌరుడు, భారత రాష్ట్రపతి, అలాగే ఢిల్లీలోని భగవాన్ వాల్మీకి మందిరం నిధి సమర్పణ చేయడంతో ప్రారంభమయిన 44రోజుల `నిధిసమర్పణ అభియాన్’ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాకార్యక్రమం. దేశవ్యాప్తంగా 5.5 లక్షల నగరాలు, గ్రామాల నుంచి 12కోట్లకు పైగా రామభక్త కుటుంబాలు భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం నిధి సమర్పించాయి. సమాజంలోని అన్ని తెగలు, వర్గాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఈ అభియాన్ లో పాల్గొన్నారు. గ్రామ, నగర, అరణ్య, పర్వత ప్రాంతాలకు చెందిన ధనికులు, పేదలు మనస్ఫూర్తిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటువంటి అపూర్వమైన స్పందన, ఉత్సాహం, మద్దతు చూపిన రామభక్తులందరిని అఖిల భారతీయ ప్రతినిధిసభ అభినందిస్తున్నది.

శ్రీ రామునితో ఈ దేశం భావాత్మకంగా ముడిపడి ఉన్నదనే విషయం ఈ అభియాన్ మరోసారి నిరూపించింది. శ్రీ రాముని ఆదర్శాలు సమాజంలో వ్యాప్తి చెందడానికి సామాజిక, మత సంస్థలు, విద్యావేత్తలు, మేధావులు కృషి చేయాలని ప్రతినిధిసభ కోరుతున్నది. అయోధ్య శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణంతోపాటు సామూహిక నిశ్చయం, కృషి ద్వారా శ్రీ రాముని ఆదర్శంతో ప్రేరితమైన సామాజిక, జాతీయ జీవనాన్ని తీర్చిదిద్దుకోవాలి. అదే ప్రపంచానికి మేలుచేసే వైభవోపేతమైన, పటిష్టమైన భారత నిర్మాణానికి దారితీస్తుంది.

Source: RSS.Org

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here