Home News అహంకారం దరిచేరనీక మనం పరమవైభవం సాధిద్దాం : డా. శ్రీ మోహ‌న్ జీ భ‌గ‌వ‌త్

అహంకారం దరిచేరనీక మనం పరమవైభవం సాధిద్దాం : డా. శ్రీ మోహ‌న్ జీ భ‌గ‌వ‌త్

0
SHARE

అహంకారం దరిచేరనీయ‌కుండా దేశానికి పరమవైభవ స్థితిని తీసుకురావాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ శ్రీ మోహ‌న్ భ‌గ‌వ‌త్ గారు పిలుపునిచ్చారు. భాగ్య‌న‌గ‌ర్‌లో నూతనంగా నిర్మించిన ఏబీవీపీ కార్యాలయం “స్పూర్తి ఛాత్ర శక్తి భవన్” ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భగవత్ గారు, అతిథులుగా ఏబివీపి అఖిల భార‌త సంఘ‌ట‌నా కార్య‌ద‌ర్శి, ఏబివిపీ అఖిల భార‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కుమారి నిధి త్రిపాఠి, ఆర్‌.ఎస్‌.ఎస్, వివిధ క్షేత్రాల‌ పెద్ద‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మోహ‌న్ జీ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని ఎంతో కాలంగా శ్రమించి ఒక కార్య సిద్ధి సాధించిన వారికి, ఎవరి ప్రేరణతో ఈ కార్యాలయం నిర్మించారో వారందరికీ అభినందనలు తెలిపారు. మన దగ్గర ఉన్న కార్యకర్తలను ఆత్మవిశ్వాసమే ఏదో ఒక రోజు మన ఆలోచన న్యాయబద్ధమైన అని దానికి ఒక విజయం లభిస్తుంది అనడానికి ఈ కార్యాలయమే ఒక సాక్ష్యం అని ఆయ‌న అన్నారు. ఏబీవీపీ అంటే ఏమిటో తెలంగాణలో ఏబీవీపీ కార్యం ను చూసి తెలుసుకోవచ్చ‌న్నారు. ఈ స‌మ‌యంలో మీరంద‌రూ ఆనందంగా, ఉత్స‌హంగా ఉన్నారు కానీ మన సంఘ ప్రార్థనలో చెప్పుకున్నట్టుగా ఇది కంటాకాకీర్ణ మార్గం అని, ప్రతికూల వాతావరణంలో మన పని వేగం పెంచడానికి చెమట తో పాటు రక్తాన్ని కూడా చిందించాల్సి వ‌చ్చింది అని ఆయ‌న గుర్తు చేశారు.

సత్యాన్ని న్యాయాన్ని నమ్ముకుని నడుస్తున్నప్పుడు త‌మదే సత్యం ఇతరుల అంతా వ్యర్థం అనుకునే తర్క వాదులు వారి సర్వశక్తులను వడ్డీ సత్యాన్ని న్యాయాన్ని అణచాలని చూశారు కానీ సత్యం ఎప్పటికీ దాగదు అని ఆయ‌న పేర్కొన్నారు. అన్యాయాలను ఎదురించి.. బలిదానమిచ్చిన కార్యకర్తల తప ఫలమే ఈ కార్యాలయం అని ఆయ‌న అన్నారు.

స్పూర్తి భవనం అనే పేరు సరైనదే. ఇక్కడి ఏబీవీపీ కార్యానికి ఘన చరిత్ర ఉన్నది ఇదంతా చూసి మన మనసులో ఒక స్ఫూర్తి ఉద్భవిస్తుంది ఆయ‌న ఆకాక్షించారు. మొదటినుండి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత కార్యం అగ్రస్థానంలో ఉంది, ఎలా ఉండాలో తెలంగాణ చూపెట్టి నిలబడింది కార్యాలయం ట్రెండ్ సెట్టర్ గా మిగిలింది, ఒకవైపు విరోధులను ఎదుర్కొని నిలబడటం మరోవైపు ఆవిరోధులతో కలిగిన నష్టాన్ని నివారించడం. ఈ రెండూ తెలంగాణ ఏబీవీపీ కే చెల్లింది వీటి ప్రతిరూపమే నేటి కార్యాలయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

సంఘ ప్రార్థన లో చెప్పినట్లు ఇది కంట కాకీర్ణ మార్గము, 30 ఏళ్ళ క్రితమే ఇది మనకు అనుభవైకవేద్యం అయినది ఇప్పటి కార్యకర్తలు మన దారిలో ముల్లు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు అంటే మనం ఆ సమయంలో చూపిన సహనం ఓపిక నిరోధ సమయంలో సంఘర్షణ చేయడం లోపలి దుఃఖాన్ని ఆపుకుని కార్యకర్తల కోసం కార్యం కోసం ముందుకు వెళ్ళాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇంత చేసినా మనలో శత్రు భావన రాకుండా మనలో నిగ్రహం విశ్వాసం పెంచుకోవాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. ఇప్పుడు కార్యాలయం ఏర్పాటైంది, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.. ఇది మన సమాజంలో నమ్మకం విశ్వాసం ప్రేమ పెంచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఒక సమయంలో ఏబీవీపీ కార్యకర్తలను చూసి అందరూ నవ్వేవార‌ని, మీరు సరస్వతీ ప్రార్థన చేస్తారని ఫస్ట్ ర్యాంకు లో నిలిచిన వారికి అభినందనలు తెలుపుతారని హేళన చేసేవారు, కానీ మనల్ని హేళన చేసిన వారే ఇప్పుడు మన దారిలో నడుస్తున్నారు వారు అదే పనులు చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అప్పుడు మనలను పట్టించుకోని వారు ఇప్పుడు మనలను అగ్రగణ్యులు గా గుర్తిస్తున్నార‌ని తెలిపారు. ఈ సమయంలో కంటకము అంటే మనకున్న సౌకర్యాలే మనకు కంటకంగా మారుతాయి, ఆనందం ఉత్సాహాన్నిసెలబ్రేట్ చేసుకునేటప్పుడు కొంత జాగరూకత కూడా అవసరమేన‌ని, లేకుంటే అనుకూలత కూడా కంటకమే అవుతుంద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. సమాజంలో ఒక స్థాయి రాగానే మనకు అహంకారం వస్తుంది… అందరి లాగా మనం కేవలం విజయం కోసమే పరితపించిన రాదు విజయమే లక్ష్యం కాదు అది మార్గం మాత్రమే కావాలి ఎందరో రాజులు ఎన్నో యుద్ధాల్లో విజయాలు సాధించారు కానీ వాళ్లు వెయ్యి రెండు వేల ఏళ్ల కంటే ఎక్కువగా మనకు తెలియదు యుగయుగాలుగా రాముని ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.

యుగాల నాడే పితృవాక్య పరిపాలన కోసం అడవి మార్గం పట్టిన రాముడిని కేవలం స్మరించడంమే కాకుండా ఆయన ఆదర్శాల పై మనం నిలవాలని కోరుకుంటున్నాం అన్నారు. జూలియస్ సీజర్ ఎన్ని విజయాలు సాధించినా అహంకారంతో అడుగంటి పోయాడు ధర్మాన్ని ఆచరణలో చూపి మన రాముడు అందరి నోళ్లలో నానుతున్నాడని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్ లో కొన్ని గ్రామాల్లో కొన్ని చదరపు కిలోమీటర్ల వరకు శనగ పంట పండించరు. ఎందుకంటే సీతమ్మ తన ఇంటికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ ఎండిన శ‌నగ గింజలపై న‌డ‌వ‌డం వ‌ల్ల‌ రక్తం వ‌చ్చేంది. కనుక నేటికీ కొన్ని మైళ్ల దూరం వరకు శనగలు పండించ‌డం లేదు. యుగాలనాటి సీత ఇప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయిందని ఆయ‌న పేర్కొన్నారు. ధీరులను అనుకూల ప్రతికూలతలు ప్రభావితం చేయలేవని, వారిని పొగడిన, తెగడినా, ఇప్పుడే మరణం ముంచుకొచ్చిన, యుగాంతం వరకు మరణం కోసం ఎదురు చూడాల్సి వచ్చిన వారు చలించర‌ని, సత్యం, న్యాయ‌ మార్గాల మీదనే ఎల్లప్పుడూ చరిస్తారు అంటూ రాత్రి 12 గంటలకు చిరిగిన చొక్కా దర్శించే మంత్రి కథను ఆసక్తికరంగా వివరించారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే స్పృహ మనకు ఉండాలని తెలియజేశారు. మన గూర్చి ప్రపంచంలో మంచి చెప్పిన వాళ్ళు లేరు తిట్లే, నిందలే అటువంటి స్థితి నుంచి మనకు ప్రచారం, ప్రభుత్వం లేని చోట, అనుభవం లేని చోట మనం స్వశక్తితో పైకి ఎదిగామ‌ని తెలిపారు. పెద్దపెద్ద కార్యాలను సౌకర్యాలతో కాకుండా కార్యకర్తల శక్తితో సాధించడమే ఆవశ్యకం ఆత్మీయత, ధ్యేయ నిష్ట, అనుశాసనంతో కార్యకర్తల గుణాలను వికసింప జేసి వారిని శక్తివంతులుగా చేశామ‌న్నారు.

మనం ఎప్పుడూ మోసాల వెంట, కీర్తి వెంట, అబద్ధాల వెంట పడరాదు. శీలం వెంట మాత్రమే ఉండాలి జ్ఞాన శీల ఏక‌త లే మన బలం కావాలని నూత‌న భవనంతో పూర్తి ఉత్సాహం కార్య వేగం పెంచడానికి లభించిన సౌకర్యాలతో శక్తిని పూర్తిగా వినియోగించాలని, కార్య‌నిష్ఠ‌తో పరమ వైభవాన్ని సాధించాల‌ని విద్యార్థుల‌కు, విద్యార్థి నాయ‌కుల‌కు మోహ‌న్ జీ ఈ సంద‌ర్భంగా సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here