Home News హిందువులంద‌రూ సంస్కృత భాష తెలుస‌ని చెప్పాలి – కమలానంద భారతి పిలుపు

హిందువులంద‌రూ సంస్కృత భాష తెలుస‌ని చెప్పాలి – కమలానంద భారతి పిలుపు

0
SHARE
హిందూ మ‌త ప‌రిర‌క్ష‌ణ‌కు హిందువులంద‌రూ సంస్కృత భాష తెలుస‌ని చెప్పాల‌ని గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. “జనాభా లెక్కలు జరుగుతున్నాయి. మీ ఇంటికి అధికారి వచ్చినప్పుడు, మీ మాతృభాష కాకుండా ఇంకే భాషలు మాట్లాడుతార‌ని అడిగితే, “సంస్కృతం” భాష మాట్లాడాత‌మ‌ని చెప్పాల‌ని వారు సూచించారు. ఇటీవ‌ల మీడియాతో వారు మాట్లాడుతూ సంస్కృతం మన సంప్రదాయాలలో, పూజలలో, దేవాలయాలలో, అర్చనలలో, మనకు తెలియకుండానే వింటూ ఉంటున్నామ‌న్నారు. గత జనాభా లెక్కలలో, దేశం మొత్తం మీద కేవలం 2000 మంది మాత్రమే సంస్కృతం తెలుసునని చెప్పార‌ని, అదే  ‘అరబిక్ భాష తెలుసునని 50000  ‘పర్షియన్’ భాష తెలుసునని 12000 మంది చెప్పారు. ఆ సంఖ్య ఆధారంగానే ఆయా భాషల అభివృద్ధికి నిధులు మంజూర‌య్యాయ‌ని వారు గుర్తు చేశారు.
‘సంస్కృతం’ తెలిసిన వారి సంఖ్య ఇంకా తగ్గిపోతే, మన ఆచార వ్యవహారాలకు, పూజా పునస్కారాలకు, వేదాలలో నిక్షిప్తమైన విజ్ఞానాన్ని పంచుతున్న అమృతభాష సంస్కృతాన్ని అంతమొందిన భాషగాపరిగణించే ప్రమాదముంద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. యూరోపియన్ దేశాల్లో ‘సంస్కృత భాషలో, ఉన్న జ్ఞానం గురించి పరిశోధనలు జరుగుతుంటే, మన దేశంలో దానిని మృతభాషగా నిర్ధారిస్తే, అంత కంటే సిగ్గుచేటు మరొకటి ఉండద‌న్నారు. కాబట్టి, జనాభా లెక్కల అధికారి వచ్చినప్పుడు, కేవలం మీకు ‘సంస్కృతం’ తెలుసునని చెప్తే సరిపోతుంది అని కమలానంద భారతి స్వామి స్పష్టం చేశారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ హిందూ మత పరిరక్షణకు ఎంతోగానో దోహ‌దప‌డిన వార‌మ‌వుతామ‌న్నారు.