Home News అంబేద్కర్ మార్గం అనుసరణీయం…తద్వార సామాజిక సమరసత సాధ్యం.

అంబేద్కర్ మార్గం అనుసరణీయం…తద్వార సామాజిక సమరసత సాధ్యం.

0
SHARE

సామాజిక సమరత వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో భారతరత్న డాక్టర్ భీంరావ్ రామ్ జీ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు.ఖమ్మం,జహీరాబాద్ లో జరిగిన అంబేద్కర్ జయంతిలో సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని కుల అంతరాలను వదిలి సమతా భావనతో కలిసి మెలిసి జీవించినపుడే సామాజిక సమరసత సాధ్యమవుతుందని,అంబేద్కర్ అందరివారని అన్నారు.
జిల్లాల్లో అంబేద్కర్ జయంతి వివరాలు.

జహీరాబాద్ లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో 15-4-2019 వ తేదీన నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో నాలుగు మండలాల నుండి 40 గ్రామాలకు చెందిన 400 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బర్డీపూర్ శ్రీ సిద్దెశ్వర స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వంశతిలక్ గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు,రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు,ఎస్సీ సంఘం రాష్ట్ర నాయకులు వరప్రసాద్ గారు,జాతీయ ఎస్ సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు కర్నే శ్రీశైలం గారు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలోని కొత్తూరు,ధంసలాపురం గ్రామాల్లో జరిగిన అంబేద్కర్ జయంతిలో కుటుంబసమేతంగా వివిధ కులాలకు చెందిన 350 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ వక్తగా పాల్గొన్నారు.వేదిక రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి గారు,జిల్లా బాద్యులు రాజారావ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

మెదక్ జిల్లాలో 14-4-2019 వ తేదీన గాంధీనగర్,మెదక్,రాజ్ పేట్,రామాయంపేట్ లలో జరిగిన అంబేద్కర్ జయంతిలో వివిధ కులాలకు చెందిన 72 మంది పాల్గొన్నారు.సమరసత వేదిక విభాగ్ కన్వీనర్ మత్స్యేంద్రనాథ్,జిల్లా కార్యదర్శి ధన్ రాజ్,భైరం నర్సింలు,మండల అధ్యక్షులు మధుమోహన్, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

భాగ్యనగర్ లో సమరసత వేదిక బాద్యులు దామోదర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి జరిగింది.30 మంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి సమర్పించారు.మొత్తము 852 మంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here