Home Telugu Articles అమెరికా అవగాహన రాహిత్యానికి నిదర్శనం, విశ్వహిందూ పరిషత్, ఉగ్రవాద సంస్థలంటూ దుష్ప్రచారం

అమెరికా అవగాహన రాహిత్యానికి నిదర్శనం, విశ్వహిందూ పరిషత్, ఉగ్రవాద సంస్థలంటూ దుష్ప్రచారం

0
SHARE

విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ సంస్థలను తీవ్రవాద సంస్థలుగా పేర్కొంటూ రెండు రోజుల క్రితం అమెరికా గూఢచారి సంస్థ రహస్య నివేదిక  సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సి.ఐ.ఏ) వరల్డ్ ఫ్యాక్టుక్ తాజా సంచికలో పేర్కొనడం వారి యొక్క అవగాహనారాహిత్యం మాత్రమే కాక, పక్షపాత ధోరణితో దుష్ప్రచారం చేస్తున్నారనిపిస్తున్నది. 50 లక్షల మంది కఠోర పరిశ్రమ చేయగలిగిన సభ్యులు కలిగిన శక్తివంతమైన యువకుల సంస్థ బజరంగదళ్ ను కలుపుకుని సుమారు కోటి మందికిపైగా సభ్యులు కలిగిన విశ్వహిందూ పరిషత్, భుధ్యూసుల, బ్రహ్మ చారుల సారధ్యంలో ఇప్పటికే సేవ, సురక్ష,  వంటి ధ్యేయాలను ముందుంచుకుంది.

దేశంలోని వందకోట్ల మంది, మరియు ఇతర దేశాలలో జీవిస్తున్న సుమారు 25 కోట్ల మంది మనదేశ మూలాలున్న,  సమాజములో అంతర్భాగమైన బౌద్ధ,  సిక్కు, మొదలుగా గల హిందూ సమాజములోని వివిధ ఆరాధనా పద్దతులు అవలంభిస్తున్న వారందరినీ,     మాధ్యమంగా ఏకం చేస్తూ… ఏకోన్ముఖంగా పనిచేసేలా ప్రోత్సహిస్తూ,  పరిషత్  ప్రపంచంలోని హిందువులందరికీ  ఒక వేదికగా  పనిచేస్తోంది.- ఇప్పటికి 54 సంవత్సరాల క్రితం ముంబైలోని సాందీపని ఆశ్రమంలో స్వామి చిన్మయానంద గారి అధ్యక్షతన విశ్వహిందూ పరిషత్ ప్రారంభించబడింది.

స్వయంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలకులు  పూజనీయ  మాధవ సదాశివ గోల్వల్కర్    విశేష కృషి కారణంగా  ఆనాటి  అగ్రగణ్యులైన  జైనముని సుశీల్,  సాంప్రదాయ పెద్దలు మాస్టర్ తారా సింగ్, బౌద్ధలామాలు, దేశంలోని నాలుగు శంకర పీఠాలకు  పీఠాధిపతులైన  శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, ఇలా దేశంలోని  ఆధ్యాత్మిక గురువులు అందరిని  ఆహ్వానించి, స్వయంగా వారందరినీ కలిపి  విశ్వహిందూ పరిషత్  పేరుతో  ప్రపంచ హిందువులందరికీ ఒక వేదికగా… దేశం కోసం,  సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసిన  సన్యాసులు  నేతృత్వం వహించి ప్రారంభించారు.  నాటి నుంచి  ప్రజలు ఏకమై  దేశాన్ని,  ధర్మాన్ని  కాపాడుకోవాలని  పిలుపునిస్తూ వస్తోంది.

పరిషత్ 1966లో ప్రయాగ రాజ్ లో,  1968లో కర్ణాటక ఉడిపి లో, దేశంలోని, మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడిన హిందువుల అందరిని ఏకం చేయడానికి ప్రపంచ హిందూ సమ్మేళనం పేరిట,  రోజులలోనే 25 వేల మందికి పైగా 50 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి సభలు నిర్వహించారు.  సభలలోనే వేల సంవత్సరాలుగా మత దాష్టీకానికి గురైన భారత ప్రజలను ఉద్దేశించి అనేక సంస్కరణలు చేపట్టాలని తీర్మానాలు చేశారు.  మార్పిడి లను వ్యతిరేకించాలన్నారు,  కాపాడుకోవాలని పిలుపునిచ్చారు, కుల భేదాలు మరచి హిందువులుగా సామరస్యతతో మెలగాలన్నారు.  దానిలో భాగంగానే…

 ||హైందవాః సోదరా స్సర్వే, న హిందూ పతితో భవేత్ ||
– హిందువులందరూ సమానమే,  ఏ హిందువు పతితుడు కాడు,
||మమ దీక్షా హిందూ రక్ష, మమ మంత్రం సమానత ||

-నా దీక్ష  హిందూ సమాజం యొక్క రక్షణ.  నా  మంత్రము  సమానత సాధించడం. అంటూ  దేశంలోని అంటరానితనంపై  యుద్ధం ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన  దేశవ్యాప్తంగా  స్వామీజీలు పర్యటనలు జరిపారు. ఏకత్వాన్ని ప్రభోదించారు. సామరస్యత ను సాధించాలని ప్రజలకు  బోధనలు చేశారు, దాని కారణంగా  దేశంలో చాలా  ప్రభావమే  కనబడింది,కనబడుతున్నది. ప్రజల మధ్య ఐక్యతను సాధించడానికి 1980 దశకంలో ఏకాత్మతా యజ్ఞము పేరుతో 12 కోట్ల మంది ప్రజలను కలిపి మేమంతా భారతమాత సంతానము.మేమంతా భారతీయులం…   థూరాధనా పద్ధతులు,  వేరైనా అందరం ఒక్కటే అనే భావాన్ని ప్రజల యొక్క మనసులలో పాదుకొల్పటానికి విశ్వహిందూ పరిషత్ గంగాజలాన్ని, భారతమాత విగ్రహాలతో దేశం నలుమూలల రథయాత్రలను నిర్వహించి ఏకాత్మతా భావాలను ప్రజలలో నింపింది.

సంస్థాగతంగా….

-ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాలలోనూ, మన దేశంలోని 42 ప్రాంతాలలో నూ సంస్థాగతంగా  1033 జిల్లా లలో విస్తరించి, 75 వేల సమితిలు ఏర్పాటు చేసి, ఇరవై ఒక్క వేల స్థలాలలో సత్సంగ్ నిర్వహిస్తూ సంస్కారాన్ని ప్రభోదిస్తూ -52,465 మంది సంయోజకులు 35లక్షల కు పైగా సదస్యులు గా కలిగిన సంస్థ బజరంగదళ్.-  వేలకు పైగా మహిళ సంయోజకులు ఐదు లక్షలకు పైగా మహిళా సభ్యులు,- దేశంలో 65 వేలకు పైగా ఏకల్ పాఠశాలలు నిర్వహిస్తూ, ఇప్పటికే మారుమూల గ్రామాలలో ఇరవై ఐదు లక్షలకు పైగా విద్యార్థులుకు విద్యాబుద్ధులు నేర్పిన చరిత్ర విశ్వహిందూపరిషత్ ది.పేద విద్యార్థులకు వందల సంఖ్యలో ఆవాస విద్యాలయాలు, అనాధ శరణాలయాలు,  మందిరాలు, 352 కేంద్రాల్లో గో ఆధారిత వస్తువుల తయారీ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నది.- 186 చికిత్సా కేంద్రాలు 8వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ఉచిత వైద్యం అందిస్తున్నారు.

-రెండు వేల మంది కథా కారులు పూరి గుడిసెల మధ్యన మారుమూల గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలలో సంస్కారాన్ని ప్రభోదిస్తున్నారు.  కష్టాలు వచ్చినా, కరువొచ్చిన,  పైకొచ్చినా… హాహాకారాలు చేస్తున్న జనులకు మేమున్నామంటూ ఆపన్న హస్తాన్ని అందించేది విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు.  సంవత్సరం రెండు లక్షలకు పైగా రక్తపు బాటిల్ లు రక్త దానం చేసి ఆపన్నులకు అందించేది బజరంగదళ్ కార్యకర్తలే. ఇంతెందుకు స్వయంగా అమెరికా లో హరికెన్ తుఫాన్ సంభవిస్తే ఆ దేశ అధ్యక్షుడు నేలమాళిగలో దాక్కొనప్పుడు విశ్వహిందూ పరిషత్, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ,  అమృతానందమయి స్వచ్ఛంద సంస్థలు, ఐదు వందల మంది డాక్టర్లు,  తోడు అమృతానందమయి అందించిన ‘అయిదు వందల కోట్ల రూపాయలు’ అమెరికాలో సేవ కోసం వినియోగించిన విషయం ఎంతమందికి తెలుసు…?  చేసి ప్రచారం చేసుకోవడం వీరికి తెలియదు.

–  స్వచ్ఛంద సేవలకుగాను విశ్వహిందూ పరిషత్ కార్యక్రమానికి  ఆదేశ ప్రధాని, అధ్యక్షులు అధ్యక్షత వహించారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు…? -ఫిజీలో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి సేవలందించిన వాళ్ళు ఎవరు…? ఆ దేశ అధ్యక్షుడు మహేంద్ర కు సహకరించింది విశ్వహిందూ పరిషత్ కాదా…! హిందుత్వం అనగానే మతం అంటూ బురదచల్లే రాతగాల్లారా, హిందుత్వం అంటే జీవన విధానం అని సుప్రీంకోర్టు నిర్వహించ లేదా…! ఇది తెలిసినప్పటికీ ఏదో రకంగా ఈ మట్టి బిడ్డలను బానిసలుగా మార్చుకోవాలనే తమ కుచ్చితపు ఆలోచనలకు దూరం కాలేక పోతున్నారు…! వీరి అక్కసు కారణంగానే విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ దుష్ప్రచారం కావించబడుతోంది.

స్వాభిమానపు స్రోతస్సు

-ఆక్రమణ కారులైన బాబర్ మొగలాయి తదితర ఇస్లాం వంశములు మాత్రమే కాక,  వేల కిలోమీటర్ల దూరం నుండి మన దేశం పైకి వచ్చి,  మూడు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసి పాలించిన ఆంగ్లేయుల పాలన వంటి దుర్మార్గపు పాలన మళ్లీ మన దేశానికి దాపురించ కూడదు అనీ…- చైనా యుద్ధఓటమి తర్వాత  మనదేశ పౌరులైన  వారిలో  జాతీయ భావాన్ని, స్వతంత్ర భావాన్ని, సంఘటితమై  పోరాడే తత్వాన్ని  అలవరుచుటకు గాను, ఈ దేశపు చక్రవర్తి  శ్రీరామచంద్రుని  జన్మస్థానము  విముక్తి కొరకు పోరాటం చేయగల ప్రవృత్తిని పెంచడానికి 25 సంవత్సరాల శాంతియుత పోరాటం… రెండవ స్వతంత్ర పోరాటం మాదిరిగా, రామజన్మభూమి ఉద్యమము నిర్వహించింది.

దేశ ‘క్విట్ ఇండియా ‘స్వాతంత్ర పోరాటంలో జైలుపాలయిన వారు 65వేల మంది అయితే స్వాభిమానం కోసం జరిగిన రామజన్మభూమి సత్యాగ్రహంలో ‘లక్షా 25వేల మంది‘ పాల్గొని జైలుకెళ్లారు. నెలల తరబడి  జైళ్లలో మగ్గారు.  ఇది కాదా స్వాభిమాన సంకేతం. రామజన్మభూమి ఉద్యమం తర్వాతనే దేశంలో జాతీయ భావాల విస్తరణ జరిగింది. మేధావులు, విజ్ఞానవేత్తలు, శాస్త్రజ్ఞులు,   పూనుకొని  దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుటకు  ప్రయత్నించడం  ప్రారంభమైంది.  దేశ పురోగతి  ఆరంభమైంది, ఆర్థిక పరిస్థితి గాడిన పడింది. మనదేశ ప్రధాన మంత్రులకు, మనదేశ పౌరులకు ప్రపంచంలో ఒక గుర్తింపు రావడం ప్రారంభమైంది.

అవధులు దాటిన దుష్ప్రచారం

-స్వాతంత్ర పోరాటంలో హిందువుల నాయకుడు తిలక్ మహాశయుడు అని,మహాత్మాగాంధీ కూడా హిందూ నాయకులు అంటూ, భుళూటి జాతీయ కాంగ్రెస్ ను హిందూ సంస్థ అంటూ… ముక్ష్నూ వంటివారు ప్రకటించినది మనకు తెలుసు. నాటి తిలక్ తర్వాతి కాంగ్రెసు ను హిందూ సంస్థగానే ఆంగ్ల ప్రభుత్వం పేర్కొంటూ ఉండేది.- భగత్ సింగ్ ,సుభాష్ చంద్రబోస్,  మహాశయుని వంటి వారిని చివరికి బంకించంద్ర చటర్జీ,  లజపతిరాయ్,  సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్ లను హిందూ తీవ్రవాదులు గానే ముద్ర వేసిన విషయం మనకు తెలిసిందే.  వీరందరూ తీవ్రవాదులు అయితే బజరంగదళ్ కార్యకర్తలు కూడా తీవ్రవాదులే.-  చిన్మయానంద, నలుగురు శంకరాచార్యుల వంటి త్యాగమయులు ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్ ను కూడా తీవ్రవాద సంస్థగానే భావించాలి.  ఇన్నాళ్ల తర్వాత విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ లను హిందూ సంస్థలుగా పేర్కొంటూ తీవ్రవాదులుగా పేర్కొంటూ ప్రచారం చేయడం ప్రారంభమైంది.

దీని వెనుక దేశ వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తూ, స్వచ్ఛంద సంస్థల పేరుతో  అనైతిక కార్యక్రమాలను చేస్తున్న సంస్థల గుర్తించి, వారి నాయకత్వం వారికి అందిస్తున్న ‘ధనధార’ కు అడ్డుకట్ట వేయాలని  కోరిన పిమ్మట …. లెక్కలు చూపని 20వేల  స్వచ్ఛంద సంస్థల  అకౌంట్లను గుర్తింపు లను రద్దు చేసిన తర్వాత, ఆర్థిక ఇక్కట్లతో అసహనానికి గురైన కొన్ని సంస్థలు తమ మాతృ సంస్థలను కలుపుకుని విదేశాలలో కుట్రలు పన్ని,  మట్టి బిడ్డలైన వారి సంక్షేమం కోసం విదేశాల నుండి డబ్బులు ఆశించకుండా, స్వదేశంలోనే స్వాభిమానులను తయారుచేసి,  కార్యక్రమాలను నిర్వహిస్తున్న విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ సంస్థలను బూచిగా చూపిస్తూ తమ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం లో భాగమే ఈ దుష్ప్రచారాలు.

 ఆకారపు కేశవరాజు

(విజయక్రాంతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here