Home News అఖిలభారతీయ ప్రతినిధి సభలో సమర్పించిన వార్షిక నివేదిక

అఖిలభారతీయ ప్రతినిధి సభలో సమర్పించిన వార్షిక నివేదిక

0
SHARE
File photo - Bhaiyyaji Joshi

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ్ శ్రీ సురేశ్ (భయ్యాజీ) జోషి నాగపూర్ అఖిలభారతీయ ప్రతినిధి సభలో సమర్పించిన వార్షిక నివేదిక ఆధారంగా రూపొందించిన పత్రికా ప్రకటన

 శ్రద్ధాంజలి

మన తోటి కార్యకర్తలను, స్నేహితులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కోల్పోవడం బాధను కలిగిస్తుంది. కానీ కాలగతిలో అటువంటి మహానుభావులు మనను వదలి పరమపదాన్ని చేరుకున్నారు.

అలాగే దేశ రక్షణ కార్యంలో, తీవ్రవాదులతో పోరాడుతూ చాలామంది సాహసవంతులు, వీరులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. కానీ దురదృష్టవశాత్తు మన సోదరులు కొందరు రాజకీయ హింసకు బలికావడం విచారించదగిన విషయం. అలాగే కొందరు ప్రకృతివైపరీత్యాలు, ప్రమాదాల మూలంగా ప్రాణాలు కోల్పోయారు. అలా స్వర్గస్తులైన వారందరికి అఖిలభారతీయ ప్రతినిధి సభ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిస్తోంది.

కార్యస్థితి

సంఘ శిక్షవర్గ

సం.       స్థలాలు      పాల్గొన్నవారు   విశేష        స్థలాలు           పాల్గొన్నవారు

ప్రథమ   9734      15716           ప్రథమ     2146             3012

ద్వితీయ 2959      3796            –                  –                  –

తృతీయ  834     899           తృతీయ          697              716

శాఖల వివరాలు

  సం.               ప్రదేశాలు          శాఖలు           మిలన్            మండలి

 2017             36729          57165         14986           7594

 2018             37190         58967          16405           7976

 తెలంగాణాలో శాఖలు

గత 8 సంవత్సరాలలో తెలంగాణాలో శాఖలు 1000కి పైగా పెరిగాయి. ప్రస్తుతం 1608 ప్రదేశాలలో 2412 శాఖలు జరుగుతున్నాయి. అదే 2017లో 1495 ప్రదేశాలలో 2302 శాఖలు ఉండేవి.

సర్ సంఘచాలక్ జీ పర్యటన

పరమ పూజనీయ సర్ సంఘచాలక్ జీ కార్యకర్తలతో సమావేశాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిశారు. అలాగే వివిధ ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ప.పూ.సర్ సంఘచాలక్ జీ రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి స్మరణానంద్ జీ, బోరా సమూహానికి చెందిన స్వేదన సాహెబ్, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ జీ, హాన్స్ ఫౌండేషన్ కు చెందిన పూజ్య భోలే జీ మహారాజ్, పూజ్య మంగళ మతాజీ, మహామహీమ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ జీ మొదలైనవారిని కలిశారు.

అలాగే ప్రముఖ సంగీతవిద్వాంసుడు పద్మశ్రీ రషీద్ ఖాన్, ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగన్, మాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు కళ్యాణ్ చౌబే , జి ఏం ఆర్ గ్రూపు సంస్థల అధినేత జి ఏం రావ్ లతో కూడా సమావేశమయ్యారు.

ప్రచార విభాగం

ప్రతి సంవత్సరం మాదిరిగానే 2017లో కూడా వివిధ ప్రాంతాలలో `నారద జయంతి’ కార్యక్రమాలు జరిగాయి. వీటిలో మొత్తం 40,000 మంది పాల్గొన్నారు. వారిలో 10,000 మంది జర్నలిస్ట్ లు. పత్రికా రంగంలో విశేష సేవలను అందించిన 1300 మందిని సన్మానించడం జరిగింది.

– వెబ్ సైట్ ద్వారా జాయిన్ ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నం. ప్రజానీకం సంఘ కార్యంలో తమంత తాము భాగస్వాములు కావడానికి వీలుగా www.rss.org వెబ్ సైట్ లో కొన్ని ప్రత్యేక అంశాలు జోడించారు. గత సంవత్సరం దీని ద్వారా 1.25 లక్షల మంది సంఘలో చేరడానికి తమ ఆసక్తిని తెలియజేశారు.

– జాగరణ పత్రిక మారుమూల గ్రామాలకు కూడా వెళుతోంది. 12 భాషలలొ అలాంటి 30 పత్రికలు(తెలుగులో లోకహితం) 2 లక్షలకంటే ఎక్కువ గ్రామాలకు చేరుతున్నాయి.

– జర్నలిస్ట్ లకు ఆర్ ఎస్ ఎస్ ను పరిచయం చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశాలలో 7 ప్రాంతాల నుండి 541 మంది పాల్గొన్నారు.

– మొట్టమొదటసారిగా విజయదశమి సందర్భంగా సర్ సంఘచాలక్ జీ ఉపన్యాసాన్ని www.facebook.com/RssOrg అనే ఫేస్ బుక్ పేజ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. దీనిని 19 లక్షలకు పైగా వీక్షకులు చూశారు.

సంపర్క విభాగం – గత రెండు సంవత్సరాలుగా దేశంలోని కొన్ని ప్రముఖ కేంద్రాలలో ప.పూ. సర్ సంఘచాలక్ జీ విజయదశమి ఉపన్యాసం గురించి సమాజంలోని ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈసారి కూడా 18 ప్రదేశాలలో జరిగిన కార్యకారమాలలో 1007మంది ప్రముఖులు పాల్గొని ఉపన్యాసంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. డిల్లీలో జరిగిన ఇలాంటి కార్యక్రమంలో ప.పూ. సర్ సంఘచాలక్ స్వయంగా పాల్గొన్నారు. ఇతర ప్రదేశాలలో అఖిలభారతీయ అధికారులు పాల్గొన్నారు.

సమరసత – తెలంగాణ ప్రాంతంలో స్వయంసేవకులు, సాధుసంతుల సహాయ సహకారాలతో, ఎంపిక చేసుకున్న కొన్ని గ్రామాలలో సామాజిక సమరసతను తెచ్చేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం వల్ల 200 గ్రామాల్లో ఒకే స్మశానం వాడకం, అందరికీ దేవాలయ ప్రవేశం, హోటళ్లలో అందరూ ఉపయోగించడానికి ఒకే రకం గ్లాసులు వంటివి సాధ్యమయ్యాయి.

ప్రత్యేక కార్యక్రమాలు

తెలంగాణ : విజయదశమి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రయత్నం – ప్రతి సంవత్సరం భాగ్యనగర్ మహానగర్ లో జిల్లా వారీగా పథసంచలన్ (రూట్ మార్చ్) కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఈసారి రెండు విభాగ్ లు కలిపి 10 జిల్లాల స్వయంసేవకులతో ఒకే కార్యక్రమం జరిగింది. ఈ పెద్ద కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి బస్తీలో సంఘ కార్యాన్ని పరిచయం చేయడానికి ప్రత్యేక ప్రయత్నం జరిగింది. ఆయా బస్తీలలో స్వయంసేవకుల జాబితాను తయారుచేయడం, ప్రతి ఇంటికి ఆహ్వానాన్ని అందించడం వంటి విశేష ప్రయత్నం చేశారు.

 ప్రతి బస్తీ నుండి కనీసం 10మంది పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహానగరంలోని మొత్తం 765 బస్తీలలో 626(82%) బస్తీలనుంచి 11,000 మంది స్వయంసేవకులు విజయదశమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో 7397 మంది పూర్తి గణవేష్ (యూనిఫాం)లో పాల్గొన్నారు. అలాగే కార్యక్రమాన్ని తిలకించడానికి 900 మంది మహిళలు కూడా వచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్ : కళాశాల విద్యార్థుల కార్యక్రమాలు – ఈ సంవత్సరం ప్రతి విభాగ్ లో కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. అలా జరిగిన 11 శిబిరాలలో మొత్తం 4,641మంది విద్యార్థులు 585 కళాశాలల నుండి పాల్గొన్నారు. వీరంతా పూర్తి గణవేష్ (యూనిఫాం)లో పాల్గొన్నారు. వీరిలో 48మంది అల్పకాలీన విస్తారక్ (పూర్తిసమయ కార్యకర్తలు) గా పనిచేయడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రయత్నం మూలంగా శాఖల సంఖ్య 98 నుండి 139కి, మిలాన్ ల సంఖ్య 33 నుండి 136కు పెరిగింది. అలాగే నెలకి ఒకసారి జరిగే సమావేశాలు కొత్తగా 111 ప్రదేశాలలో ప్రారంభమయ్యాయి. ప్రాథమిక శిక్షవర్గలో 808 కళాశాలలు, 68 వృత్తివిద్య సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

మీరట్ : `రాష్ట్రొదయ స్వయంసేవక్ సంగమం’ అద్భుతంగా జరిగింది. అన్ని మండలాలు(987), అన్ని బస్తీల(1553) నుండి వచ్చిన  1,45,322 మంది స్వయంసేవకులు ఈ బృహత్ సభలో పాల్గొన్నారు. వీరిలో 1,01,712 మంది యువకులు (40 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ) ఉన్నారు. అన్నీ మండలాలో సంఘ కార్యాన్ని విస్తరింపచేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. అందుకు కొన్ని సంవత్సరాలుగా పని జరిగింది. ఆ పని ఫలితంగానే కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వయంసేవకుల కోసం 3జిల్లాలకు చెందిన  3 లక్షల ఇళ్ల నుండి 6 లక్షల ఆహార పొట్లాలు సేకరించడం జరిగింది.

ఉత్తర అస్సాం: లుతిపరియ హిందూ సమావేశం – జనవరి 21, 2018 గౌహతీలో ఉత్తర అస్సాంకు చెందిన స్వయంసేవకుల భారీ సమ్మేళనం జరిగింది. ఇందులో 239 బ్లాక్ (96%), 46 నగర్ లు, 1511 కేంద్రాలు (70%), 90% నగర బస్తీలకు చెందిన మొత్తం 31,351మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. అంతేకాదు ఈ సమ్మేళనంలో 35,000 మంది సాధారణ ప్రజానీకం కూడా పాల్గొన్నారు.

ఢిల్లీ : కార్య విస్తరణ: ఢిల్లీ ప్రాంతంలో ప్రత్యేక కార్య విస్తరణ ప్రయత్నం వల్ల 508 (28.5% పెంపు) కొత్త శాఖలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతి శాఖ వార్షికోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. 92శాతం శాఖల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు (శాఖలో నేర్చుకునే విషయాల ప్రదర్శన) జరిగాయి.

హరియాణ: సమగ్ర గ్రామీణాభివృద్ధి పధకంలో భాగంగా `సేంద్రీయ వ్యవసాయం’ పై ఒక కార్యశాల (వర్క్ షాప్) జరిగింది. ఇందులో 1,200 మంది రైతులు పాల్గొన్నారు.

దక్షిణ బంగ: స్వామి వివేకానంద చరిత్రాత్మక చికాగో ఉపన్యాసానికి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ మాసంలో ప్రాంతం మొత్తంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా 85 లక్షల పుస్తకాలు, 13 లక్షల స్టిక్కర్ ల పంపిణీ జరిగింది. సైకిల్ ర్యాలీ లో 30,000 మంది, బైక్ ర్యాలీలో 4,33,000 మంది యువకులు పాల్గొన్నారు. బహిరంగ సభలకు మొత్తం 1.75 లక్షల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమాల ద్వారా 382 బ్లాక్ లు, 1805 సర్కిల్ లకు చెందిన 4 లక్షల కుటుంబాలకు స్వామీజీ సందేశాన్ని చేర్చడం జరిగింది.

దేశ పరిస్థితి

సంఘ కార్యం పట్ల ప్రజానీకంలో పెరుగుతున్న విశ్వాసంతో పాటు సంఘం నుండి వారు ఆశించే విషయాలు కూడా పెరుగుతున్నాయని గుర్తించాము. వివిధ ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలలో హిందూ సమాజం మొత్తం నుండి పెద్ద సంఖ్యలో ప్రజానీకం హాజరుకావడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా త్రిపురలో, జరిగిన హిందూ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగించాయి. సామాజిక, మత, పారిశ్రామిక మొదలైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రశంసలు సంఘ కార్యానికి లభిస్తున్న సర్వసమ్మతిని తెలియజేస్తున్నాయి.

మరోవైపు సమాజంలో కనిపిస్తున్న  అంతర్గత విభేదాలు, కలతలు ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశపు న్యాయ, రక్షణ వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం, గౌరవాలకు భంగం వాటిల్లకూడదని భావిస్తున్నాము. రాజ్యాంగబద్దంగా, న్యాయవ్యవస్థకు లోబడి ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చును. కానీ వీటిని అతిక్రమించకుండా ఉండడం చాలా అవసరం.

మరిన్ని వివరాలకు –
వెబ్ సైట్ :  www.rss.org
ట్విట్టర్:  @RssOrg
ఫేస్ బుక్:  @RssOrg
మెయిల్ : contactus@rss.org