Home News బెంగళూరులో జర్నలిస్టుపై దాడి: నిందితులపై చర్యకు హిందువుల డిమాండ్

బెంగళూరులో జర్నలిస్టుపై దాడి: నిందితులపై చర్యకు హిందువుల డిమాండ్

0
SHARE

బెంగుళూరుకు చెందిన సంవాద ఛానెల్‌లో పనిచేస్తున్న జర్నలిస్టు టి తేజపై కొంత మంది వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు. దాడి పట్ల బెంగళూరులోని ఫ్రీడం పార్క్ వద్ద వందలాది హిందువులు నిరసన తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను వారు డిమాండ్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాఠ్యపుస్తకాల సవరణకు వ్యతిరేకంగా గ‌త‌ వారం ఫ్రీడం పార్క్ వ‌ద్ద ‘కన్నడ ఉద్యమకారులు’ గా చెప్పుకునే కొందరు వ్యక్తులు నిరసన కార్య‌క్ర‌మాన్ని చేపట్టారు. సంవాద క‌న్న‌డ ఛానెల్‌కు చెందిన తేజ ఆ వార్త‌ను రిపోర్టు చేశారు. ఆ స‌మ‌యంలో నిరసనలో పాల్గొన్న దుండగుల్లోని దీపు గౌడ, భైరప్ప హరీష్ కుమార్ అనే వ్యక్తులు తేజను లక్ష్యంగా చేసుకుని అతడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.

“పోలీసులు నన్ను సకాలంలో రక్షించకపోతే, వారి చేతిలో నేను చనిపోయి ఉండేవాడిని” అని తేజ మీడియాతో అన్నారు.

జ‌ర్న‌లిస్టుపై దాడిని ఖండిస్తూ కర్ణాటక హోమ్ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఒక ప్ర‌క‌ట‌న చేశారు. “ఫ్రీడం పార్క్ వద్ద నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టుపై అమానవీయ దాడి ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమైనది. ఈ విష‌యంపై పూర్తి విచార‌ణ చేప‌ట్టి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. ఘటనపై ఒక కేసు నమోదైంది. వీలైనంత త్వరగా దీనికి బాధ్యులైన వారిని గుర్తించి వారిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాను” అని హోమ్ మంత్రి సదరు ప్రకటనలో తెలిపారు.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (అఘాయిత్యాల నివారణ) చట్టం కింద పలు సెక్షన్లకు లోబడి నిందితులపై ఒక ప్రాథమిక సమాచార నివేదిక (FIR) ను పోలీసులు నమోదు చేశారు.