Home News పదవ తరగతి ప్రశ్నపత్రంలో పాకిస్థాన్ భాష – కాంగ్రెస్ నిర్వాకం

పదవ తరగతి ప్రశ్నపత్రంలో పాకిస్థాన్ భాష – కాంగ్రెస్ నిర్వాకం

0
SHARE

దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ దృష్టికోణం మరోమారు ప్రశ్నార్థకమైంది. ఎప్పట్లాగానే కాంగ్రెస్ తన దేశ భక్తిని తానే సందేహాస్పదం చేసుకుంది. శనివారం జరిగిన పదోతరగతి సోషల్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఆజాద్‌ కశ్మీర్‌ను(పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌) మ్యాపులో గుర్తించండంటూ, ఒక సమాధానంగా ”ఆజాద్‌ కశ్మీర్‌” అని ఇచ్చింది. దానిని భాజపా అధికారప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ ఫోటో తీసి సామాజికమాధ్యమాలలో షేర్‌ చేశాడు. ఈ విషయంపై భాజపానాయకులు అధికార కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రంలో ఆ విధంగా రావడంపై సీఎం కమల్‌నాధ్‌ అగ్రహం వ్యక్తంచేస్తూ బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. దీనికి బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసి, ప్రశ్నాపత్రంలో నుంచి ఆ రెండు ప్రశ్నలను కూడా తొలగించినట్టు అధికారులు తెలిపారు.

కాంగ్రెస్‌ నేతల నిజస్వరూపం బయటపడింది : భాజపా

ఈ సందర్భంగా రజనీష్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ ప్రాంతం సువిశాల భారతదేశంలో అంతర్భాగమన్నారు. కాంగ్రెస్‌ నేతల నిజస్వభావం బయటపడిందని, పాకిస్థాన్‌వారు పీఓకే ప్రాంతాన్ని అజాదీకశ్మీర్‌ అంటుంటారు. వారిలాగే వేర్పాటువాదంతో కాంగ్రెస్‌వాళ్లు ప్రశ్నాపత్రంలో కావాలనే ఇలాంటి ప్రశ్నలు అడిగారని దుయ్యబట్టారు.

అసలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? దేశద్రోహ శక్తులపై కాంగ్రెస్ ఉదాశీనత కారణంగానేనా? లేదా కాంగ్రెస్ సిద్ధాంతమే ఈ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదా? దేశ ప్రజలంతా ఈ అంశంపై దృష్టి సారించాలి.

vskandhra.org సౌజన్యంతో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here