Home News బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ – 2020

బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ – 2020

0
SHARE
File Photo

ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎ.బి.పి.ఎస్) మూడు రోజుల వార్షిక సమావేశాలు మార్చి 15 నుంచి మార్చి 17 వరకు బెంగళూరులో జరుగుతాయి .  

దేశంలోని వివిధ నగరాల్లో సంవత్సరానికి ఒకసారి జరిగే  ఎ.బి.పి.ఎస్ సమావేశంలో ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రాంతాలలో సంఘ కార్యవిస్తరణ, శాఖలను మెరుగుపరచడం, శిక్షణా శిబిరాలను పెంచడం వంటి విస్తరణ, దృఢీకరణ ప్రణాళిక, వివిధ ప్రాంతాల్లో చేపట్టిన విన్నూత కార్యక్రమాలు, అనుభవాలు మొదలైన విషయాలను ఇందులో చర్చిస్తారు.  

దేశవ్యాప్తంగా 1400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనే ఈ మూడు రోజుల సమావేశంలో ముఖ్యమైన అంశాలపై తీర్మానాలను కూడా ఆమోదిస్తారు. వివిధ సంస్థల ద్వారా వేరువేరు ప్రాంతాలలో పనిచేస్తున్న స్వయంసేవకులు తమ అనుభవాలతో పాటు జాతీయ ప్రాముఖ్యం గల వివిధ సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్ర సేవికా సమితికి చెందిన మహిళా ప్రతినిధులు కూడా ఈ ఎ.బి.పి.ఎస్‌ లో పాల్గొంటున్నారు.

ఆర్ ఎస్ ఎస్  సర్ కార్యవాహ్ శ్రీ భయ్యా జి జోషి ఈ సమావేశాలను నిర్వహిస్తారు. ఇందులో సర్ సంఘ్ చాలక్ పూజనీయ శ్రీ మోహన్ జీ భాగవత్ కూడా ఉంటారు. సమావేశాలు ముగిసిన అనంతరం ఇక్కడ ఆమోదించిన తీర్మానాలను మీడియాకు వివరిస్తారు.

– అరుణ్ కుమార్
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here