Home News భాగ్యనగర్ : రాష్ట్ర సేవికా సమితి విజయదశమి ఉత్సవం

భాగ్యనగర్ : రాష్ట్ర సేవికా సమితి విజయదశమి ఉత్సవం

0
SHARE

“సాంస్కృతిక ఏకాత్మతను ప్రదర్శించేవి దసరా ఉత్సవాలు, ఇలాంటి ఉత్సవాలు సామాజిక సంతులనం కలిగి ఉంటాయి. ధర్మం కేవలం కాపాడుకుంటే నిలబడదు, ఆచరిస్తే నిలబడుతుంది” అని రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ కార్యవాహిక మాననీయ అన్నదానం సీతా గాయత్రీ గారు అన్నారు. రాష్ట్ర సేవికా సమితి ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ లో జరిగిన విజయదశమి ఉత్సవంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సీతా గాయత్రీ గారు మాట్లాడుతూ భారతీయ మహిళ మన సంస్కృతికి అయివుపట్టు అని, ‘తల్లి ఒడి తొలి బడి’ అని, అనాది నుండి మన తల్లులు ఈ ఆచారాన్ని కాపాడుతున్నార‌ని అన్నారు. వీటి కేంద్రంగానే మన మాతృశక్తి పరంపర కొనసాగించాలనే లక్ష్యంతో వందనీయ మౌసీ జీ. 1936 సం. లో రాష్ట్ర సేవికా సమితిని ప్రారంభించార‌ని తెలిపారు.

గత 86 సం|| గా నిరంతరం సాగుతున్న ప్రయత్నం సమాజంలో దుష్ట శక్తి పోగొట్టేందుకు సేవికా స‌మితి కృషి చేస్తోందని, సమితి నిర్వహించే శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణము జరుగుతోంద‌న్నారు. ఈ మధ్య కాలంలో మన సంస్కృతి పై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, ఇటీవలే చీర కట్టడంపై ఢిల్లిలో జరిగిన ఘ‌ట‌నను ఈ సంద‌ర్భంగా ఉదహరించారు. మన సంస్కృతి పై జరిగే దాడులను, దురాచారాలను దూరం చేసేందుకు రాష్ట్ర సేవికా స‌మితి పని చేస్తోంద‌న్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరక్టర్ అఫ్ ఆడిట్ రైల్వేస్(దక్షిణ మధ్య రైల్వే) వై.దివ్యా గారు మాట్లాడుతూ సేవికా సమితి మాతృమూర్తులు చేస్తున్న‌టువంటి కృషి మహిళా సాధికారతకు ఉపయోగపడుతుంది అని అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ లోని బండి గార్డెన్స్ లో జరిగిన ఈ విజయదశమి ఉత్సవానికి సుమారు 600 మంది సేవికలు పాల్గొన్నారు.