Home News ‘బలరామ జయంతి – రైతు దినోత్సవం’ సందర్బంగా రైతులను సన్మానించిన భారతీయ కిసాన్ సంఘ్-తెలంగాణ

‘బలరామ జయంతి – రైతు దినోత్సవం’ సందర్బంగా రైతులను సన్మానించిన భారతీయ కిసాన్ సంఘ్-తెలంగాణ

0
SHARE

“భారతీయ వ్యవసాయ క్షేత్రమే ప్రపంచానికి విజ్ఞ్యానం అందించినది. ప్రజలలో, రైతులలో చైతన్యం లేనిదే ఏ ప్రభుత్వం కూడా సమర్ధవంతంగా పనిచేయలేదు. కనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో రైతు సంక్షేమం గురుంచి, వారు ఆర్థిక ఆభివృద్ధి సాధించటానికి తోడ్పాటు అందించాలని దానికి భారతీయ కిసాన్ సంఘ్ చేస్తున్న కృషికి అందరు సహకరించాలి” అని ఆర్ఎస్ఎస్ తెలంగాణా కార్యవాహ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు “బలరామ జయంతి –రైతు దినోత్సవం” సందర్బంగా ఆకాక్షించారు.

భారతీయ కిసాన్ సంఘ్-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పర్యాద అంజిరెడ్డి గారి అధ్వర్యంలో 27-08-17 (ఆదివారం) నాడు హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హై స్కూల్ ప్రాంగణంలో “బలరామ జయంతి –రైతు దినోత్సవం” నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిదిగా పాల్గొన్న కేంద్ర కార్మిక శాఖామాత్యులు గౌ. శ్రీ. బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ రైతు సంక్షేమం గురుంచి ఎన్.డి.ఏ ప్రభుత్వం చేపట్టిన ‘పంటల భీమ’, ఎరువుల ధరలు తగ్గించడం, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం, మార్కెట్ వ్యవస్థలో మార్పులు, రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పార్టీలు వేరైనా రైతులంత ఒక్కటే అని విశ్వసించే  భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ను అభినందించారు.

శ్రీ హెచ్. శ్రీనివాసులు, విశ్రాంత ఐ.ఆర్.ఎస్, టి.ఎస్.ఆర్.సి మెంబెర్ అఫ్ ఫైనాన్సు, గారు మాట్లాడుతూ రైతులు వివిధ పంటల ద్వార ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. విద్యుత్ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో వివరిస్తూ, ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన  రైతుల నష్ట పరిహారం, దానికి సంబంధించి సలహాలు సూచనలు చేసారు.

బికేఎస్ జాతీయ కార్యదర్శి కే. సాయి రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్తాయిలో జరిగే అనేక కార్యక్రమాల గురుంచి మాట్లాడారు. రైతులు లాభసాటి ధరలను సాదించటానికి శాస్త్రవేత్తలతో మమేకమై  అధిక దిగుబడులు సాదించే ప్రక్రియల పట్ల ద్రుష్టి పెట్టాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ రైతులుగా ఎంపిక అయినవారిని ఈ సందర్బంగా బికేఎస్ వారు సన్మానించారు. పాల ఉత్పత్తి లో శ్రీ కే. వెంకట్ రెడ్డి –ధర్మరేడ్డిగుడెం, యదాద్రి జిల్లా, కూరగాయలు: శ్రీ దాసరి అంగం రెడ్డి, బాబా గూడా –మేడ్చెల్ జిల్లా; పూలు: శ్రీ కళ్ళెం మోహన్ రెడ్డి, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా; పత్తి: శ్రీ పి రాంరెడ్డి , ఆదిలాబాద్ జిల్లా; మిర్చి: శ్రీ పాతూరి రవీందర్, భూపాలపల్లి జిల్లా. వ్యవసాయ రంగానికి పాత్రికేయ వృత్తిలో సేవలు అందిస్తున్న శ్రీ రాంబాబు (సాక్షి), శ్రీ సిద్ది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి( జై కిసాన్), స్వచ్చంద సంస్తలు తరుపున గ్రామ భారతి- సూదిని స్తంబాద్రి రెడ్డి, సుస్థిర వ్యవసాయకేంద్రం  -శ్రీ   జి. వి రామంజనేయులు.

ఈ కార్యక్రమంలో బికేఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, మల్ల రెడ్డి, సురేందర్ రెడ్డి, పి. వెంకట్ రెడ్డి, తెలంగాణా జిల్లా/మండల/గ్రామా కమిటిల సభ్యులతో పాటు ౩౦౦ వారకు రైతులు పాల్గొన్నారు.