Home Telugu Articles భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు విలువలకు పట్టం ‘కుటుంబ ప్రబోధన్’

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు విలువలకు పట్టం ‘కుటుంబ ప్రబోధన్’

0
SHARE

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అనగానే అందరూ దాన్ని ఒక ‘హిందూత్వ సంస్థ’గా భావిస్తారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్న పలు అనుబంధ సంఘాలు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం దేశవ్యాప్తంగా నిర్వహిస్తూన్నాయి. సేవా కార్యక్రమాల నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టే ఇతర అంశాల గురించి ఎక్కువమందికి తెలియదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి, వాటిపట్ల నేటి యువతకు ఒక అవగాహన కల్పించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ ‘కుటుంబ ప్రబోధన్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్‌ఎస్‌ఎస్ దేశాన్ని 42 ప్రావినె్సస్‌గా గుర్తించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కనీసం వారానికి ఒక రోజు అయినా కుటుంబ సభ్యులు అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ‘వసుధైక కుటుంబం’ అనేది భారతీయ సంస్కృతి ముఖ్య లక్షణం. ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచం కారణంగా వసుధైక కుటుంబం మాట దేవుడెరుగు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దీని కారణంగా సమాజంలో నైతిక విలువలు, మానవీయత క్రమక్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఇవే పరిస్థితు లు మరికొంతకాలం కొనసాగితే- ‘ఎవరికెవ రు ఈ లోకంలో ఎవరి కి ఎరుక..’ అనే సినిమా పాట మాదిరిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆధునికత పుణ్యమాని కుటుంబ విలువలు నా శనం అవుతున్నాయి. దేశంలో వయోవృద్ధుల ఆశ్రమాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తమ పిల్లలు ఏమి చేస్తున్నారో కూడా గమనించని తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో సమాజంలో నైతిక విలువలు పెంపొందిస్తూ కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత పటిష్టం చేయడానికే ఆర్‌ఎస్‌ఎస్ ‘కుటుంబ ప్రబోధన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. కుటుంబ సభ్యులు అందరూ కనీసం వారానికి ఒకసారి కలిసి భోజనం చేయడం వలన (స్మార్ట్ ఫోన్లు, టీవీలకు దూరంగా) వారిమధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పిల్లల్లో చిరుప్రాయంలోనే ‘ఇది తమ కుటుంబం’ అనే భావన ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు అందరూ మనసు విప్పి మాట్లాడుకోవడం వలన, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్ళినపుడు లాడ్జిలు, హోటల్స్‌లో కాకుండా, తమ కార్యకర్తల గృహాలలో ఉంటారు. దీనివలన సదరు కుటుంబంతో తమకు మంచి అనుబంధం ఏర్పడుతుందనేది వారి భావన. కుటుంబ ప్రబోధన్ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలోకి ఆర్‌ఎస్‌ఎస్ మరింతగా చొచ్చుకు వెళ్లడానికి ఉపకరిస్తుంది. కుల,మత,వర్గ రహితంగా అందరూ కుటుంబ ప్రబోధన్ కార్యక్రమంలో పాల్గొంటే సామాజికంగానూ మంచి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

-పి.భానుశంకర్

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here