Home News బీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

బీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

0
SHARE
బీమా కోరేగావ్ ఎల్గర్ పరిషత్ సంబంధించిన కేసులో  ఓ మహిళ తో సహా ముగ్గురు వ్యక్తులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. సాగర్ తత్యారామ్ గొర్ఖే(32), రమేష్ మురళీధర్ గై చోర్ (36) లను సోమవారం అరెస్టు చేయగా, జ్యోతి రాగోబా జగాప్త్(33) ను  మంగళవారం అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. అరెస్టయిన ముగ్గురు పూణే కు  చెందినవారు. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ, సిపిఐ( ఎం) అనుబంధ సంస్థ అయిన కబీర్ కాలా మంచ్ సభ్యులు.
     ఈ కేసు  2017 డిసెంబర్ 31న పూణేలోని శనివర్డా లో  కబీర్ కాలా మంచ్ ఆధ్వర్యంలో ఎల్గర్ పరిషత్ కార్యక్రమానికి సంబంధించింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వివిధ కులాల, వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అక్కడ అల్లర్లకు దారి తీశారు. ఈ  ఆందోళనల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వీరు ముఖ్యంగా మావోయిజం నక్సలిజం ప్రేరేపిస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసినట్టు ఎన్ఐఏ అధికారి తెలిపారు.
ఈ కేసు కు సంబంధించి పూణే పోలీసులు వరుసగా 2019 ఫిబ్రవరి 21, నవంబర్ 15 చార్జిషీటు దాఖలు చేసి నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.
ఈ ఏడాది జనవరి 24న ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేపట్టి ఆనంద్ టేల్తుంబే, గౌతమ్ నవలాఖలను ఏప్రిల్ 14న అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఉత్తరప్రదేశ్ వాసి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న హనీ బాబు ముసలేయవిర్తిల్ తరాయిల్ ను జూన్ 28న అరెస్టు చేశారు
గోర్ఖే, గై చొర్, జాగ్తప్ లు నక్సల్ కార్యకలాపాలను సాగిస్తూ, మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని, అంతకుముందు అరెస్ట్ అయిన నిందితులతో కూడా వీరికి సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది. పరారీలో ఉన్న మరో నిందితుడు మిలింద్ తో వీరు సంప్రదింపులు జరిపినట్టు ఎన్ఐఏ అధికారి పేర్కొన్నారు. కబీర్ కాల్ కాలా మంచ్ సభ్యులు అడవుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలపై మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన అంశాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టు ఎన్ఐఏ పేర్కొంది.
అరెస్టయిన ముగ్గురు నిందితులను ముంబైలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి,  నాలుగు రోజుల కస్టడీ విధించారు తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here