Home News “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి”

“మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి”

0
SHARE
  • యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు

నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ ప్రాంత‌మంతా కుడా నైజాం దొర‌ల చేతిలోనే ఉంద‌ని అన్నారు. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలుపుతానని భారతదేశంతో సంబంధం లేద‌ని, ప్రాంతాన్ని తమ సొంత‌ దేశంగా భావించి అనేక అకృత్యాల‌కు పాల్ప‌డ్డాడు. హిందువులపై, దేవాలయాల‌పై దాడులు, మహిళలపై అత్యాచారాలు, సంస్కృతిపై అనేక దారుణాలు చేశార‌ని, అరాచకమైన పన్నులు విధించే వార‌ని, వారికి వ్య‌తిరేకంగా అనేక మంది పోరాటాలు చేసి తమ ప్రాణాలు బలిదానం చేశార‌ని గుర్తు చేశారు. వారి త్యాగాల‌ను ప్రేర‌ణ‌గా తీసుకుని మన కోసమే కాకుండా దేశం కోసం కూడా పని చేయాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ పిలుపునిచ్చారు.

అనంత‌రం మ‌రోక వ‌క్త‌ , సామాజిక స‌మ‌ర‌స‌తా వేదిక తెలంగాణ ప్రాంత క‌న్వీన‌ర్ శ్రీ అప్పాల ప్ర‌సాద్ జీ మాట్లాడుతూ ప్ర‌స్తుత‌ కాలంలో దేశంలోని యువతకి చరిత్ర తెలియని కారణంగా ప్రాశ్చ‌త్య సంస్కృతిని పాటిస్తున్నారని, మనదైన అసలైన చరిత్రను పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్య‌త మనందరిపై ఉందని అన్నారు. ప్ర‌పంచంలో మ‌న దేశం వెలిగిపోతుందని, ప్ర‌తిష్ట పెరుగుతోంద‌ని, ఇందులో మ‌న‌మంద‌ర‌మూ భాగ‌స్వాములు కావాలని పిలుపునిచ్చారు. నైజాం రాజులు హిందువుల‌పై చేసిన అకృత్యాల‌ను, అరాచాల‌ను ప్రతి ఒక్కరికి తెలియజేయాల‌ని మ‌న పూర్వీకులు న‌డిచిన స‌న్మార్గంలో మనంమంద‌రం న‌డిచి ఆశయులను సాధించే దిశలో అందరం పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కారక్రమంలో స‌మితి ప్రాంత కన్వీనర్ శ్రీ శ్రీ‌ధ‌ర్ రెడ్డి గారు, జిల్లా అధ్య‌క్షులు జట్టు కృష్ణయ్య గారు, RSS జిల్లా సంఘ‌చాల‌క్ బాదం ప్రకాష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, ఆర్‌.ఎస్‌.ఎస్ విభాగ్ ప్ర‌చార‌క్ శ్రీ శివ‌కుమార్ గారు, 3వేల పైగా యువ‌త పాల్గొన్నారు.