Home News ర‌క్త‌దాన్ సేవా ట్ర‌స్ట్ సౌజ‌న్యంతో రక్తదాన శిబిరం – బర్కత్ పుర భాగ్

ర‌క్త‌దాన్ సేవా ట్ర‌స్ట్ సౌజ‌న్యంతో రక్తదాన శిబిరం – బర్కత్ పుర భాగ్

0
SHARE

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రక్తదాన్ సేవ ట్రస్ట్ – తెలంగాణ వారి సౌజన్యంతో జనవరి 10 2021 ఆదివారం రోజున రక్తదాన్ సేవ, బర్కత్ పుర భాగ్ నారాయణగూడ లోని శ్రీ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో రక్తదాన శిబిరం నిర్వహించ‌నున్నారు. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని గాంధీ హాస్పిటల్ తో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) నారాయణగూడ రక్తదాన‌ కేంద్రాల‌కు అందించనున్నారు.

ఏమిటి రక్తదాన్ సేవ?

రక్తదాన్ సేవ ట్రస్టు – తెలంగాణ మన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుండి ప్రారంభించబడిన రక్తదాన విభాగం. తెలంగాణా లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రక్తం అందరికీ అందుబాటులో ఉండాలి అనేది రక్తదాన్ ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం రక్తదాన్ యాప్ ను అభివృద్ధి చేశారు. స్వయంసేవకులు అందరం ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించే ప్రయత్నం జరుగుతుంది. ఈ రక్తదాన్ ఆప్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పనిచేస్తుంది.