Home News బ్రిటిష్ పాలన నుండి విముక్తి కోసం పోరాడిన గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా

బ్రిటిష్ పాలన నుండి విముక్తి కోసం పోరాడిన గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా

0
SHARE
Photo Courtesy: India Today

న‌వంబ‌ర్ 15 – బిర్సా ముండా జ‌యంతి…

భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తికై గిరిజన వీరుల పోరాటం గొప్పది మన దేశ స్వాతంత్రం కొరకు ధర్మ సంస్కృతుల రక్షణకై వనవాసుల హక్కుల కొరకు బిర్సా ముండా ఎనలేని కృషి చేశాడు. చోటానాగపూర్ ప్రాంతం అంటే నేటి జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాలు. అక్కడి ప్రజలను చైతన్యపరిచి బ్రిటిష్ పాలకుల అన్యాయాలను ఎదిరించి సాయుధ పోరాటం చేశాడు. ఆ కారణంగా అప్పటివరకు గిరిజనులను దోపిడీ చేస్తున్న బ్రిటిష్ పాలకుల తాబేదార్లు అయిన జమీందార్లు మరియు పటేళ్లు వీళ్లందరి పేత్తనాలను తొలగించి జిల్లా కలెక్టర్ల ద్వారా గిరిజనులకు భూమి హక్కులు లభించినవి.

1857 మొదటి స్వతంత్ర సంగ్రామం తరువాత యూరపు క్రైస్తవ మిషనరీలు విరివిగా గిరిజన ప్రాంతాలకు వచ్చి విద్య వైద్యం మరియు భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి గిరిజనులను మభ్యపెట్టి మతం మార్పిడి చేయ పూనుకున్నారు. ఇలా ఆ రోజుల్లోనే ఆరు లక్షల మందిని గిరిజనుల్ని క్రైస్తవుడిగా మార్చారు. ముండా తెగకు చెందిన టువంటి గిరిజనుల పవిత్ర స్థలమైన టువంటి సరనా అనే పూజా స్థలములను క్రైస్తవులు ఆక్రమించ పూనుకున్నారు. ఇది గమనించిన ముండా తెగకు చెందిన పెద్దలైన సర్దారులు దీనిని వ్యతిరేకించి నందున నందున క్రైస్తవ ఫదరెలు   కక్ష బట్టి గిరిజన సంప్రదాయాలను, ఆచారాలను, పండగలను మూఢనమ్మకాలుగా ప్రచారంచేసి అవహేళన చేయడం ఆరంభించారు.

1875 వ సంవత్సరంలో గురువారంనాడు అంటే బృహస్పతి వారము నాడు జన్మించిన బిర్సా ముండా భగవంతుని కృపతో ఈ గిరిజనులకు నాయకుడయ్యాడు. జార్ఖండ్లోని పులి హాట్ అనే గ్రామంలో జన్మించిన బిర్సా ఎంతో బీద కుటుంబంలో  పుట్టినప్పటికీ తన ప్రతిభతో నిరంతర పరిశ్రమతో గిరిజనులను ప్రభావితం చేశాడు. బాల్యములో గోవులను మేపుతూ పిల్లనగ్రోవిని వాయించేవాడు. ప్రజలంతా ఆ గోపాలకృష్ణుడు తమరికి వచ్చారని అనుకునేవారు. ఆయన తండ్రి విలువ యొక్క విద్యాభ్యాసం కొరకు క్రైస్తవ పాఠశాలలో పంపించి వేశాడు. కానీ అక్కడ గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిరోజూ క్రైస్తవులు తు దూల నాడే వారు. ఆ పాఠశాలల్లో చేరిన వారందరూ యొక్క పేరు మార్చి క్రైస్తవ పేర్లు పెట్టేవారు. అలా బిర్సా ముండా ని డేవిడ్ ముండ గా పేరు మార్చారు. ఆయన జంధ్యాన్ని తొలగించారు. పిలకలు కత్తిరించి వేశారు. భోజనము లో గోమాంసం పెట్టడం మొదలెట్టారు. గోవు మాకు తల్లి అని  బిర్సా దీనిని పూర్తిగా వ్యతిరేకించాడు. క్రైస్తవ అధ్యాపకుల ప్రవర్తనను నిరసించాడు. అందుకే పాఠశాల నుంచి తొలగించ బడ్డాడు. ఆనంద్ పాండే అనే గురువు వద్ద తాను విద్యాభ్యాసం చేశాడు రామాయణము భారతము మొదలగు ధార్మిక గ్రంథాలను పరిపూర్ణంగా అధ్యయనం చేశాడు. అంతేకాకుండా ప్రకృతి లోని రక రకాల మందులను కనుక్కున్నాడు. ప్రజలకు వైద్యం చేస్తూ మన రోగాలను దూరం చేశాడు వారిలోని దురాచారాలను మూఢనమ్మకాలను దూరం చేశాడు,.

బిర్సా ముండాను ప్రజలు దైవంగా భావించి భగవాన్ బిర్సాగా భావించడం మొదలు పెట్టారు. ఆయన బోధనలలో ముఖ్యంగా
1. ఈశ్వరుడు ఒక్కడే. 2. గోసేవ ప్రాణి సేవ చేయాలి.
3. మత్తుకు బానిస కాకూడదు
4. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి.
5. ఇల్లు శుభ్రంగా ఉండాలి ప్రతి ఇంటి ముందు తులసి తప్పకుండా ఉండాలి.
6. పెద్దల యెడ గౌరవం ఉంచాలి
7. మన ధర్మాన్ని పాటించాలి.
8. మనమంతా కలిసి సంఘటితంగా ఉండాలి.
9. వారంలో ఒక రోజు అందరూ గ్రామ దేవతను పూజించాలి.
10. విదేశీయుల, వి జాతీయుల   మోసాలకు బలి కావద్దు. ఇలా గిరిజనుల అందరికీ బోధించాడు

చైతన్యవంతమైన  గిరిజనులు  బిరసా దర్శనానికి రావడం మొదలుపెట్టారు.  ఒకరోజున  బిరస భగవాన్ తన శిష్యులను వెంటబెట్టుకొని అడవిలో వెళ్తుంటే అకస్మాత్తుగా పిడుగు పడింది. బిరసం పై వీరేష్ ఆపై బిర్సా పై పిడుగు పడిన విశాఖ ఏమీ కాలేదు పైగా ఆయన శరీరము జగజ్జేగీయమానం వెలుగుతున్నది.

బిర్సా పై పిడుగు పడినప్పటికీ ఆయన శరీరము జగజ్జేగీయమానం గా వెలుగుతున్నది. దీనిని గమనించిన శిష్యుడు గ్రామానికి వచ్చి జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పారు. ప్రజలంతా భూమి యొక్క దేవుడు అనే పేరుతో  బిర్సా  భగవాన్ అని పిలవడం మొదలెట్టారు అలా అనేక గిరిజన గ్రామాలలో తిరుగుతూ ప్రజలను ధార్మిక నింపుతూ ఆదర్శవంతమైన ఎటువంటి జీవితాన్ని గడపాలని ప్రజలకు చెప్పడం మొదలెట్టాడు. కానీ బ్రిటిష్ పాలకుల యొక్క దురాగతాల్ని భరించలేకుండా పోయారు ప్రజలంతా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురు అని అనుకున్నాడు ప్రజల్లో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటమే మనకు నిర్ణయించాడు విజయమో వీరస్వర్గమో ఇదే మనకు మార్గం అని గుర్తించారు మొట్టమొదట 1889 డిసెంబర్ 24వ తేదీన  ఉన్న గులాం అని చోటినుండి బ్రిటిషు వారిపై యుద్ధం ప్రకటించారు. ఆ తిరుగుబాటు కారణంగా బ్రిటిష్ పాలకులలో అలజడి మొదలైంది. తెల్లదొరలను భయకంపితులగా కావించారు. రాత్రిపూట దాడి చేసిన గిరిజనులు బ్రిటిష్ వారి యొక్క పోలీస్స్టేషన్లో పైన వారి పాఠశాలలో పైన దాడులు ప్రారంభించారు. అన్ని వైపుల నుండి గిరిజనులు యొక్క బాణాల ధాటికి బ్రిటిష్వారు తట్టుకోలేకపోయారు. భయకంపితులై పారిపోయారు. ఆ తరువాత మూడు వందల అడుగుల ఎత్తున ఉన్నటువంటి డోన్ భారీ అనే కొండను ఆధారంగా చేసుకొని మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించారు గిరిజనులు. ఆంగ్లేయులు మోసంతో బిర్సాను బంధించాలని ప్రయత్నం చేశారు రెండు మాసాలు ప్రయత్నించినప్పటికీ కూడా బంధించలేక పోయారు పట్టించిన వారికి బహుమతి ప్రకటించారు చివరికి బంధించి దగ్గర ఉండేటటువంటి హజారీబాగ్ జైలుకు తరలించారు.

ఇది తెలుసుకున్న టువంటి గిరిజనులు ముఖ్యంగా కోల్,  సంతాల్, ముండా తెగలకు  చెందినటువంటి గిరిజనులు అందరు కూడా హజారీబాగ్ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు గిరిజనులు యొక్క ఇచ్చినటువంటి బ్రిటిష్ వారు భగవాన్ బిర్సా ను వదిలి పెట్టారు కానీ మోసంతో మళ్లీ ఆయనను బంధించి రాంచీ జైలులో ఉంచారు. జైలులో ఆయనను అనేక రకాల చిత్రహింసలకు గురి చేశారు చివరికి విష ప్రయోగం చేశారు భగవాన్ బిర్సా ఆవిధంగా మరణించాడు. ఉత్తరాదిన ముఖ్యంగా బీహార్,  జార్ఖండ్, బెంగాల్,  ఒరిస్సా మొదలగు రాష్ట్రాలలో ఇప్పటికీ ప్రజలందరితో భగవాన్ గానే  పూజింప పడుతున్నాడు. ఆయన చేసిన కృషి కారణంగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఎంతో మార్పు వచ్చింది బ్రిటిష్ వారు అప్పటి నుండి గిరిజనులకు సహకరించడం మొదలు పెట్టారు. అందుకే ఆయన పుట్టినటువంటి నవంబర్ 15వ తేదీన భారతదేశంలో  గిరిజనుల యొక్క  స్వాభిమాన దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

This article was first published in 2020