Home News అభివృద్ధి దిశ‌గా కేంద్ర బడ్జెట్ – 2023

అభివృద్ధి దిశ‌గా కేంద్ర బడ్జెట్ – 2023

0
SHARE

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్ర‌వ‌రి 1న‌ పార్లమెంట్ లో బడ్జెట్ 2023ను ప్ర‌వేశ‌పెట్టారు. అమృత్ కాలంలో ఇదే మొదటి బడ్జెట్ అని మంత్రి అన్నారు. భారత్ ఓ ప్రకాశవంతమైన దేశమని ప్రపంచ దేశాలు కూడా ఈ విషయాన్ని గుర్తించాయ‌ని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో మన వృద్ధి 7.0%గా అంచనా వేయబడింద‌ని, ప్రపంచ పరిస్థితులు ఇబ్బందికరంగా వున్నాప్రస్తుతం ఇదే ఎక్కువ అని కేంద్ర మంత్రి వెల్ల‌డించారు. ఈ బ‌డ్జెట్ ప్రసంగంలో ముఖ్యంశాలు…

2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో దేశ ప్రజలకు మెరుగైన జీవిత ప్రమాణాలు అందుతున్నాయ‌ని, తలసరి ఆదాయం రెండింతలు పెరిగి… 1.97 లక్షలకు చేరుకుంది. ప్రపంచంలో మనది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోంద‌ని కేంద్ర మంత్రి వెల్ల‌డించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా రూ. 11.7కోట్లతో టాయ్‌లెట్స్‌ నిర్మాణం చేపట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 44కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోందన్నారు. ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2లక్షల కోట్లను కేంద్రం భరిస్తోందని తెలిపారు. దేశ‌వ్యాప్తంగా 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించాం. 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. విశ్వకర్మ కౌశల్ పథకంలో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నాం అని తెలిపారు. ‘శ్రీఅన్న పథకం’ కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు చేస్తున్నాం. దేశ వ్యాప్తంగా మరిన్ని నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తాం. మెడికల్ కళాశాలలో పాటు, దేశ వ్యాప్తంగా మరో 157 నర్సింగ్ కాలేజీలకు అనుమతులు ఇవ్వ‌నున్నారు. త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలలను పెంచుతామ‌ని, అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీని తీసుకొస్తామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు.

విద్యుత్ రంగానికి 35 వేల కోట్ల కేటాయించారు. దేశ వ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ నిర్మాణం, 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ప‌రిశోధ‌న కేంద్రాల ఏర్పాటు. కోవిడ్ సమయంలో నష్టపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రిఫండ్ పథకం. రైల్వేలకు 2.40 లక్షల కోట్లు కేటాయింపు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం 13.7 లక్షల కోట్లు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో యేడాదికి పొడిగించ‌నున్న‌ట్టు కేంద్ర మంత్రి తెలిపారు.

మౌలిక వసతుల ప్రాజెక్టులకు 75 వేల కోట్లు, పీఎం ప్రణామ్ పేరుతో పథకాన్ని తీసుకొస్తున్నాం. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీంను ప్రారంభిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రత్యేక నిధులు కేటాయించ‌నున్నారు. ఈ-కోర్టుల ప్రాజెక్ట్ కు రూ.7వేల కోట్లు కేటాయింపు. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసుకోవడం, కట్టుకోవాలనుకునే పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఈ బడ్జెట్ లో నిధులు పెంచ‌నున్న‌ట్టు తెలిపారు. మొత్తం 79 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత బడ్జెట్ లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్లు కేటాయింపు.. ఈ యేడాది ఆ మొత్తాన్ని 66 శాతంగా పెంచి, 79 వేల కోట్లకు పెంపు చేశారు.

ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చిన మోదీ సర్కార్. ఆదాయ పన్ను పరిమితిని 7 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం 5 లక్షలు వున్న ఆదాయపు పన్ను పరిమితిని 7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ప‌న్ను కట్టాల్సిన అవ‌స‌రం లేదు. 9 లక్షల ఆదాయం వున్న వారు మాత్రం 5 శాతం ట్యాక్స్ కట్టాల్సి వుంటుంది. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 -రూ.9 లక్షల వరకు 5శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 0-3 లక్షల వారికి నిల్ 6-9 లక్షల వరకు 10 శాతం 9-12 లక్షల వరకు 15 శాతం 12-15 లక్షల వరకు 20 శాతం 15 లక్షలు ఆదాయం దాటితే 30 శాతం పన్ను.

వ్యవసాయ రంగ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి రైతుల కోసం పెద్ద ప్రకటన చేశారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్‌ చేస్తామని, యువ రైతులకు నిధులు కేటాయిస్త‌మ‌ని ప్ర‌క‌టించారు. వ్యవసాయ రంగంలో రుణ పథకం కింద పశుపోషణ, పాడిపరిశ్రమ, మత్స్య సంపదను పెంచేందుకు రూ. కోటి 20 లక్షల పంపిణీ చేయనున్నారు. మత్స్యశాఖ సబ్‌ప్లాన్‌లో అద‌నంగా రూ. 6వేల కోట్ల పెట్టుబడి. అగ్రి-స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ సృష్టించనున్నారు. గోబర్ధన్ పథకం కింద, 500 కొత్త ప్లాంట్లు స్థాపించి, సహజ వ్యవసాయం కోసం 10,000 బయో ఇన్‌పుట్ వనరులను ఏర్పాటు చేస్తారు.
ప‌త్తిసాగు మరింత మెరుగు అవ్వడానికి ప్రత్యేక చర్యలు, పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం.
ఆత్మ నిర్భర భారత్ క్లీన్ పథకం కింద ఉద్యానవన పంటకు చేయూత. నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ కి 19,700 కోట్ల కేటాయింపు. రైతుల ఉత్పత్తుల నిల్వల కోసం మరిన్ని గిడ్డంగుల ఏర్పాటు. పంచాయతీ స్థాయిలో గిడ్డంగుల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం. వ్యవసాయ స్టార్టప్స్ కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం.

దేశంలోని ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని కేంద్రమంత్రి నిర్మలా తెలిపారు. స్కూళ్ల ద్వారా రానున్న 3 ఏళ్లలో 38,800 టీచర్ ఉద్యోగాలు. 740 ఏకలవ్య పాఠశాలల్లో3.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు.