Home News నాడు నీతులు చెప్పి… నేడు రహస్య ప్రదేశంలో త‌ల‌దాచుకున్న‌ కెనడా ప్రధాని

నాడు నీతులు చెప్పి… నేడు రహస్య ప్రదేశంలో త‌ల‌దాచుకున్న‌ కెనడా ప్రధాని

0
SHARE

-చాడా శాస్త్రి

పాముకు పాలు పోసినా అది మనల్నే కాటేస్తుంద‌న్న సత్యం కెనడా లో నిజమవుతూ కనిపించిందీ. కొద్ది కాలం క్రితం మన దేశంలో జరిగిన న‌కిలీ రైతు ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన కెన‌డా ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తుంది. కెనడాలో వాక్సిన్ కు వ్యతిరేకంగా స్థానిక డ్రైవర్ యూనియన్లు నిర్వహిస్తున్న నిరసనలు తట్టుకోలేక… కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అజ్ఞాతంలోకి పారిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇది కర్మభూమి…. ఈ భూమి మీద కుట్రలు చేసిన ప్రతీ దేశం ఇప్పుడు వాటి ఫలితాలు పొందుతూనే ఉన్నాయి. హక్కుల కోసం అని ఎవరో  కొందరు ప్రారంభించే ఉద్యమాన్ని సంఘ విద్రోహ శక్తులు హైజాక్ చేసి  ఆందోళనల పేరుతో చేసే అరాచకత్వాన్ని,  విధ్వంసాన్ని ఉదారవాదం పేరుతో, సిద్ధాంతాల నెపంతో ఒకనాడు సమర్ధిస్తే అది ఒకనాడు మనకు, మన కుటుంబాలకు మన సమాజానికి కూడా హాని కలుగచేయవచ్చు. చివరికి వాళ్ళ చేతుల్లోనే మన వినాశనం వుంటుంది.

గతంలో ఢిల్లీ బోర్డర్స్ దగ్గర రైతుల ఉద్యమం పేరుతో కొందరు సంఘ విద్రోహ శక్తులు జనవరి 26వ తేదీన ఢిల్లీలో ఎర్రకోట వద్ద చేసిన భీభత్సం చూసాం. దానికి మన ఉదారవాదులు చాలా మంది బేషరుతుగా సమర్థించి మద్దతు ఇచ్చారు. కారణం ఆ ఆందోళనలు, ఆ విధ్వంసం మన ఊర్లో , మన వీధిలో జరగడం లేదు కాబట్టి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు మనకు తెలియదు. అదే మన వీధిలో జరిగి యే వెధవో ఏ పెట్రోల్ బాంబు సీసా మన ఇంటి మీద విసిరేసి ఉంటే అప్పుడు వాటి వల్ల అనర్థం  తెలిసివచ్చి ఉండేది.

ఆ రైతుల ఆందోళన సమయంలో కొందరు NRI సిక్కులు ఎక్కువగా ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది కెనడా, యుఎస్, యుకే వాళ్ళు ఉన్నారు. ఈ NRI సిక్కులు కెనడా దేశంలో రాజకీయంగా కూడా బలంగా వున్నారు. బహుశా ఆ కారణం చేతనేమో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఢిల్లీ రైతు ఉద్యమానికి తన నైతిక మద్దతు ఇస్తూ అప్పట్లో ఈ  ప్రకటన చేశాడు. “శాంతియుత నిరసనకారుల హక్కులను కాపాడేందుకు కెనడా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మేము చర్చల ప్రక్రియను నమ్ముతాము. మా ఆందోళనలను తెలియ చెప్పడానికి  మేము అనేక మార్గాల ద్వారా భారతీయ అధికారులను సంప్రదించాము. మనమందరం కలిసికట్టుగా ఉండాల్సిన తరుణం ఇది” అని జస్టిన్ ట్రూడో అన్నారు.” ఆ ప్రకటన ను భారత్ ఖండించింది. ఒక దేశ అంతర్గత వ్యవహారాల లో జోక్యం చేసుకోవడాన్ని ఖండించింది.

అయితే కెనడాలో ఆ మధ్య ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసింది. యూకే నుండి వచ్చే ట్రక్ డ్రైవర్స్ తప్పని సరిగా వాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలి అనేది అర్డ‌ర్ ఉద్దేశం. దానికి నిరసనగా గత వారాంతంలో ట్రక్ డ్రైవర్స్ తమ నిరసన తెలియచేస్తూ ట్రక్కులతో రోడ్లు బ్లాక్ చేశారు. దీనికి “ఫ్రీడమ్ కాన్వాయ్” అని పేరు పెట్టారు.

మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులు అంటే 370 రద్దు, CAA చట్టం, ట్రిపుల్ తలక్ చట్టం, రామాలయ నిర్మాణం ఇలా వ్యతిరేకించిన గ్రూపులు అన్ని రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చారో ఇపుడు అదే విధంగా కెనడాలోని వివిధ ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులు అన్ని కలిసి ఈ
“ఫ్రీడమ్ కాన్వాయ్” ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. నిన్న లక్ష నుండి లక్ష ఏభై వేల మంది తమ ట్రక్కులు, వాహనాలతో కెనడా రాజధాని ఒట్టావా లో గల పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. ఇక ఒట్టావా లో రోడ్లు ఖాళీ లేవు మరీ వాహనాలు తీసుకు రాకండి అని పోలీసులు ప్రకటన చేశారు.

మనకు రైతులతో చర్చలు జరపండి అని ఉచిత సలహాలు ఇచ్చిన కెనడా ప్రధాని జస్టిన్  ట్రూడో ఆందోళన కారులతో చర్చలు జరపకుండా తన కుటుంబంతో సహా ఎక్కడికో రహస్య ప్రదేశానికి పారిపోయాడు. కెనడా పార్లమెంట్ ముట్టడి సంఘటన గతంలో జనవరి 26న మన ఎర్రకోట ముట్టడి చేసిన సంఘటన గుర్తు చేసిందా? ఈ ఉద్యమాలు వెనుక వున్న ఫండింగ్ శక్తులు, ఆందోళన రెచ్చగొట్టే శక్తులు ఒకటే అయినపుడు ఆందోళనల స్క్రిప్ట్ కూడా ఒకలాగే వుంటుంది.

కెనడా లోనూ, ఉత్తర అమెరికాలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో, డ్రైవర్లులో మన NRI సిక్కులు వేల మంది ఉన్నారు. ఇప్పుడు కెనడాలో జరుగుతున్న ఈ ఆందోళన వెనుక వీరు కూడా ఉన్నారు. కెన‌డాలో జరుగుతున్న ఈ నిర‌స‌న‌ల‌పై ఒక అమెరికన్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ “ఉదారవాద భావజాలం అని బైడన్ ని నెత్తిన ఎక్కించుకుని అమెరికా జార్జ్ సోరోస్, చైనా వామపక్ష సానుభూతిపరుల చేతిలోకి పోయింది. అదే వుదారవాద విధానం అంటూ జర్మనీ మార్కెల్, ఫ్రాన్స్ మార్కాన్ యూరోప్ ని ఇస్లామిస్టుల చేతిలో పెట్టారు. అదే విధానంతో ఇప్పుడు కెనడా ఖలిస్తానీయుల చేతుల్లోకి మెల్లి మెల్లిగా పోతోంది” అని ట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here