Home News ఇస్లాంను కించపరచినందుకు పాకిస్తాన్ లో ఓ క్రైస్తవుడుకి ఉరిశిక్ష 

ఇస్లాంను కించపరచినందుకు పాకిస్తాన్ లో ఓ క్రైస్తవుడుకి ఉరిశిక్ష 

0
SHARE
ఇస్లాంను కించపరుస్తూ తన పై అధికారికి మెసేజీలు చేసినందుకు పాకిస్తాన్ లోని ఒక క్రైస్తవునికి లాహోర్ సెషన్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆసిఫ్ ఫైర్వెజ్ మాసిహ్ (37) అనే క్రైస్తవుడు లాహోర్ లోని ఒక కర్మాగారంలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా కర్మాగారంలో పని చేసే ఒక అధికారి, క్రైస్తవుడైన మాసిహ్ ను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడు. మాసిహ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పైగా ఇస్లాంను అవమానిస్తూ సదరు అధికారి సెల్ ఫోన్ కు సందేశాలు పంపాడు.
దీంతో దైవదూషణ చేసినందుకు గాను అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.  సదరు అధికారి తరఫు న్యాయవాది మాసిహ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించాడు. అసలు ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేయలేదని, పైగా అక్కడ పనిచేసే క్రైస్తవులతో కూడా తప్పుడు సాక్ష్యాలను చెప్పించాడు. దీంతో లాహోర్ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి మన్సూర్ మహమ్మద్ ఖురేషి, క్రైస్తవుడైన అసిఫ్ పెర్వైజ్ మసిహ్ ను దోషిగా నిర్ధారించి, మూడేళ్ల జైలు శిక్ష తో పాటు మరణశిక్షను విధించారు. రూ.50. వేల జరిమానా కూడా కోర్టు విధించింది.
దైవ దూషణ, ఇస్లాం, ఖురాన్ ముస్లిం పెద్దలను అవమానించిన వారికి మరణశిక్ష విధించే  చట్టాలు పాకిస్థాన్ లో చాలానే ఉన్నాయి. ఇస్లాం ని వ్యతిరేకించినట్లు ఆరోపణలున్న వారు పాకిస్తాన్ లో కనీసం 80 మంది జైల్లో  ఉన్నారని యునైటెడ్ స్టేట్స్ కమిషనర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ తెలిపింది.
ఇటీవల ఓ దారుణ సంఘటన లో దైవదూషణ చేసినందుకు విచారణ ఎదుర్కొంటున్న  అహ్మదియస్ అనే మైనారిటీ ఇస్లామిక్ వర్గానికి చెందిన ఒక వృద్ధున్ని పేషవేర్ నగరంలోని కోర్టులో  న్యాయమూర్తి ఎదుటే కాల్చిచంపారు.
 మరో ఘటనలో రెండేళ్ల క్రితం దైవదూషణ ఆరోపణలతో అరెస్ట్ అయిన తాహిర్ అహ్మద్ అనే వ్యక్తిని విచారణ నిమిత్తం కోర్టుకి హాజరైనప్పుడు జడ్జి ఎదుటే అతన్ని కాల్చిచంపారు. పైగా కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని  ఇస్లాం కా షేర్ అంటూ సోషల్ మీడియాలో హీరోను చేశారు.
ఇస్లాంను అవమానించినందుకు నలుగురు పిల్లల తల్లైన ఆసియా బీబీ అనే మహిళ 8 ఏళ్ళు ఏకాంత నిర్బంధంలో గడిపింది. ఆమె పై దయ చూపాలని కోరిన పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తసిర్ తన బాడీగార్డ్ చేతిలోనే చంపబడ్డాడు.  చివరికి సుప్రీం కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించడం గమనార్హం..

Source : https://www.opindia.com/