Home News సిఐఎ తన నివేదికను మార్చుకుని క్షమాపణ చెప్పాలి : విశ్వహిందు పరిషత్

సిఐఎ తన నివేదికను మార్చుకుని క్షమాపణ చెప్పాలి : విశ్వహిందు పరిషత్

0
SHARE

అమెరికా గూఢచారి సంస్థ సి ఐ ఏ తన రిపోర్ట్ లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంస్థలను ‘మతపరమైన మిలిటెంట్ సంస్థలుగా’ పెర్కోనడాన్ని నిరసిస్తూ 18- జూన్ సోమవారం నాడు సికింద్రాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసన తెలిపిన వి హెచ్ పి నేతలను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసారు.

అరెస్ట్  అయిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ గాల్ రెడ్డి, భజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సుభాష్ చందర్ , రాష్ట్ర నాయకులు శ్రీ రమేశ్ లతో పాటు మిగితా కార్యకర్తలు ఉన్నారు. వీరందిరిని పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని వి హెచ్ పి తెలంగాణ నాయకత్వం డిమాండ్ చేసింది.

భారతీయ సనాతన ధర్మం ప్రేరణగా అనేక సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునఃనిర్మాణం అనే లక్ష్యం కోసం దేశ సేవకు అంకితమైన సంస్థల పై తీవ్రమైన ఆరోపణలు చేయడం అమెరికా కుటీలనీతికి నిదర్శనం, ఇలాంటి చర్యల ద్వారా సి ఐ ఏ తన అజ్ఞానాన్ని ప్రదర్శించింది అని, వెంటనే ఆ సంస్థ  తన తప్పును సరిదిద్దుకొని భారతీయ సమాజానికి క్షమాపణ చెప్పాలని విశ్వహిందూ పరిషత్(VHP) తెలంగాణ విభాగం డిమాండ్ చేసింది.

హైదరాబాద్ లో వి హెచ్ పి నేతల అరెస్ట్

జూన్ 15 నాడు న్యూ ఢిల్లీ లో విశ్వహిందు పరిషత్  విడుదల చేసిన పత్రికా ప్రకటన 

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లను తీవ్రవాద మత సంస్థలుగా  అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ ప్రకటించడం అత్యంత ఘోరమైన, అవమానకరమైన , అసత్యపూరితమైన చర్య. ఈ సంస్థలు సంపూర్ణ దేశభక్తియుతమైనవి. ఈ సంస్థల కార్యక్రమాలు కూడా దేశానికే సమర్పిత౦. 60,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు, వెయ్యికి పైగా సేవా కార్యక్రమాల ద్వారా వి.హిం.ప దేశ సమగ్ర వికాసానికి తోడ్పడుతోందని సంస్థ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డా.సురేంద్ర జైన్ తెలిపారు. దేశ హితం, హిందూ హితం పట్ల ఈ సంస్థ ఎప్పుడూ రాజీ పడదు. ఈ విషయాలన్నీ సి‌ఐ‌ఏ కి తెలియవాని అనుకోలేము. ఇటువంటి నిరాధార ఆరోపణల వెనుక స్వార్థపూరిత ప్రయోజనాలు ఉన్నాయని సందేహించవలసి వస్తుంది. భారతదేశంలోని చర్చ్ ద్వారా వ్రాయబడిన లేఖలు ఈ కుట్రలో భాగమే. ఒసామా బిన్ లాడెన్ ను ప్రేరేపించి ప్రపంచాన్ని జిహాది తీవ్రవాదంలో ముంచిన  సి‌ఐ‌ఏ కి  భారత్ లోని దేశభక్తి సంస్థ పట్ల వ్యాఖ్యలు చేసే నైతిక అధికారం ఎక్కడ ఉంది?

భారత్ పట్ల సి‌ఐ‌ఏ కు ఉన్న వ్యతిరేకత వారి నివేదికలో స్పష్టమవుతోందని విహింప సంయుక్త ప్రధాన కార్యదర్శి అన్నారు.  వాళ్ళు ఆక్రమిత కాశ్మీరుతో పాటు కాశ్మీరు లోని ఇంకొన్ని భాగాలను పాకిస్తాన్ లో ఉన్నట్లు చూపించారు. ఇది ఘోరమైన, దేశానికి అవమానకరమైన చర్య అని సురేంద్ర జైన్ అన్నారు. వెంటనే తమ చర్యలను సవరించుకొని భారత దేశ ప్రజలను క్షమాపణలు కోరమని అమెరికా ప్రభుత్వం కువ్యాఖ్యలు చేసే తమ ఏజెన్సీని ఆదేశించాలి. అలా వెంటనే జరగకుంటే విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయంగా సి‌ఐ‌ఏ వ్యతిరేక ఉద్యమం చేపడుతుంది. సి‌ఐ‌ఏ భారత వ్యతిరేక చరిత్ర అందరికీ విదితమేనని,ఈ కుట్ర కూడా ఆ వ్యతిరేకత నుండే పరిణమించిందని డా. జైన్ అన్నారు. అమెరికా ప్రభుత్వం ఈ విషయ౦ పట్ల త్వరగా విచారణ చేపట్టేందుకు భారత ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని వి.హిం.ప ప్రభుత్వాన్ని కోరుతోంది.

జారీ చేసిన వారు :
వినోద్ బన్సాల్, వి.హిం.ప, జాతీయ అధికార ప్రతినిధి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here