Home News దేవాలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం.. కమ్యూనిస్ట్ గూండాల ఆగడాలు

దేవాలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం.. కమ్యూనిస్ట్ గూండాల ఆగడాలు

0
SHARE
కేరళ రాష్ట్రంలోని వేణమని సమీపంలోని చెంగన్నూర్ పట్టణంలోని హిందూ దేవాలయంపై కమ్యూనిస్టు గూండాలు దాడికి తెగబడ్డారు. సుమారు వందమంది సీపీఎం పార్టీ యువజన విభాగం డీ.వై.ఎఫ్.ఐ కార్యకర్తలు నాయర్ సొసైటీ సర్వీస్ ఆధ్వర్యంలోని స్థానిక భువనేశ్వరి ఆలయంలోకి ప్రవేశించి  సోడా సీసాలు, మద్యం సీసాలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో దేవాలయంలోని విగ్రహాలు మరియు హుండీ ధ్వంసమయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భక్తులపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటన నేపథ్యంలో కేరళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కమ్యూనిస్టుల చర్యను ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కార్యదర్శి జె. నందకుమార్ తీవ్రంగా ఖండించారు. శబరిమల విషయంలో హిందువులు చేపట్టిన శాంతియుత నిరసనల వల్ల ఏర్పడిన అసంతృప్తి కారణంగానే కమ్యూనిస్టులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. జరిగిన ఘటనకు సీపీఎం అధినాయకత్వం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
శబరిమల విషయంలో నాయర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల కారణంగా హిందువులలో క్రమంగా ఐక్యత ఏర్పడుతోంది. దీన్ని జీర్ణించుకోలేని కమ్యూనిస్టులు గత కొంతకాలంగా  నాయర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే దేవస్థానాలు, ధార్మిక సంస్థలపై కమ్యూనిస్టులు దాడులకు పాల్పడుతూ వస్తున్నారు.
ఈ వరుస దాడులపై నాయర్ సర్వీస్ సొసైటీ నవంబర్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్త బందు చేపట్టింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ దాడులను ఖండిస్తూ బందుకు మద్దతు తెలిపాయి.
Source: VSK Bharat