Home News విద్యాబోధన ముసుగులో క్రైస్తవ మతమార్పిళ్లు: గ్రామంలో ఉద్రిక్తత.. నిషేధాజ్ఞలు 

విద్యాబోధన ముసుగులో క్రైస్తవ మతమార్పిళ్లు: గ్రామంలో ఉద్రిక్తత.. నిషేధాజ్ఞలు 

0
SHARE

విద్యాబోధన ముసుగులో ఓ క్రైస్తవ పాఠశాల అధ్యాపకులు విద్యార్ధులను మతమార్పిడులకు గురిచేస్తున్న ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని దన్బాద్ జిల్లా బెల్గర్హియా గ్రామంలోని ఒక చర్చిలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న గ్రామస్థులు సోమవారం రాత్రి చర్చి వద్ద ఆందోళనకు దిగారు. చర్చిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి పిల్లలకు పాఠాలు నేర్పుతున్న సాకుతో క్రైస్తవ మతంలోకి మార్చడం, స్థానిక గ్రామస్థులను కూడా ప్రలోభపెట్టడం వంటి విషయాలను గమనించినట్టు గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ మతమార్పిళ్లకు వ్యతిరేకంగా వారు నిర్వహించిన ఆందోళనల కారణంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ గ్రామంలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది.

ఈ విషయంపై చర్చి పాస్టర్ డానియల్ పోన్ రాజ్వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. గత 30 ఏళ్లుగా ఆ చర్చి నిర్వహించబడుతోంది అని, అక్కడ ఎలాంటి  మతమార్పిడులు జరగడంలేదని ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలకు ఇంగ్లీష్, సంగీతం పాఠాలు మాత్రమే నేర్పుతున్నారని తెలిపారు. గ్రామస్తులు తమపై దాడికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.

బెల్గర్హియా గ్రామాన్ని స్థలాన్ని జిల్లా ఎస్పీ అమిత్ రేణు సందర్శించి ఘటనకు సంబంధించిన విషయాలను స్థానిక పోలీసులు, ప్రజల నుండి తెలుసుకున్నారు. డి.ఎస్.పి అజిత్ కుమార్ నేతృత్వంలో చర్చి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.

విచారణ జరిపించాలి : బిజెపి ఎమ్మెల్యే:
మతం మార్పుళ్లు జరుగుతున్నాయని విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి ఎమ్మెల్యే సింద్రీ ఇంద్రజిత్ ఘటనా స్థలానికి చేరుకొని మత మార్పిడులకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Source: The Telegraph

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here