Home News సిపిఎం అమానుష దాడులను ముక్త కంఠంతో ఖండించాలి- ఆర్ఎస్ఎస్ సహా ప్రచార ప్రముఖ్ నంద కుమార్...

సిపిఎం అమానుష దాడులను ముక్త కంఠంతో ఖండించాలి- ఆర్ఎస్ఎస్ సహా ప్రచార ప్రముఖ్ నంద కుమార్ జీ

0
SHARE

సిపిఎం కార్యకర్తల దాడిలో తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీమతి విమల 16-జనవరి నాడు తుది శ్వాస విడిచారు. శ్రీమతి విమల స్థానికి బిజేపి కార్యకర్త భార్య. గత నెల  28న  సిపిఎం కార్యకర్తలు విమల ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. ఇదే ఘటనలో గాయపడ్డ విమల సమీప బంధువు రాధాకృష్ణ సైతం 60 శాతం గాయాలతో జనవరి  6న మరణించాడు.  2016 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి ఈ రకమైన దాడులు పెచ్చుమీరిపోయాయి. ముఖ్యంగా పినరాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలు, పిల్లలపైన కూడా సిపిఎం కార్యకర్తలు దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

సిపిఎం చాలాకాలంగా సాగిస్తున్న వ్యవస్థీకృత హింసలో శ్రీమతి విమల మరణం తాజా సంఘటన. ప్రభుత్వం, శాంతిభద్రతల యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో రాజకీయహింస పెరిగిపోయింది.  చాలా సందర్బాల్లో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పార్టీ నాయకులు కొన్నిసార్లు బాహాటంగానే హింసను ప్రోత్సహిస్తున్నారు.  

రాజకీయ, సైద్ధాంతిక ప్రత్యర్థులపైనే కాక వారి కుటుంబాలు, పిల్లలపై జరుగుతున్న ఈ రాజకీయ దాడుల్ని అంతా ముక్తకంఠంతో ఖండించాలి. స్వతంత్ర భారతంలో జరుగుతున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ, మానవ హక్కుల అణిచివేతను నిరసించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here