Home News ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ కుట్ర భగ్నం.. పేలుడు పదార్ధాలు స్వాధీనం 

ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ కుట్ర భగ్నం.. పేలుడు పదార్ధాలు స్వాధీనం 

0
SHARE
ఢిల్లీ: ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐఎస్-ఐఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్న ‘హర్కత్ ఉల్ హర్బ-ఇ-ఇస్లాం’ కుట్రని కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో సంయుక్తంగా చేపట్టిన రహస్య ఆపరేషన్ లో  భాగంగా ఢిల్లీలోని 17 ప్రాంతాల్లో తెల్లవారుజామున తనిఖీలు జరిగాయి.
ఎన్ ఐ ఏ  సంస్థ తమ వెబ్సైటులో తెలిపిన సమాచారం ప్రకారం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
ఐఎస్-ఐఎస్ ప్రేరణతో ఏర్పడిన సంస్థ ఢిల్లీ, ఎన్సీఆర్ మరియు ఇతర సున్నితమైన ప్రదేశాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు అత్యంత విశ్వసనీయమైన సమాచారం అందుకున్న దర్యాప్తు సంస్థ  తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నుతున్న ముఫ్తి మహ్మద్ సుహైల్ అలియాస్ హజరత్ అనే వ్యక్తితో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంది.
ఐఎస్-ఐఎస్ ప్రేరణతో ‘హర్కత్ ఉల్ హర్బ-ఇ-ఇస్లాం’ అనే సంస్థను ఏర్పాటు చేసి, పేలుళ్ల కోసం నిధుల సమీకరణ చేస్తున్న ముఫ్తి మహ్మద్ సుహైల్ నుండి భారీఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రి మరియు బాంబుల తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు దర్యాప్తు సంస్థ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న పేలుడు సామగ్రిలో 25 కేజీల పొటాషియం నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, 12 పిస్తోళ్లు, 150 రౌండ్ల బుల్లెట్లు, ఒక దేశవాళీ రాకెట్ లాంఛర్, 112 అలారం గడియారాలు, మొబైల్ ఫోన్ సర్క్యూట్లు మరియు ఇతర పరికరాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా పట్టణానికి చెందిన 29 ఏళ్ల ముఫ్తి మహ్మద్ సుహైల్ సమీపంలోని హకీమ్ మహతబుద్దిన్ రోడ్డులోని గల మసీదులో ఇమామ్ గా పనిచేస్తున్నాడు.