Home News ధర్మ ప్రచారంలో మహిళలకు ప్రాధాన్యం

ధర్మ ప్రచారంలో మహిళలకు ప్రాధాన్యం

0
SHARE

హిందూ ధర్మ పరరిక్షణలో భాగంగా నిర్వహించే ధర్మప్రచార కార్యక్రమాల్లో మహిళల్ని ఎక్కువ భాగస్వామ్యం చేయాలని ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని మఠ, పీఠాధిపతులు తీర్మానించినట్లు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షులు పివిఆర్‌కె ప్రసాద్ వెల్లడించారు. సోమవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో 4వ ధార్మిక సదస్సుకు దేశం నలుమూలల నుంచి దాదాపు 53 మంది మఠ, పీఠాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్మ పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అన్య మతాల నుంచి ఎదురవుతున్న దాడుల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై తీర్మానాలు చేశారు.

సమరసత సేవా ఫౌండేషన్ సమన్వయకర్తగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని ధార్మిక సంస్థలు, ముఖ్యమైన ఆలయాలు, వివిధ హిందూ సేవా సంస్థలు, ముఖ్యమైన ధార్మిక వ్యక్తులతో కమిటీ ఏర్పాటు. మండల స్థాయిల్లో కూడా కార్యాచరణ సమితుల ఏర్పాటు.

ధర్మప్రచార కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రతి గ్రామంలో మహిళా భజన మండళ్లు, కోలాటాల మండళ్లు, స్తోత్ర పారాయణాల మండళ్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

టిటిడి నిర్వహిస్తున్న ‘‘పురాణ పరీక్ష ’’ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లక్ష్యల సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనేలా చేయాలి.

గ్రామస్థాయిలో హిందువులు సమష్టిగా ధర్మప్రచారానికి, పరిరక్షణకు కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రతి హిందూ కుటుంబానికి ఎండైనా, వానైనా, హిందూ సమాజం వారి వెంట ఉంటుందన్న భరోసా కలుగజేయాలి. హిందువులను మతమార్పిడుల కోసం ప్రయత్నించే ఇతర ప్రచారకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేట్లు వ్యవస్థ ఏర్పాటు చేయాలి. హిందువుల కోసం హెల్ప్‌లైన్‌లు, లీగల్ సెల్‌లు ఏర్పాటు చేయాలి. ప్రతి హిందూ గృహం మీద హనుమద్ ధర్జీలు ఎగురవేయాలి.

ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల వాడలలో రూ.2లక్షల లోపు చిన్న ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక పథకం రూపొందించాలి. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఆలయాల మరమ్మతులకు రూ.50 వేలు మంజూరు చేయాలి.

అన్ని జిల్లాలకు ప్రచార రథాల కేటాయింపుతోపాటు, ఇప్పటికే ఇచ్చిన వాటి పూర్తి స్థాయి వినియోగానికి చర్యలు. ప్రచార సామగ్రి పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాలి.

టిటిడి వారు దేవాదాయ శాఖలోని ఇతర ఆలయాలవారు, క్షేత్రస్థాయిలో చేపట్టే కార్యక్రమాలన్నీ ఎస్‌ఎస్‌ఎఫ్ వారి సిబ్బంది ద్వారా చేపట్టాలి. ముఖ్యంగా దివ్యదర్శనం పథకంలో లబ్ధిదారులు ఎంపిక చేయుట విషయం ఎస్‌ఎస్‌ఎఫ్‌కి అప్పగించాలి

విద్యార్థులను లక్షిత వర్గంగా విద్యాసంస్థలకు తగిన ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకోవాలి.

గో సంరక్షణ లో భాగంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాలను లాంఛనమైన ‘లీజు’కు ఈ కార్యక్రమానికి పూనుకుంటున్న హిందూ, జైన సంస్థలకు కేటాయించాలి.

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు ‘నర్సింగ్ శిక్షణ సంస్థ’లను స్థాపించి శిక్షణ ఇవ్వాలి. దేవాలయాలను వైద్యస్థానాలుగా మార్చాలి. టిటిడి వారి శ్రీవారి వైద్య సేవా పథకాన్ని వాడవాడలా విస్తరింపజేయాలి.

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘సనాతన హిందూ విద్యాపీఠం’ పేరిట ప్రత్యేక అధ్యయన బోధనా శాఖను ఏర్పాటు చేయాలి.

ఆర్‌కె మిషన్, భారతీయ విద్యాభవన్, జెఇటి, ప్రజ్ఞ్భారతి, సరస్వతీ విద్యామందిర్ వంటి సంస్థలతో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు సమన్వయం చేసుకుని విద్యాసంస్థలను ప్రారంభించి నిర్వహించాలి.

సనాతన ధర్మప్రచారానికి తత్సంబంధిత కార్యక్రమాలకు మాత్రమే టిటిడి నిధులను ఖర్చు చేసేలా తగిన చర్యలు చేపట్టాలి.

దేవాలయ భూములను చట్టానికి లోబడి కౌలుకు ఇవ్వాల్సి ఉండగా న్యాయస్థానాలు వాటిని ప్రజావేలం ద్వారానే లీజుకు ఇవ్వాలని తీర్పు ఇచ్చిన నేపధ్యంలో లీజు అంశంలో నిర్ణయాలు కష్టతరమవుతున్నాయి.

రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ప్రజాప్రయోజనాల పరమాధిగా మాత్రమే లీజు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోవాలి.

మహిళలను ధర్మప్రచారంలో వారి సేవలను వినియోగించుకోవాలి. ముఖ్యంగా పొదుపుసంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలను ధర్మప్రచారకులుగా చేర్చాలి.

ప్రభుత్వం చేపట్టే మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఉన్న పురుషులు, మహిళలకు ఆహారం కోసం పని వంటి కార్యక్రమాల్లో భజన, భగన్నామ స్మరణం చేసేలా స్వామీజీలు ప్రోత్సహించాలి.

(ఆంధ్రభూమి సౌజన్యంతో)