Home News భారతీయులంతా ఒక్కటే, కులం కన్నా ధర్మం గొప్పది – సామాజిక సమరసతా వేదిక

భారతీయులంతా ఒక్కటే, కులం కన్నా ధర్మం గొప్పది – సామాజిక సమరసతా వేదిక

0
SHARE

సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే, కులం కన్నా ధర్మం గొప్పదని “సామాజిక సమరసతా వేదిక”  నిర్వహించిన సమావేశంలోని వక్తలు పేర్కొన్నారు.

సమాజంలో సమరసత ఆవశ్యకత, ఆ దశలో కృషి చేయడానికి ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, సమాజంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళు లాంటి అంశాలపై  ఆగష్టు 19 నాడు  భాగ్యనగరంలో ‘సామాజిక సమరసతా వేదిక’ ఒక విస్తృత చర్చ నిర్వహించింది. ఇందులో భాగ్యనగరం, సికింద్రాబాద్ నుండి వివిధ రంగాలలో పని చేస్తున్న కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యక్రమానికి శ్రీ సి.ఎస్.రంగరాజన్, బాలాజి ఆలయం ప్రధాన అర్చకులు, డా.పి.భాస్కర యోగి ప్రముఖ రచయిత, ప్రొ. భీంరావు భోంస్లే, సెంట్రల్ యూనివర్శిటీ, ప్రొ. సర్ రాజ్ లు, శ్రీ కర్నె శ్రీశైలం, జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి అధ్యక్షులు, శ్రీ ఆదిత్య పరాశ్రీ దేవీ ఉపాసకులు సామాజికవేత్త తో పాటు సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పల ప్రసాద్ జి లు, ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ ఆయుష్ లు పాల్గొని, సభ్యులతో

ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ సి.ఎస్.రంగరాజన్ మాట్లాడుతూ, మన దేశం లో కొందరి వ్యక్తుల మద్యే తప్పితే ప్రజల మధ్య నిజంగ అంతరాలు లేవని, భగవంతుడు అందరికీ సమానమే అని శ్రీ రంగనాథ ఆలయంలో జరిగిన మునివాహన సేవ ను వివరించారు. 12 మంది ఆల్వారులలో 9 మంది ఆల్వారు స్వాములు బ్రాహ్మణేతరులు అని గుర్తు చేసారు.

రంగనాథ స్వామి ఆలయంలో నాడు జరిగిన సాక్షాత్తూ రంగనాథ స్వామి కోరిక మేరకు దళిత ఆల్వారు స్వామిని బ్రాహ్మణ పూజారి తన భుజస్కందాల పై మోసుకొచ్చి స్వామి వారి దర్శనం చేయించిన సంఘటనను వారు కార్యక్రమంలో ఉదహరించారు. ఇందుకోసమే నేటి సమాజంలోనూ ఇంకా వేళ్ళునుకోని ఉన్న అపోహలు భ్రమలను తొలగించేందుకు మునివాహన సేవ ఉద్యమాన్ని స్వామి దయతో మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. అదే విధంగ ఈ నెల 26 నుండి రక్షాబంధన్ ఉద్యమాన్ని కూడా చేపడుతున్నటు తెలియజేసారు. మన సమాజం లో అన్నా చెల్లిలు సోదర సోదరీమణుల గొప్ప అనుబంధం తగ్గిపోయి పాశ్చాత్య విష సంస్కృతి వేళ్ళూనుకోవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.

డా.పి.భాస్కర యోగి మాట్లాడుతూ రామాయణం పై పలువురు వ్యక్తులు దేశ విద్రోహ శక్తులు సృష్టిస్తున్న గందరగోళ పరిస్థితి పై కూలంకుశంగ వివరణ ఇస్తూ వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అసలు వాల్మీకి రామాయణానికి ఇతరులు రాసిన రామాయణానికి గల తేడాలను వివరించారు.

రామాయణంలో అసలు శంభూకుడి మరియు శబరి పాత్రల్లో వాస్తవమెంత అనేది వివరించారు. కార్యకర్తలంతా మన సమాజంలో ఉన్న ఈ హెచ్చుతగ్గులను రూపుమాపేందుకు కృషి చేయాలని అన్నారు. మనకు ఎటువంటి మనుస్మృతులు లేవని, మనకున్న ఏకైక స్మృతి డా.బి.ఆర్.రాంజీ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్మృతి ఒక్కటేనని అన్నారు.

అనవసరంగ శంభూకుడు మను స్మృతి లాంటి లేని పాత్రలు అవసరం లేని గ్రంథాలను ముందుకు తెచ్చి దళిత జనాన్ని ఏమార్చి సనాతన ధర్మానికి దూరం చేసే కుటిల ప్రయత్నం జరుగుతున్నదని ఆయన అన్నారు.

అంబేద్కర్ హిందూత్వాన్ని వీడుతానని చెప్పినా కూడా వెంటనే ఆ పని చేయలేదని జీవిత చరమాంకం దశలో తప్పక అది కూడా సనాతన భారతీయ ధర్మానికి హాని జరగకుండ విధేశీ మతాలను కాదని బౌద్దిజం స్వీకరించారని అన్నారు. అంతే కాకుండ పలువురు భారతీయ జాతీయ నేతలు సామాజికవేత్తలైన స్వామీ వివేకానందులు, భాగ్యరెడ్డి వర్మ, ఫూలె లాంటి గొప్ప నేతల యొక్క జీవన శైలిని వివరించారు.

శ్రీ ఆదిత్యా పరాశ్రి మాట్లాడుతూ, అంబేద్కర్ సనాతన ధర్మం కోసం పాటుపడ్డ మహనీయుడని ఆనాడు కొందరు స్వార్థపరుల వల్లే ఆయన ఆఖరి సమయంలో బౌద్దం స్వీకరించారని గుర్తు చేసారు.  అంబేద్కర్ చివరి దశలోనూ ఆయన గురువు సూచన మేరకు కాశీ వెల్లగా అక్కడ కూడా కొంతమంది స్వార్థపరులు ఆయనని అవమానించడం మరో ముఖ్య కారణం అని అన్నారు.

ఆచార్య సి.ఎస్.రంగరాజన్ ప్రారంభించిన మునివాహన సేవ ఉద్యమంలో మొదటగ దళితుడినైన నన్ను తన భుజాల పై మోస్తూ స్వామి దర్శనం అందించిన రంగరాజన్ గురుజి తనకెంతో ఆధర్శనీయులని కొనియాడారు ఆదిత్య పరాశ్రి. అంతే కాదు సనాతన ధర్మ వేదాలలో పురాణాలలో గ్రంథాలలో ఎక్కడా కూడా మనుషుల మద్య బేధాలున్నాయని కించిత్ వ్యాఖ్య కూడా లేనేలేదని ఆది పరాశ్రి తెలియజేసారు.

అంబేద్కర్ యొక్క జీవితం పూర్తిగా భారతీయ సంస్కృతి కి దగ్గరగ ఉండేదని, భారతీయతను పెంపొందించేందుకు ఆయనెంతో కృషి చేసారని ప్రొ.బీం రావ్ భోంస్లే అన్నారు. అందుకే ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తూ మనమంతా కూడా సమాజంలోని ప్రతి మదినీ కదిలిస్తూ వివరించాలని ఆయన గొప్పతనాన్ని ఆయనలోని భారతీయతని చాటి చెప్పి కులాల మధ్య అంతరాన్ని తొలగించాలని పిలుపునిచ్చారు.

ప్రొ.సర్ రాజ్ మాట్లాడుతూ తన బాల్యంలో తన గ్రామం నుండి అంటరానితనాన్ని ఏ విధంగ తొలగించే ప్రయత్నం చేయడం జరిగిందో, సామాజిక సమరసతకు ఎలా పాటుపడాలో కార్యకర్తలతో తన అనుభవాన్ని పంచుకున్నారు.

విధేశీ మిషనరీలు పనిగట్టుకుని దళితులను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వారి ఆగడాలను అరికట్టడానికి అందరు సహకరించాలని జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి నాయకులు కర్నె శ్రీశైలం కోరారు.

సామాజిక సమరసత వేదిక యొక్క విధివిధానాలను జాతీయ పునర్నిర్మాణ లక్ష్యాలను వేదిక కన్వీనర్ శ్రీ అప్పల ప్రసాద్ వివరించారు. భవిష్యత్ లో సమరసత వేదిక ను ఏ విధంగ విస్తరించి జనాలందరికి చేరువ చేయాలో దిశా నిర్థేశం చేసారు.

చివర్లో శ్రీ ఆయుష్ మాట్లాడుతూ సోషల్ మీడియాను ఉపయోగించుకుని దేశంలో జరుగుతున్న సమాజ విద్రోహ చర్యలను ఏ విధంగ అరికట్టవచ్చో దేశంలో కులాల ఘర్షణలపై జనాలను ఏ విధంగ చైతన్యం చేయవచ్చో వివరించారు.

కార్యక్రమంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బీహార్ వాజపేయీ గారి మృతికి మరియు కేరళ రాష్ట్రం లో సంభవించిన వరదల్లో మరణించిన ప్రజలనుద్దేశించి మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.

కేరళ రాష్ట్రం వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

– రాంబాబు దొంతమల్ల, 9701330133