Home News అన్నింటా ధార్మిక అభివృద్ధి.. యోగీ జీ కార్యసిద్ధి

అన్నింటా ధార్మిక అభివృద్ధి.. యోగీ జీ కార్యసిద్ధి

0
SHARE

-సత్యేంద్ర త్రిపాఠి

స్వరాజ్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నందుకు నిదర్శనంగా యావత్ భారతదేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న వేళ భారతదేశపు అత్యంత పటిష్టమైన, చురుకైన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఒక నమూనాగా నిలుస్తున్నది. కాలం గడుస్తున్న కొద్దీ, భారత్ ఎంతగానో వృద్ధి చెందింది. ప్రజాస్వామిక విధానాలను బలోపేతం చేసింది. అవి భారతీయుల జీవన విధానంలో భాగమైపోయాయి. ఎన్నికల్లో ఓటు వేయడం తమ హక్కుగా క్షేత్ర స్థాయి నుంచి ప్రజలు భావించసాగారు. తమ అభివృద్ధికి, సౌభాగ్యానికి, భద్రతకు భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో భారతీయులు వారి ఓట్లను వినియోగించుకుంటున్నారు. గతంలో కేవలం ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక సమరసత పాలనకు పర్యాయపదంగా ఉండేవి. కానీ భారతదేశపు ఆచార విచారాలు అంటే ఆధ్యాత్మికత ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వ్యవస్థాపకులు దీనదయాళ్ జీ ఆలోచన అయినటువంటి పూర్ణమైన మానవాత దృష్టి పాలనకు కీలకమైనది.

అలనాటి రామరాజ్యంలోనే ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేసింది భారత్. చాణుక్యులవారు ప్రవచించిన భారత్ రాజ్యం అనే ఆలోచన ప్రజలందరికీ భద్రత, సంక్షేమం- ‘యోగక్షేమ’ నుంచి ఆవిర్భవించింది. పౌరుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, నైతిక కడకు ఆధ్యాత్మిక జీవనంలో ప్రభుత్వం ఒక ప్రభావితమైన పాత్ర పోషిస్తుంది. అది పౌరుల సంపూర్ణమైన జీవనాభివృద్ధికి దారి తీస్తుంది.

రామరాజ్యంలో పాలన ప్రజాస్వామ్యబద్ధమైనది. పౌరుల యోగక్షేమాలకు తోడు రాజ్యం లోపల నుంచి రాజ్యం వెలుపలి నుంచి వారికి ఎలాంటి ముప్పులు లేకుండా అహరహం పాటుపడింది.

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయ: I
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి II
(భగవద్గీత 3వ అధ్యాయం, 20వ శ్లోకం)
(తమ ధర్మములను, విహిత కర్మలను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు. కావున నీవు కూడా స్వార్థం వదిలిపెట్టి లోకహితం కోసం కర్మలు చేయడానికే నీకు అర్హత ఉంది.)

లోకహితం లేదా సర్వ హితం, నిర్మల హృదయంతో నిస్వార్థ సేవ ప్రాముఖ్యతను భగవద్గీత విశదపరిచింది. భారత్‌లో పేదరికాన్ని నిర్మూలించి, సుసంపన్నత పథం పైకి దేశాన్ని చేర్చడానికి మనం పాటుపడుతున్న ప్రస్తుత తరుణంలో భగవద్గీతలోని పై శ్లోకం ఎంతగానో ఆచరణీయమైనది.

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలను కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి కైవసం చేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లో హైందవేతరులు అత్యధికంగా నివసించే స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనే ఆలోచనకు ఘన విజయం దక్కింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, పాలనను ప్రజాతీర్పు ప్రతిబింబించింది.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన సమయంలో భారత్ అత్యంత కష్టకాలాన్ని చవిచూసింది. పెద్ద సంఖ్యలో పౌరులను కోల్పోయింది. ఇది యావత్ ప్రపంచానికి ఒక సామాజిక నష్టమే కాదు ఆర్థికపరంగా పెను నష్టం కూడాను.

అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సామాన్యులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యక్ష నగదు బదలీ లేదా ఆహార పంపిణీకి యావత్ దేశ ప్రజల నుంచి అనూహ్యమైన అభినందనలు వెల్లువెత్తాయి.

ఒకానొక అధ్యయనం ప్రకారం, దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కోవిడ్‌ను కట్టడి చేయడంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యంత సమర్థమంతంగా పని చేసింది. 40 లక్షల మంది వలస కార్మికులు వారి స్వస్థలాలకు తిరిగి చేరుకున్న తరుణంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభపు ప్రభావాన్ని నామమాత్రం చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది.

ఆధ్యాత్మిక రాజధాని

ఉచితంగా ఆహార పంపిణీ ద్వారా వలస కార్మికులకు భరోసా కల్పన, ప్రయాణికులందరికీ ఉచిత రవాణా సదుపాయాల ఏర్పాటు, తగినంత వైద్య ఆరోగ్య పరిరక్షణ సదుపాయాలు లాంటి చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారి ప్రభావాన్ని తగ్గించింది.

ఇలాంటి సమయంలోనే, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉత్తరప్రదేశ్ వినుతికెక్కింది. అంతేకాకుండా భారతదేశానికి ఒక సాంస్కృతిక రాజధానిగా ఆవిర్భవించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘Invest UP Summit’ రాష్ట్రానికి రూ.80 వేల కోట్ల మేరకు పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్రంలో ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. ODOP (one district one product- ఒక జిల్లా ఒక ఉత్పత్తి) కార్యక్రమం తమదైన సొంత వెంచర్లను ఆరంభించే దిశగా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ కార్యసిద్ధి ఫలితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ సాకారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధానిగా ఉత్తరప్రదేశ్ అవతరించింది. గతంతో పోలిస్తే, ఇటీవలి కాలంలో ఆధ్మాతిక పర్యాటకంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేస్తున్న పర్యాటకుల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగింది.

“ఏదేనీ రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి సమతూకంగా ఉండాలి, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తికి చేరాలి” అన్న పండిట్ దీన్‌దయాళ్ జీ మాటలకు నిదర్శనంగా ఉత్తరప్రదేశ్ నిలుస్తున్నది.

Source : ORGANISER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here